twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్‌చరణ్‌ ‘తుఫాన్’ బిహైండ్ స్టోరీ ? (ఫోటో ఫీచర్)

    By Srikanya
    |

    హైదరాబాద్: రామ్‌చరణ్ హీరోగా నటిస్తోన్న తొలిహిందీ చిత్రం 'జంజీర్'. ప్రియాంక చోప్రా హీరోయిన్ . అపూర్వ లాఖియా దర్శకుడు. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్-అడాయ్ మెహ్రా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. తెలుగులో 'తుఫాన్' పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ నెల 6న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకానుంది.

    అమితాబ్ బచ్చన్ నటించిన అలనాటి క్లాసిక్ చిత్రం 'జంజీర్' ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. 'ఎ' సర్టిఫికెట్ లభించింది. కేరళ, తమిళనాడులో దాదాపు 200థియేటర్లలో రిలీజవుతుండడం విశేషం. జంజీర్‌, తుఫాన్‌ రెండు వెర్షన్లను అన్ని నగరాల్లోనూ ప్రముఖ థియేటర్లలో రిలీజ్‌ చేస్తుండడం గమనార్హం. ప్రకాష్‌రాజ్‌, తనికెళ్ల భరణి, మహిగిల్‌ కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారిగా నటిస్తున్నారు. ఇప్పటికే పాటలకు అనూహ్య స్పందన వచ్చింది.

    రామ్‌చరణ్ ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపిస్తాడు. ముంబై నగరాన్ని గడగడలాడిస్తున్న చమురు మాఫియా భరతం పట్టే సమర్థవంతమైన పోలీస్ అధికారి పాత్రలో రామ్‌చరణ్ అద్భుతమైన నటనను కనబరిచాడు. హిందీ, తెలుగు ప్రేక్షకులు మెచ్చేలా ఈ సినిమాను తీర్చిదిద్దాం. సెన్సార్ సభ్యులు కూడా సినిమా బాగుందని ప్రశంసించారు. హిందీలో సంజయ్‌దత్ చేసిన పాత్రను తెలుగులో శ్రీహరి చేశారు. విలన్‌గా ప్రకాష్‌రాజ్ పాత్ర ప్రధానాకర్షణగా వుంటుంది.

    దర్శకుడు మీడియాతో మాట్లాడిన విశేషాలు... స్లైడ్ షో లో

    రామ్ చరణ్ ఎందుకు ఎంచుకున్నానంటే..

    రామ్ చరణ్ ఎందుకు ఎంచుకున్నానంటే..

    'జంజీర్‌' సినిమా రీమేక్‌ చేస్తానంటే... ముందుకొచ్చే హీరోలు చాలా మంది ఉంటారు. అయితే నాకు ఎలాంటి ఇమేజ్‌ లేని... ఓ నటుడు కావాలి. కేవలం ఏసీపీ విజయ్‌ మాత్రమే కనిపించాలి. 'జంజీర్‌'లో నటించిన తరవాతే అమితాబ్‌ బచ్చన్‌కి తిరుగులేని పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. అంతకు ముందు మిగతా హీరోల్లో ఆయన ఒకరు. తెలుగులో రామ్‌చరణ్‌ ఓ స్టార్. అయితే బాలీవుడ్‌లో ఇదే తొలి సినిమా కాబట్టి ఎలాంటి అంచనాలూ లేకుండా చూస్తారు. ఈ సినిమాకి అది చాలా ముఖ్యం అన్నారు.

    కసి రామ్ చరణ్ లో చూశా ...

    కసి రామ్ చరణ్ లో చూశా ...

    నూటికి నూరుశాతం. చరణ్‌ ఓ గొప్ప డాన్సర్‌, యాక్షన్‌ ఘట్టాల్లో అద్భుతంగా రాణిస్తాడు అనే మాటలు నేను విన్నా. 'మగధీర' చూస్తే వాటిలో ఏమాత్రం అతిశయోక్తి లేదనిపించింది. చరణ్‌లో ఓ మంచి నటుడు ఉన్నాడనే విషయం 'జంజీర్‌' చూస్తే అర్థమవుతుంది. అమితాబ్‌ బచ్చన్‌ పాత్ర పోషిస్తున్నాననే విషయాన్ని ఎప్పుడో మర్చిపోయాడు. ఆ విషయం బుర్రలో ఎక్కించుకోలేదు. ఈ పాత్ర కోసం చాలా తపించాడు. 'మరొకరు వేలెత్తి చూపించకూడదు' అనే కసి అతనిలో చూశా.

    'విజయ్' క్యారెక్టర్ టాప్..

    'విజయ్' క్యారెక్టర్ టాప్..

    బాలీవుడ్‌లో 'విజయ్' అనే పాత్రకు ఓ ప్రత్యేకత ఉంది. ఆ పాత్ర పేరు వింటేనే సినిమాలో విలన్లకు సింహస్వప్పం. ఇక విజయ్ పాత్ర పేరుపై పెటెంట్ హక్కులన్నిసూపర్‌స్టార్ అమితాబ్‌కే. విజయ్ పాత్రతో అమితాబ్ సాధించిన విజయాలు కూడా ఎక్కువే. విజయ్ పాత్రతో బాలీవుడ్‌లో అమితాబ్ ఓ ట్రెండ్ సృష్టించారు. ఎన్నో ప్రత్యేకతల్ని అమితాబ్‌కు సంపాదించి పెట్టిన విజయ్ పాత్రతో జంజీర్ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో సంచలనం సృష్టించారు. అలాంటి పాత్ర టాలీవుడ్ హీరో రాం చరణ్ తేజను వెదుక్కుంటూ రావడమే కాకుండా బాలీవుడ్ అవకాశాన్ని కల్పించింది. దాంతో రాంచరణ్ ఆలోచనలో పడ్డాడు.

    అదే కారణం...

    అదే కారణం...

    ఓ దశలో జంజీర్ చిత్రాన్ని చేయకూడదని నిర్ణయం తీసుకునే సమయంలో మెగాస్టార్ చిరంజీవి జూనియర్ మెగాస్టార్‌కు ధైర్యాన్ని నూరిపోసి అంగీకరంచేలా చేశారు. ఇదే విషయాన్ని రాంచరణ్ ఇటీవల ఓ వార్తా ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జంజీర్ చిత్రానికి అంగీకరించడానికి తన తండ్రి కారణం అంటూ చెప్పాడు.

    శ్రీహరి...

    శ్రీహరి...

    ఇక శ్రీహరి గురించి చెప్పుకోవాలి. ఆయనలాంటి మనిషిని నేనింత వరకూ చూళ్లేదు. స్నేహమంటే ప్రాణమిస్తారు. నిజంగా నేను అమ్మాయి అయితే ఆయన్ని పెళ్లిచేసుకొనేవాడినేమో..? అంతబాగా నచ్చారు.

    స్క్రిప్టు నమ్మే....

    స్క్రిప్టు నమ్మే....

    ఈ చిత్రం కోసం తనను సంప్రదించినప్పుడు సందిగ్ధంలో పడ్డానని, అమితాబ్ పోషించిన పాత్రపై చాలా అంచనాలు ఉంటాయని.. జంజీర్ చిత్రం చేయాలా వద్దా అని నిర్ణయం తీసుకోవడానికి ఆలోచిస్తున్నపుడు... నాలో విశ్వాసాన్ని నింపి..ఇలాంటి అవకాశాలు అరుదుగా వస్తుంటాయని.. ఎక్కువ ఆలోచించక జంజీర్ చిత్రంలో నటించు అని చిరంజీవి తెలిపినట్టు రాంచరణ్ వెల్లడించాడు స్క్రిప్ట్ బాగాలేకుంటే తప్ప.. చిత్రాన్ని రిజెక్ట్ చేయకు అని చెప్పడంతో తాను జంజీర్ ను అంగీకరించాను అని చరణ్ తెలిపాడు.

    పాత జంజీర్‌ కి మార్పులు

    పాత జంజీర్‌ కి మార్పులు

    ఉన్నది ఉన్నట్టు తీయాలనుకొంటే మళ్లీ అన్ని కోట్లు ఖర్చు చేయడం ఎందుకు? 'జంజీర్‌' కథని మాత్రమే తీసుకొన్నాం. ఈతరం ప్రేక్షకుల ఆశలకు, అంచనాలకు తగినట్టు మలిచాం. తుఫాన్‌, జంజీర్‌లకూ వ్యత్యాసం ఉంటుంది. తెలుగులో పాటలు, వినోద సన్నివేశాలు జోడించాం. ఎందుకంటే చరణ్‌ అంటే అభిమానులు అవన్నీ ఆశిస్తారు కదా? అన్నారు.

    చిరుసార్‌కి చూపించాం....

    చిరుసార్‌కి చూపించాం....

    అమితాబ్ కి చూపించ లేదు. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల చిరుసార్‌కి చూపించాం. 'చాలా బాగుంది..' అన్నారు. ఒక్క మార్పు కూడా సూచించలేదు. 'వంద శాతం బాగుంది.. ఇలా ఉంటేనే ప్రేక్షకులకు నచ్చుతుంది' అన్నారు.

    రెండేళ్లకు ఓ సినిమా చాలు...

    రెండేళ్లకు ఓ సినిమా చాలు...

    పదేళ్ల సినీ ప్రయాణంలో కేవలం అయిదు సినిమాలే చేశా. రెండేళ్లకు ఓ సినిమా చాలు. మధ్యలో విరామం బాగా తీసుకొంటా. ఎందుకంటే జీవితాన్ని కూడా ఆస్వాదించాలి కదా? మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం ముఖ్యం. ఆ తరవాతి సినిమా కోసం ఆలోచించే వీలు చిక్కుతుంది.

    అలా ఫిక్స్ అయ్యా...

    అలా ఫిక్స్ అయ్యా...

    ‘మగధీర' ఫైట్ సీన్స్‌లో తనలో ఫైర్ చూశాను. దాంతో నమ్మకం కుదిరింది. నా నమ్మకాన్ని చరణ్ నిజం చేశాడు. విజయ్ పాత్రను తను బాగా చేశాడు. ఈరోజు నేను చెప్పిన మాటతో రేపు ప్రేక్షకులూ ఏకీభవిస్తారు.

    వివాదం...

    వివాదం...

    ‘జంజీర్' ఒరిజినల్ స్టోరీ రైటర్స్ సలీమ్-జావేద్ రాయల్టీ విషయంలో వివాదం చేశారు. వాస్తవానికి ఈ వివాదంతో నాకు సంబంధం లేదు. అది సదరు రచయితలు, నిర్మాతలకు సంబంధించినది. ఈ వివాదం వచ్చినప్పుడు నేను భయపడలేదు. సినిమాపైనే దృష్టి పెట్టాను. సలీమ్-జావెద్ అంటే నాకు గౌరవం ఉంది. వాళ్లు అద్భుతమైన కథ సృష్టించారు. ఇంతకు మించి ఈ వివాదం గురించి నేనేం మాట్లాడలేను.

    సినిమాలు వేరు, రాజకీయాలు వేరు.

    సినిమాలు వేరు, రాజకీయాలు వేరు.

    ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల గురించి మీకు తెలిసే ఉంటుంది. సీమాంధ్రలో ‘తుఫాన్'ని అడ్డుకుంటామంటున్నారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడమే సినిమా ముఖ్యోద్దేశం. అది రాజకీయం కావడం బాధాకరమే. రాజకీయాలతో సంబంధం లేకుండా ఇంటిల్లిపాదీ టీవీ చూస్తున్నారు. అలాగే సినిమాని కూడా చూడాలని విన్నవించుకుంటున్నాను. ప్రేక్షకుల కోసమే మేం సినిమాలు తీస్తున్నాం. వాళ్లే చూడకపోతే ఇంకేం చేయగలం?

    English summary
    Big B might have praised it, but the jury would still be out whether the remake of ZANJEER would create the same kind of phenomenon and a cult movie that the original ZANJEER was? The premise is being put forward owing to the fact that all the promos associated with the remade ZANJEER are taking pains to underline that it is not a remake of ZANJEER as it was a cult film and it would not be possible to reach that status. Well, if that being the case, then the next logical question would be, why name the film as ZANJEER in the first place. It is being underlined that the remade ZANJEER is a tribute to the cult ZANJEER, a sort of a director Apoorva Lakhia's take on ZANJEER.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X