»   » నాగ్ ‘భాయ్’కి జీటీవీ రికార్డు రేటు

నాగ్ ‘భాయ్’కి జీటీవీ రికార్డు రేటు

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : అక్కినేని నాగార్జున నటిస్తున్న 'భాయ్' మూవీ శాటిలైట్ రైట్స్ జీటీవీ సంస్థ రికార్డు ధరకు సొంతం చేసుకుంది. రూ. 6 కోట్లకు ఈ చిత్రాన్ని సొంతం చేసుకుంది. నాగార్జున కెరీర్లో ఇంతకు ముందు ఏ చిత్రానికి కూడా ఈ రేంజిలో శాటిలైట్ రైట్స్ రాలేదు.

పూలరంగడు, అహనా పెళ్లంట ఫేమ్ వీరభద్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'భాయ్'. రీచాగోపాధ్యాయ్ హీరోయిన్. నాగార్జున పుట్టినరోజును పురస్కరించుకుని ఆగస్టు 29న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ మరియు ఎంటర్టెన్మెంట్ జోడించి ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

మాస్ ఆడియన్స్‌ను, ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే విధంగా సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో హంసా నందిని, కామ్న జెఠ్మలానీ, నథాలియా కౌర్‌, సోనూసూద్, ఆశిష్‌ విద్యార్థి, అజయ్‌, బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ తదితరులు నటిస్తున్నారు.

నథాలియా 'భాయ్' చిత్రంలో ఐటం సాంగులో అందాల విందు చేయనుంది. ఈ పాటను మాంచి మాస్ మసాలా దట్టించి యమ సెక్సీగా రూపొందించారు. ఈ పాటలో నాగార్జున గెటప్ కూడా వెరైటీగా ఉండనుంది. ఆమె అందాలను జుర్రుకునే మొనగాడిలా, అరబ్ షేక్ గెటప్ లో నాగార్జున కనిపించనున్నారు.

ఇక ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో పాత బస్తీ వాతావరణాన్ని తలపించేలా ప్రత్యేకంగా సెట్‌ని తీర్చిదిద్దారు. ఇక్కడ చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాకు హైలెట్ కానున్నాయి. నాగార్జున బాడీ లాంగ్వేజ్ కి తగిన విధంగా ఆయన పాత్ర ఉంటుందని దర్శకుడు వీరభద్రం చౌదరి అంటున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాత: నాగార్జున, దర్శకత్వత్వం: వీరభద్రం చౌదరి.

English summary
Tollywood handsome hero Nagarjuna starrer movie 'Bhai' has sold its satellite rights to leading entertainment channel Zee TV for a whooping price of Rs.6 crores.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu