»   » అలాంటి వ్యక్తి శాశ్వతంగా గుడ్‌బై చెప్పారు.. జీనత్ అమన్ కంటతడి.. విషాదంలో కరణ్ జోహర్

అలాంటి వ్యక్తి శాశ్వతంగా గుడ్‌బై చెప్పారు.. జీనత్ అమన్ కంటతడి.. విషాదంలో కరణ్ జోహర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ నటుడు వినోద్ ఖన్నా మృతితో బాలీవుడ్ శోక సముద్రంలో మునిగిపోయింది. హిందీ చిత్రపరిశ్రమలో జెంటిల్‌మెన్‌గా పేరుపొందిన వినోద్ ఖన్నాతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకొన్నారు. ఈ క్రమంలో అలనాటి నటి జీనత్ అమన్ ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొన్నారు. బాంబే 405 మైల్స్, ఖుర్బానీ తదితర చిత్రాల్లో నటించారు. షూటింగ్ సమయాల్లో హుందాగా ప్రవర్తించేవారు. సెట్లోకి వచ్చినా. సెట్ నుంచి వెళ్లినా హల్లో.. గుడ్ బై చెప్పేవారు. అలాంటి వ్యక్తి శ్వాశ్వతంగా గుడ్‌బై చెప్పేశాడు అని జీనత్ ఉద్వేగానికి లోనయ్యారు.

వినోద్ అందగాడు..

వినోద్ అందగాడు..

వినోద్ ఖన్నా చాలా అందగాడు. మహిళా నటులతో హుందాగా ప్రవర్తించేవారు. సెట్లో ఎవరిపైనా కోపగించుకోవడం గానీ, సహనం కోల్పోవడం గానీ చూడలేదు. ఎప్పుడూ చిరునవ్వు చిందిస్తూ జెంటిల్మన్‌లాగా వ్యవహరించేవారు. ఈ మధ్యనే వినోద్ ఖన్నాను కలిసి గత స్మృతులను గుర్తు చేసుకొన్నాం అని జీనత్ చెప్పారు.

విషాదంలో కరణ్ జోహర్

విషాదంలో కరణ్ జోహర్

వినోద్ ఖన్నా మృతికి ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ సంతాపం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకొన్నారు. తెరపై వినోద్ ఖన్నా నటనా ప్రతిభ నేటికి అసమానమైనంది. సూపర్‌స్టార్ హోదాలో ఆయన అందించిన స్ఫూర్తితోనే మేమంతా ఎదిగాం. ఆయన ఏ లోకాన ఉన్నా శాంతి చేకూరాలి అని కరణ్ ట్వీట్ చేశాడు. వినోద్ ఖన్నా మృతికి పలువురు ట్విట్టర్‌లో సంతాపం వ్యక్తం చేశారు.

ప్రీమియర్ రద్దు

ప్రీమియర్ రద్దు

బాలీవుడ్లో ప్రముఖ నటుడు వినోద్ ఖాన్నా ఆకస్మిక మృతితో బాహుబలి వరల్డ్ ప్రీమియర్‌ను దర్శకుడు కరణ్ జోహర్ రద్దు చేశాడు. ప్రముఖ నటుడు వినోద్ ఖన్నా మృతికి సంతాపంగా ముంబైలో ఏర్పాటు చేసిన వరల్డ్ ప్రీమియర్‌ను బాహుబలి2 యూనిట్ రద్దు చేయాలని నిర్ణయం తీసుకొన్నది అని కరణ్ జోహర్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. దీంతో గ్రాండ్ ఈవెంట్‌ను చూడాలనుకొన్న ప్రేక్షకులు, అభిమానులు కూడా నిరాశ ఎదురైంది.

ప్రముఖులకు కరణ్ ఆహ్వానం

ప్రముఖులకు కరణ్ ఆహ్వానం

హిందీలో బాహుబలి2 సినిమాను పంపిణీ చేస్తున్న ప్రముఖ దర్శకుడు కరణ్ జోహర్ బాలీవుడ్ ప్రత్యేకంగా వరల్డ్ ప్రీమియర్‌ను ఏర్పాటు చేశారని ముంబైకి చెందిన ప్రముఖ దినపత్రిక వెల్లడించింది. ఈ ఇన్విటేషన్‌కు సంబంధించిన కార్డులను పంపిణీ చేశారు. మంచి దళసరి కవర్ పేజీలతో ఇన్విటేషన్‌ను డిజైన్ చేశారు. వీటిపై గోల్డ్ టికెట్ అని ముద్రించారు. దానిపై వరల్డ్ ప్రీమియర్ బాహుబలి2 అని ముద్రించారు. బాహుబలి ప్రీమియర్ ఆహ్వానంపై బాహుబలిని శివగామి దేవి ఎత్తుకొన్న చిత్రాన్ని ముద్రించారు. బాహుబలి1 చిత్రానికి ఈ సీన్ హైలెట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

English summary
esteryear actor Zeenat Aman recalls the time spent with co-star Vinod Khanna, who died in Mumbai on Thursday. She said, I’ll always remember him as a thorough gentleman—cultured, polite and someone who knew how to conduct himself with ladies. With Vinod, things were always proper on the sets. He would come on time, say a polite hello, shoot and leave. Karan Johar has cancelled the premiere of Baahubali: The Conclusion in Mumbai as a mark of respect for the departed Vinod Khanna.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu