For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  A1 from Day 1 నన్ను అలా ఎగతాళి చేశారు.. ఆ నమ్మకమే బ్రాండ్‌గా మార్చింది.. నటి అస్మిత

  |

  వినోద పరిశ్రమలో యూట్యూబర్‌గా కెరీర్ ప్రారంభించిన నటి అస్మిత ప్రస్తుతం సక్సెస్ జర్నీతో దూసుకెళ్తున్నది. బుల్లితెరపై సీరియల్స్, వెండితెరపై నటిగా తనకంటూ ఇమేజ్‌ను సొంతం చేసుకొన్నారు. యాష్ ట్రిక్స్ టైటిల్‌తో డిజిటల్ మీడియాలో ఆమె చేస్తున్న వీడియోలకు మంచి ఆదరణ లభిస్తున్నది. మేకప్ కిట్స్ తయారీ విధానం, మేకప్‌కు సంబంధించిన మెటీరియల్ ఎక్కడ లభిస్తుంది అనే విషయాలపై యూజర్లకు అవగాహన కల్పించే వీడియోలతో నెటిజన్లకు ఆస్మిత చేరువయ్యారు. యాష్ ట్రిక్స్‌తో మంచి పాపులారిటీ సంపాదించిన నటి అస్మతి మరో అడుగు ముందుకు వేశారు. A1 from Day1 వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ప్రివ్యూ‌కు యాష్ ట్రిక్స్ ఫ్యామిలీ మెంబర్స్‌ను ప్ర‌త్యేక అతిథులుగా ఆహ్వానించారు.

  ఈ సంద‌ర్భంగా అస్మిత మాట్లాడుతూ.. న‌టిగా నా కెరియ‌ర్ బాగా బిజీగా ఉన్న టైంలో నేను డిజిట‌ల్ మీడియా వైపు అడుగులు వేశాను. టెలివిజన్ సీరియ‌ల్స్‌లో బిజీగా ఉన్న సమయంలో ఇదంతా ఏంటి అనే ప్ర‌శ్న‌లు తోటి న‌టీన‌టుల నుంచి వ‌చ్చాయి. దీన్ని ఎవ‌రు చూస్తారు అంటూ నా ఉత్సాహాన్ని నీరు గార్చే ప్రయత్నం చేశారు. నా ప్రయత్నాలను ఎగ‌తాళి చేసిన వారంద‌రూ నా మాదిరిగానే యూట్యూబ్ ఛానెల్‌ను పెట్టుకోవడం నాకు ఆనందంగా ఉంది. యాష్ ట్రిక్స్ విజ‌యం వెనుక నా భ‌ర్త సుధీర్ స‌హాకారం చాలా ఉంది. పెళ్ళి, పిల్ల‌ల‌తో మ‌హిళల కెరియ‌ర్ ఆగిపోతుందనే కాన్సెప్ట్ నాక‌స‌లు నచ్చదు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ప్రోత్సాహంతో యాష్ ట్రిక్స్ మొద‌లు పెట్టాను. వీడియోలకు వచ్చే ప్ర‌తీ కామెంట్‌ను చ‌దివే వాళ్లం. వారికి రిప్లై ఇచ్చే ఇవ్వడం ద్వారా మంచి స్పందన వచ్చేది. యాష్ ట్రిక్స్ ఒక బ్రాండ్‌గా మారిందంటే మా ఫాలోవర్స్‌కు మా మీద ఉన్న న‌మ్మ‌క‌మే కారణం. ప్రస్తుతం యాష్ ట్రిక్స్ నుంచి వెబ్ సిరీస్‌ను రిలీజ్ చేస్తున్నాం. సుధీర్, నేను భార్య భ‌ర్త‌లుగా న‌టిస్తున్న ఈ సిరీస్‌లో క‌మెడియ‌న్ ఆలీ గారు ముఖ్య‌మైన పాత్ర‌ను పోషించారు. డిసెంబ‌ర్ 10న ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. దీనిని చూసేందుకు రూ. 59.00 ధ‌ర నిర్ణ‌యించాం. మా వెబ్ సిరీస్‌కు స‌బ్‌స్క్రిప్ష‌న్ మొద‌లు అయ్యింది. ప్రివ్యూ త‌ర్వాత వ‌చ్చిన రెస్పాన్స్ చూస్తుంటే మా న‌మ్మ‌కం నిజం అయ్యింద‌నిపిస్తుంది అని అన్నారు.

  A1 from Day 1

  ద‌ర్శ‌కుడు, న‌టుడు సుధీర్ మాట్లాడుతూ.. యాష్ ట్రిక్స్ స‌క్సెస్ ఒక సుదీర్గమైన ప్ర‌యాణం. ఒక చిన్న టీమ్‌తో మొద‌లైన మా ప్ర‌య‌త్నం ఒక బ్రాండ్‌గా మారింది. ప్రస్తుతం A1 from Day1 వెబ్ సిరీస్ మొద‌లు పెట్టాల‌నే ఆలోచ‌న వ‌చ్చిన‌ప్పుడు అవ‌కాశాలు కోసం ప్ర‌య‌త్నించాం.. కానీ అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నించ‌డం కంటే వాటిని సృష్టించుకోవ‌డం మేలు అని గ్ర‌హించాం. అందుకే మా కంటెంట్ మీద న‌మ్మ‌కంతో పే ఫ‌ర్ వ్యూ కేట‌గిరీలో వెబ్ సిరీస్‌ను పెట్టాం. మేకింగ్‌లో క్వాలిటీ విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డ‌లేదు. భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య ఉండే చిలిపి తగాదాలు, అల‌క‌ల‌ను అందంగా చిత్రీక‌రించాం. డిసెంబ‌ర్ 10న సాయత్రం 5.30 pm కి స్ట్రీమింగ్ అవుతుంది. నా న‌ట‌న‌కు కూడా ప్ర‌శంస‌లు ద‌క్కుతుంటే ఆనందంగా ఉంది అని అన్నారు.

  English summary
  Actress Asmitha known for good reason is Yash Tricks youtube Channel. After successful Journey, She made a Web Series called A1 from Day 1. Here is the details of the Web series
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X