»   » సాంగ్ వచ్చింది మరింత హైప్ : ఈ సారి హిట్ పడితే ఇక ఎదురు లేనట్టే

సాంగ్ వచ్చింది మరింత హైప్ : ఈ సారి హిట్ పడితే ఇక ఎదురు లేనట్టే

Posted By:
Subscribe to Filmibeat Telugu

బీటౌన్ లో ఈ ఎడాది 'తాప్సీ' నటించిన 'పింక్‌' సూపర్ హిట్టు అయింది. అంతేకాదు ఈ సినిమా అవార్డుల మీద అవార్డుల్ని సొంతం చేసుకుంటోంది. 'పింక్' సినిమా ప్రమోషన్‌ బాధ్యతల్ని భుజాన వేసుకున్న ఈ బ్యూటీకి ఈ మూవీ విజయం సాధించడంతో ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తాజాగా వస్తున్న నామ్ షబానా మూవీ మంచి అంచనాలతో ఉంది ఇప్పుడు కొత్తగా చిత్రంలోని జుబి జుబి అనే సాంగ్ ని విడుదల చేశారు. ఆ సాంగ్ పై మీరు ఓ లుక్కేయండి.

తాప్సీ టాప్ హీరోయిన్ల రేసులో

తాప్సీ టాప్ హీరోయిన్ల రేసులో

బాలీవుడ్‌లో తాప్సీ పన్ను హవా జోరుగా కొనసాగుతున్నది. బేబీ, పింక్, ఘాజీ చిత్రాల తర్వాత తాప్సీ టాప్ హీరోయిన్ల రేసులో వచ్చింది. ప్రస్తుతం నామ్ షబానా అనే చిత్రంలో తాప్సీ నటిస్తున్నది. ఈ చిత్రాలకు ముందు తాప్సీ అంతగా గుర్తింపులేదు. చష్మే బద్దూర్ ‌చిత్రంతో బాలీవుడ్‌లోకి ప్రవేశించిన ఆమెకు సరైన సక్సెస్‌లు లభించకపోవడంతో లక్కీ గర్ల్‌గా ముద్ర పడలేదు.

తాప్సీ కోసం క్యూ కడుతున్నారు

తాప్సీ కోసం క్యూ కడుతున్నారు

కానీ తాజాగా ఆమె నటించిన చిత్రాలు వరుస విజయాలు సాధించడంతో నిర్మాతలు తాప్సీ కోసం క్యూ కడుతున్నారు. శివమ్ నైర్ దర్శకత్వం లో తాప్సి , అక్షయ్ కుమార్ , ప్రిథ్వీరాజ్ సుకుమారన్, మనోజ్ బాజ్పాయ్ , అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో హిందీ లో తెరకెక్కుతున్న మూవీ 'నామ్ షబానా'. ఈ చిత్రాన్ని తెలుగులో 'నేనే షబానా' పేరుతో రిలీజ్ చేయబోతున్నారు.

విలక్షణ పాత్రలో

విలక్షణ పాత్రలో

బేబీ, పింక్ చిత్రాల్లో అద్వితీయ నటనతో విమర్శకుల ప్రశంసలను అందుకొంది. తాజా చిత్రం నామ్ షబానాతో మరోసారి విలక్షణ పాత్రలో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తాప్సీ. ప్రస్తుతం బాలీవుడ్ లో తాప్సి బాగా బిజీ అయిపోయింది. నామ్ షబానా అనే చిత్రం పూర్తిగా తాప్సి పాత్ర మీదే ఆధారపడిన చిత్రం.

బేబి మూవీకి ప్రీక్వెల్

బేబి మూవీకి ప్రీక్వెల్

బేబి మూవీకి ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న యాక్షన్ స్పై థ్రిల్లర్ నామ్ షబానా చిత్రంలో ప్రధాన పాత్ర పోషించింది తాప్సీ. శివం నాయర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటించాడు. ఈ చిత్రంలో తాప్సీ బీభత్సమైన యాక్షన్‌ ఎపిసోడ్స్‌ చేసింది.

తెలుగులో నేనే షబాన

తెలుగులో నేనే షబాన

ఈ ఎపిసోడ్ కోసం హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ సిరిల్ రఫెల్లీ పర్యవేక్షణలో శిక్షణ తీసుకుంది . మార్చి 31,2017న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషలలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో ఈ చిత్రం నేనే షబాన అనే టైటిల్ తో విడుదల చేయనున్నారు.

rn

మరిన్ని అంచనాలు

ఇటీవల తెలుగు తో పాటు హిందీ భాషలకి సంబంధించిన ట్రైలర్ విడుదల చేసింది టీం. ఈ ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచింది. ఇక సినిమా రిలీజ్ మరింత దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ స్పీడ్ పెంచారు. తాజాగా చిత్రంలోని జుబి జుబి అనే సాంగ్ ని విడుదల చేశారు. ఆ సాంగ్ పై మీరు ఓ లుక్కేయండి.

English summary
The new song from 'Naam Shabana' titled 'Zubi Zubi', a recreated version of the song 'Zooby Zooby' from the Mithun Chakraborty starrer 1987 film 'Dance Dance', has been released.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu