twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    9 Hours Web Series Review : ఆసక్తి రేపిన 9 అవర్స్ సిరీస్ ఎలా ఉందంటే?

    |

    వెబ్ సిరీస్: 9 అవర్స్
    రిలీజ్ డేట్: జూన్ 2, 2022 (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో)
    నటీనటులు: నందమూరి తారకరత్న, మధుశాలిని, అజయ్, రవివర్మ, వినోద్ కుమార్, ప్రీతి అస్రాని, అంకిత్, రవిప్రకాష్, శ్రీతేజ్, సమీర్, 'జెమిని' సురేష్, రాజ్ మాదిరాజు తదితరులు
    దర్శకత్వం: నిరంజన్ కౌశిక్, జాకబ్ వర్గీస్
    రచన, సమర్పణ: కృష జాగర్లమూడి
    నిర్మాతలు: వై. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి
    ఎడిటింగ్: ధర్మేంద్ర కాకర్ల
    సినిమాటోగ్రఫీ: మనోజ్ రెడ్డి
    సంగీతం: శక్తికాంత్ కార్తీక్

    ఈ మధ్యకాలంలో దర్శకుడు క్రిష్ ఎక్కువగా నవలా సాహిత్యం మీద దృష్టి పెడుతున్నట్లు అనిపిస్తుంది ఆ మధ్య కొండపొలం అనే నవలను అనే పేరుతో వైష్ణవ్ తేజ్ రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా సినిమాగా తెరకెక్కించిన ఆయన ఇప్పుడు మల్లాది వెంకట కృష్ణమూర్తి అనే ఒక తెలుగు సూపర్ హిట్ రైటర్ రాసిన ఒక నవల ఆధారంగా 9 అవర్స్ అనే ఒక వెబ్ సిరీస్ రూపొందించారు.

    దీన్ని ఆయన సమర్పిస్తూ రచనా సహకారం కూడా అందించారు. తారకరత్న, అజయ్, మధుశాలిని, రవి వర్మ, రవిప్రకాష్ తదితరులు నటించిన ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, మరాఠీ, బెంగాలీ భాషల్లో విడుదలైంది. పూర్తిస్థాయి తెలుగు తారాగణంతో రూపొందించబడిన ఈ సిరీస్ ఎలా ఉంది అనేది సమీక్షలో తెలుసుకుందాం.

    కథ విషయానికి వస్తే

    కథ విషయానికి వస్తే

    కథంతా కూడా 1985 ప్రాంతంలో జరుగుతూ ఉంటుంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే డెక్కన్ ఇంపీరియల్ బ్యాంకు చెందిన మూడు బ్రాంచీలలో దోపిడీ జరుగుతుంది. రెండు బ్రాంచీలలో దోపిడీ జరిగిన తర్వాత దొంగలు బయటకు వెళ్ళిపోతారు కానీ కోటి బ్రాంచ్ లో మాత్రం అనుకోని పరిస్థితుల్లో ఇరుక్కుపోతారు.

    అక్కడ అఫ్జల్గంజ్ సీఐ ప్రతాప్(నందమూరి తారకరత్న) ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చేయవేయడంతో ఆ బ్యాంకు లోపల ఉన్న సిబ్బందిని, కస్టమర్లను విడిపించేందుకు స్పెషల్ ఆపరేషన్ ప్లాన్ చేస్తారు. అయితే బ్యాంకులో ఉన్న దొంగలను పోలీసులు పట్టుకున్నారా? లోపల ఉన్న బ్యాంకు సిబ్బందిని, ఇతర కస్టమర్లను కాపాడారా? ఈ బ్యాంకు దొంగతనానికి జైల్లో తప్పించుకున్న ఖైదీలకు సంబంధం ఏమిటి? లాంటి విషయాలన్నీ వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.

    విశ్లేషణ:

    విశ్లేషణ:

    మూలకథ ఒక నవల నుంచి తీసుకున్నా సరే ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో వెబ్ సిరీస్ టీమ్ మొత్తం సఫలమైంది. 9 అవర్స్ అనే పేరుకు తగ్గట్టే 9 ఎపిసోడ్లు ఉంటాయి. దోపిడీ ప్రారంభమైన మొదటి గంట నుంచి 9 గంటల వరకు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే విషయాన్ని ఆసక్తికరంగా చూపించారు.

    పేరుకు బ్యాంకు దోపిడీ అనే సందర్భాన్ని సృష్టించారు కానీ, ఆ బ్యాంకు దోపిడీలో భాగమైన వారి జీవితాలను స్పృసించడానికి ఎక్కువగా ప్రయత్నించారు. ఆ రోజుల్లో కూడా స్త్రీల మీద ఎలాంటి అఘాయిత్యాలు జరుగుతూనే ఉండేవి? డబ్బు కోసం ఎలాంటి పనులు చేయడానికి అయినా సిద్ధపడిన వారు సైతం కొన్ని విషయాల్లో వెనక్కి ఎందుకు తగ్గుతారు వంటి విషయాలను లాజికల్ గా చూపించారు. అసలు కథ పక్కన పెట్టి వ్యక్తిగత జీవితాలను పరిచయం చేసేందుకు సమయం తీసుకోవడంతో కాస్త సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది కానీ సిరీస్ ఆద్యంతం ఆసక్తికరంగా ఆకట్టుకునే విధంగా సాగింది.

    దర్శకుల టేకింగ్ విషయానికి వస్తే

    దర్శకుల టేకింగ్ విషయానికి వస్తే

    సిరీస్ మొత్తం మీద కూడా దర్శకుడు క్రిష్ మార్క్ కనిపిస్తూ ఉంటుంది. చనా సహకారం ఆయనదే కావడంతో బహుశా ఆయన శిష్యులే ఈ వెబ్ సిరీస్ నిర్మాణం విషయంలో కూడా భాగం పంచుకొని ఉండవచ్చు. కాబట్టి ప్రతి ఫ్రేమ్ లోనూ క్రిష్ మార్క్ కనిపిస్తుంది. తక్కువ డైలాగ్స్ తో, ఎక్కువ విజువల్స్ తో విషయాన్ని అర్థం చేసుకునే విధంగా క్రియేట్ చేయడం కోసం ఈ సిరీస్ టీమ్ మొత్తం కష్ట పడినట్లు కనిపిస్తుంది. దర్శకులు టేకింగ్ విషయానికి వస్తే అనవసర వ్యక్తిగత విషయాలను చూపించకుండా కాస్త త్వరగా కలలోకి తీసుకెళ్లి ఉంటే ప్రేక్షకులకు సాగదీసిన ఫీలింగ్ ఉండకుండా ఉండేది కానీ ఓవరాల్ గా చెప్పాలి అంటే దర్శకులు తమదైన టేకింగ్తో ఆకట్టుకునేందుకు ప్రయత్నించి కొంతమేర సఫలమయ్యారు.

    నటీనటుల విషయానికి వస్తే

    నటీనటుల విషయానికి వస్తే

    ఈ సిరీస్ కి ప్రధాన ఆకర్షణ నందమూరి తారకరత్న, అజయ్ అనే చెప్పాలి. సీఐ ప్రతాప్ గా తారకరత్న, జైల్లో ఖైదీ దశరధ రామయ్యగా అజయ్ తమ నట విశ్వరూపాన్ని చూపించారు. ఇక వినోద్ కుమార్, రవి ప్రకాష్, అజయ్, శ్రీతేజ్, రవి వర్మ, అంకిత్, ప్రీతి, రాజ్ మాదిరాజు, గిరిధర్, చిత్రం శ్రీను, రోహిణి, మధు శాలిని, బెనర్జీ వంటి వారు తమ పాత్రల పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు సిరీస్ మొత్తం మీద నటనకు ఆస్కారం ఉన్న పాత్ర రవి వర్మకు దక్కింది. మునుపెన్నడూ లేని విధంగా రవివర్మ నట విశ్వరూపాన్ని చూపించారు. ఇక మిగతా వాళ్ళు ఎవరికి పాత్రకు తగ్గట్టుగా వారు నటించారు.

    టెక్నికల్ విషయానికి వస్తే

    టెక్నికల్ విషయానికి వస్తే

    సిరీస్ మొత్తం మీద కూడా సమర్పకుడిగా, రచయితగా వ్యవహరించిన దర్శకుడు క్రిష్ మార్క్ కనిపిస్తుంది. మొత్తం మీద ఆయన ఈ సిరీస్తో మంచి విజయాన్ని అందుకున్నాడు అని చెప్పవచ్చు. సిరీస్ కాబట్టి పాటలకు ఎలాగా స్కోప్ లేదు నేపధ్య సంగీతం విషయంలో శక్తికాంత్ కార్తీక్ తన ప్రాణం పెట్టి పని చేశాడని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ అందించిన మనోజ్ రెడ్డి 1985 సంవత్సరానికి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించి కొంతమేర సఫలమయ్యాడు/ ఇక ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టిన ధర్మేంద్ర మరింత తన కత్తెరకు పని చెప్పి ఉంటే కాస్త బోరింగ్ ఫీలింగ్ తగ్గే అవకాశం కనిపించేది.

    ఫైనల్ గా చెప్పాలంటే

    ఫైనల్ గా చెప్పాలంటే

    9 ఎపిసోడ్ల ఈ 9 అవర్స్ సిరీస్ ఆద్యంతం ఆసక్తికరంగా ఆకట్టుకుంటుంది. ప్రతి ఎపిసోడ్ లోను ఒక కొత్త మలుపుతో ప్రేక్షకులను థ్రిల్ కు గురి చేసే ప్రయత్నం చేశారు కానీ షో మొత్తం నెమ్మదిగా సాగటంతో కొన్నిసార్లు ఆ థ్రిల్లింగ్ ఫీలింగ్ కూడా ఇబ్బంది పెడుతుంది. సిరీస్ చివర్లో కొన్ని ట్విస్టులు పెట్టారు కాబట్టి రెండో భాగం కోసం ఎదురు చూడాల్సిందే. ఇక ఎలాంటి అసభ్యతకు అశ్లీలతకు తావులేకుండా పూర్తిస్థాయి రూపొందించిన ఈ సిరీస్ ను ఫ్యామిలీతో కలిసి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒకసారి చూసేయొచ్చు.

    English summary
    Here is the Taraka Ratna and Madhu Shalini starrer 9 Hours Web Series Review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X