»   » జీరో రేటింగ్-హీరో రేటింగ్! డైలమాలో రామ్ చరణ్ ఫ్యాన్స్

జీరో రేటింగ్-హీరో రేటింగ్! డైలమాలో రామ్ చరణ్ ఫ్యాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన తొలి బాలీవుడ్ మూవీ 'జంజీర్' చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ బాలీవుడ్ భవిష్యత్‌ను నిర్ణయించే సినిమా కావడంతో ఈ చిత్ర ఫలితాలపై మెగా కుటుంబ సభ్యులతో పాటు, మెగా అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ చిత్రానికి పలు నేషనల్, ఇంటర్నేషనల్ వెబ్ సైట్ల మంచి రేటింగ్ ఇచ్చాయని ఆనంద పడాలో....కొన్ని పాపులర్ బాలీవుడ్ వెబ్ సైట్ల జీరో రేటింగ్ సైతం ఇచ్చినందుకు చితించాలో అర్థం కాని పరిస్థితి మెగా అభిమానుల్లో నెలకొంది. మరి రామ్ చరణ్ తొలి బాలీవుడ్ మూవీకి ఎవరు ఎలాంటి రేటింగ్ ఇచ్చారనే విషయాన్ని ఓ సారి పరిశీలిద్దాం.

ప్రముఖ బాలీవుడ్ వెబ్ సైట్ రెడిఫ్ రామ్ చరణ్-అపూర్వ లఖియా 'జంజీర్' చిత్రానికి జీరో స్టార్స్ రేటింగ్ ఇచ్చింది. క్షమించరాని బ్యాడ్ రీమేక్ అంటూ పేర్కొనడం గమనార్హం. బాలీవుడ్‌లైఫ్ అనే వెబ్ సైట్ జంజీర్ కేవలం 2 స్టార్స్ రేటింగ్ మాత్రమే ఇచ్చింది. సినిమా చూసిన వారు డిసప్పాయింట్ అవుతారని పేర్కొన్నారు.

ఫస్ట్ పోస్ట్ అనే మరో వెబ్ సైట్ ఈచిత్రానికి కేవలం 2 స్టార్ల రేటింగ్ ఇవ్వడంతో పాటు.....రామ్ చరణ్-ప్రియాంక కలిసి అమితాబ్-జయా నటించిన క్లాసిక్ సినిమాను మర్డర్ చేసారంటూ పేర్కొంది. ఇలాంటి రివ్యూలు రావడంతో 'జంజీర్' చిత్రంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని అంటున్నారు.

కాగా...టైమ్స్ ఆఫ్ ఇండియా 3 స్టార్స్, కాస్మోపాలిటన్(యుకె) 4 స్టార్స్, ఎమిరేట్స్ టైమ్స్ 3 స్టార్స్, హలో మేగజైన్(యుఏఈ)3.5 స్టార్స్, మేగజైన్ ఓమన్ 4 స్టార్స్, స్టార్ డస్ట్ పాకిస్థాన్ 4 స్టార్ రేటింగ్ ఇచ్చారు. మరి ఇలాంటి మిశ్రమ రివ్యూలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయో చూడాలి.

English summary
'Zanjeer is an unforgivably bad remake' Rediff review says. Rediff Rating is ZERO stars. Reviewer Raja Sen feels Apoorva Lakhia's Zanjeer is an unwarranted, atrocious remake.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu