»   » ప్రముఖ క్రికెటర్‌తో ఆ హీరోయిన్ ఎఫైర్ నిజమే, ఇదిగో సాక్ష్యం... (ఫోటోస్)

ప్రముఖ క్రికెటర్‌తో ఆ హీరోయిన్ ఎఫైర్ నిజమే, ఇదిగో సాక్ష్యం... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'చక్ దే ఇండియా'లో నటించిన సాగరిక ఘట్కే, ప్రముఖ క్రికెటర్ జహీర్ ఖాన్ మధ్య ఎఫైర్ ఉందని, ఇద్దరూ కలిసి కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నారని ఇంతకాలం రూమర్స్ వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ రూమర్స్ నిజం అయ్యాయి.

ఇన్నాళ్లూ స్రీకెట్ గా ఎఫైర్ సాగించిన ఈ జంట... తాజాగా అఫీషియల్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ట్విట్టర్ ద్వారా జహీర్ ఖాన్ ఈ విషయాన్ని ఖరారు చేసారు. ఇద్దరూ కలిసి దిగిన ఫోటోను పోస్టు చేసారు.

ఎంగేజ్మెంట్

తమకు ఎంగేజ్మెంట్ అయిన విషయాన్ని ఖరారు చేస్తూ జహీర్ ఖాన్ సెల్ఫీ ఫోటో పోస్టు చేసాడు. జహీర్ తన వేలిక తొడిగిన ఎంగేజ్మెంట్ రింగును చూపిస్తూ సాగరిక ఘట్కే ఫోట్కే ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

సర్పైజ్ అయిన సాగరిక

సర్పైజ్ అయిన సాగరిక

ముంబై మిర్రర్ తో సాగరిక మాట్లాడుతూ.... ‘ఇది నాకు సర్పైజ్ లాంటిదే. ఐపీల్ మిడిల్ సీజన్లో ఇలాంటి సర్పైజ్ ఎదురవుతుందని నేను ఊహించలేదు. మ్యాచ్ మధ్యలో రెండు రోజులు సిటీకి దూరంగా వెళ్లాలని అనుకున్నాం. గోవా వెళ్లాం... అక్కడ ఎంగేజ్మెంట్ అలా జరిగిపోయింది అని సాగరిక తెలిపారు.

డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు

డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు

పెళ్లి ఎప్పుడు అనే విషయానికి సాగరిక స్పందిస్తూ.... ముందు ఐపీల్ పూర్తి కావాలి. తర్వాత పెళ్లి డేట్ విషయంలో ఓ నిర్ణయానికి వస్తాం. ప్రస్తుతం జహీర్ ఫోకస్ అంతా ఐపీఎల్ మ్యాచ్ మీదనే ఉంది. పెళ్లి గురించి ఇపుడు ఆలోచించి ఒత్తిడి తీసుకోవడం అవసరం లేదనుకుంటున్నామని సాగరిక తెలిపారు.

ఇన్నాళ్లు ఎందుకు రహస్యంగా..

ఇన్నాళ్లు ఎందుకు రహస్యంగా..

ఇన్నాళ్లు మీ రిలేషన్ షిప్ విషయాన్ని ఎందుకు రహస్యంగా ఉంచారు? అనే ప్రశ్నకు సాగరిక స్పందిస్తూ.... కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాం. కొన్ని పర్సనల్ ఉంటాయి. మా రిలేషన్ అనేది పర్సనల్ అని సాగరిక అన్నారు.

తొలిసారిగా యువరాజ్ పెళ్లి వేడుకలో

తొలిసారిగా యువరాజ్ పెళ్లి వేడుకలో

జహీర్ ఖాన్, సాగరిక మధ్య ఎఫైర్ ఉన్న విషయం తొలిసారిగా యువరాజ్ సింగ్ వెడ్డింగ్ సమయంలో అందరికీ తెలిసిపోయింది. ఆ వేడుకకు ఇద్దరూ కలిసి హాజరయ్యారు.

English summary
Sagarika Ghatge is no more single. The 'Chak De' actress who was rumoured to be dating cricketer Zaheer Khan finally got engaged to him in an unexpected move. Her beau took to his Twitter handle to make the announcement and even posted a cute picture with his fiancee.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu