»   » సూపర్ హిట్ సినిమాకు 'ఝండూ బామ్' తలనొప్పి

సూపర్ హిట్ సినిమాకు 'ఝండూ బామ్' తలనొప్పి

Posted By:
Subscribe to Filmibeat Telugu

తలనొప్పికి వాడే ఝండూభామ్ ఇప్పుడు ఓ సూపర్ హిట్ సినిమా దబాంగ్ కు తలనొప్పిలా తయారైంది. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఆ చిత్రంలో తమ అనుమతి లేకుండా 'ఝం డూ బామ్' అనే పదాన్ని ఉపయోగించినందుకు ద బాంగ్ సినిమా నిర్మాతలైన అర్బాజ్‌ఖాన్ ప్రొడక్షన్స్‌కు ఇమా మీ సంస్థ లీగల్ నోటీసులు పంపింది. సల్మాన్‌ఖాన్ నటించిన ఈ సినిమాలో ఛయ్య ఛయ్యా ఫేమ్ మలైకా అరోరా.. 'మున్నీ బద్‌నాం హుయీ' అంటూ ఓ ఐటెమ్ సాంగ్ చేసింది. ఈ పాటలోనే ఝండూబామ్ అనే పదం కూడా వస్తుంది. తమ అనుమతి లేకుండా తమ బ్రాండుపేరును ఆ పాటలో ఉపయోగించి, కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడినందుకే లీగల్ నోటీసు పంపినట్లు ఇమామి సంస్థ డైరెక్టర్ మోహన్ గోయెంకా తెలిపారు. ఇక మన తెలుగు సినిమాల్లో చాలా వాటికి తలనొప్పి తగ్గించే ఝండూబామ్, అమృతాంజన్ లు వారు ఎదురుడబ్బులివ్వాలి. ఎందుకంటే ఆ సినిమాల వల్ల ఈ సంస్ధల మార్కెట్ బాగా పెరుగుతుంది కాబట్టి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu