»   » నేను దావూద్ బందువుని, సల్మాన్ నన్ను దూషించాడు: బిగ్ బాస్ కంటెస్టెంట్ హంగామా

నేను దావూద్ బందువుని, సల్మాన్ నన్ను దూషించాడు: బిగ్ బాస్ కంటెస్టెంట్ హంగామా

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రస్తుతం హిందీలో ప్రసారం అవుతున్న బిగ్‌బాస్‌ 11 నుంచి ఎలిమినేట్‌ అయిన జుబైర్‌ ఖాన్‌.. ఆ షో హోస్ట్‌ సల్మాన్‌ ఖాన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముంబై థానెలోని అంటాప్‌ హిల్‌ పోలీసు స్టేషన్‌లో ఆయన సల్మాన్‌పై ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. శనివారం బిగ్‌బాస్‌ షో సందర్భంగా సల్మాన్‌ తనను హెచ్చరించడాని జుబైర్‌ తన ఫిర్యాదులో ఆరోపించాడు. 'నిన్ను కుక్కను చేస్తారు. నువ్వు బయటకు రా.. నిన్ను విడిచిపెట్టను. నిన్ను ఇండస్ట్రీలో పనిచేయనివ్వను. నిన్ను కొట్టితీరుతాను' అని సల్మాన్‌ తనను బెదిరించినట్టు ఫిర్యాదులో జుబైర్‌ పేర్కొన్నట్టు తెలుస్తోంది. అతని ఫిర్యాదు కాపీ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

నానా హంగామా సృష్టించాడు.

నానా హంగామా సృష్టించాడు.

బిగ్‌బాస్‌ హౌస్‌లో అనారోగ్యానికి గురైన జుబైర్‌ ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ తీసుకొని ఆస్పత్రిలో చేరాడు. ఎలిమినేషన్‌కు నామినేట్‌ అయిన జుబైర్‌కు తక్కువ ఓట్లు వచ్చాయని, దీంతో అతన్ని హౌస్‌ నుంచి సాగనంపుతున్నామని సల్మాన్‌ ఆదివారం నాటి షోలో ప్రకటించాడు. అయితే, అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం బంధువుగా చెప్పుకుంటున్న జుబైర్‌లో హౌస్‌లో నానా హంగామా సృష్టించాడు.

హౌస్‌మేట్స్‌ను బెదిరించాలని చూశాడు

హౌస్‌మేట్స్‌ను బెదిరించాలని చూశాడు

తనకు అండర్‌ వరల్డ్‌తో సంబంధాలు ఉన్నాయంటూ తోటి హౌస్‌మేట్స్‌ను బెదిరించాలని చూశాడు. అంతేకాకుండా అర్షి ఖాన్‌తో గొడవపడి.. అసభ్య దూషణలు చేశాడు. దీంతో శనివారం నాటి ఎపిసోడ్‌లో నీ అసలు రంగు ఏంటో బయటపెడతానని జుబైర్‌ను సల్మాన్‌ హెచ్చరించాడు. జుబైర్‌ చెప్పుకుంటున్నట్టు అతనికి అండర్‌ వరల్డ్‌ సంబంధాలు లేవని సంకేతాలు ఇచ్చాడు.

దావూద్‌కి ఎలాంటి సంబంధం లేద‌ు

దావూద్‌కి ఎలాంటి సంబంధం లేద‌ు

ఇదంతా ఒక పక్కన పెడితే షో మొదట్లో తాను దావూద్ ఇబ్రహిం కి బందువుని అని చెప్పుకోవటం పై దావూద్ కుటుంబం సీరియస్ అయ్యింది. జుబైర్ ఖాన్‌కి, మాఫియా డాన్ దావూద్‌కి ఎలాంటి సంబంధం లేద‌ని, దావూద్ బంధువున‌ని చెప్పుకుంటూ అత‌డు ప‌బ్లిసిటీ చేసుకుంటున్నాడ‌ని దావూద్ కుటుంబీకులు ఆరోపించారు.

దావూద్ ఇబ్ర‌హీంతో బంధుత్వం

దావూద్ ఇబ్ర‌హీంతో బంధుత్వం

ఇలా త‌ప్పుడు వ‌రుస‌లు క‌లుపుకుంటున్నందుకు అత‌ని మీద కేసు పెడ‌తామ‌ని హెచ్చ‌రించారు. దావూద్ ఇబ్ర‌హీంతో బంధుత్వం ఉంద‌ని చెప్పుకోవ‌డ‌మే కాక‌, హ‌సీనా పార్క‌ర్ జీవిత క‌థ‌తో వచ్చిన చిత్రానికి స‌హ‌నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రించినట్టు జుబైర్ ఖాన్ చెప్పుకుంటున్నాడు.

జుబైర్ ఒక మోస‌గాడు

జుబైర్ ఒక మోస‌గాడు

ఈ విష‌యంపై దావూద్ కుటుంబానికి చెందిన స‌మీర్ ఆంట‌లే మాట్లాడుతూ - `జుబైర్ ఒక మోస‌గాడు. మా కుటుంబంతో అత‌నికి ఎలాంటి సంబంధాలు లేవు. ప్ర‌చారం కోసం దావూద్ పేరును వాడుకుంటున్నాడు. ఇలాగే కొన‌సాగితే పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తాం` అన్నాడు.

జుబైర్ చెబుతున్న విష‌యాల్లో వాస్త‌వం లేద‌ు

జుబైర్ చెబుతున్న విష‌యాల్లో వాస్త‌వం లేద‌ు

అంతేకాకుండా హ‌సీనా పార్క‌ర్ కూతురు ఖాద్సియాను పెళ్లి చేసుకున్న‌ట్లు, వారికి ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్న‌ట్లు, రెండేళ్ల క్రితం ఖాద్సియా త‌న‌ని వ‌దిలేసిన‌ట్లు జుబైర్ చెబుతున్న విష‌యాల్లో వాస్త‌వం లేద‌ని స‌మీర్ వెల్ల‌డించాడు. త‌న పిల్ల‌ల‌ను త‌న ద‌గ్గ‌ర‌కి ర‌ప్పించుకునే ప్ర‌య‌త్నంలో భాగంగానే తాను బిగ్‌బాస్‌లో పాల్గొనేందుకు అంగీక‌రించిన‌ట్లు జుబైర్ చెప్ప‌డం వ‌ల్ల ఖాద్సియా ఇబ్బందులు ఎదుర్కుంటోంద‌ని స‌మీర్ తెలిపాడు.

English summary
Sources inform that Zubair lodged a complaint against Salman for threatening him on national television and using his contacts to not let him work in the entertainment industry. He also mentioned Salman's derogatory comment of making him a dog once he is out of the house.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu