Hello World web series ఏ ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అంటే?
విభిన్నమైన, విలక్షణమైన కంటెంట్‌తో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాళీతో ఇతర భారతీయ భాషల్లో అద్బుతమైన కంటెంట్‌తో జీ5 (ZEE5) ప్రేక్షకులను సరికొత్త అనుభూతికి గురిచేస్తున్నది. జీ5 ఓటీటీ ఫ్లామ్‌తో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణను కూడగట్టుకొంటున్నది. తెలుగులో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నిర్మించిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరి మూవీ తర్వాత అన్నపూర్ణ స్టూడియో బ్యానర్‌పై వచ్చిన లూజర్ 2, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ రూపొందించిన గాలివాన, రెక్కీ, మా నీళ్ల ట్యాంక్ లాంటి చిత్రాలతో మరింత పాపులారిటీని సొంతం చేసుకొన్నది.
జీ5 మరో వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నది. ఒక ఆఫీస్ వాతావరణం నేపథ్యంలో జరిగే డ్రామా బ్యాక్ డ్రాప్‌ను హల్లో వరల్డ్ అనే వెబ్ సిరీస్‌కు మూలకథను ఎంచుకొన్నది. 8 ఎపిసోడ్స్‌గా సాగే వర్క్ ప్లేస్ స్టోరికి సంబంధించిన కథతో వస్తున్న ఆసక్తికరమైన టీజర్ అంచనాలు పెంచింది. ఎనిమిది మంది యువకులు తమ కష్టాలను వెనక్కి నెట్టి కోటి కలలతో ఒక మల్టీనేషనల్ ఐటీ కంపెనీలో చేరడం ఈ వెబ్ సిరీస్ ప్రధాన కథ అని దర్శకుడు శివసాయి వర్ధన్ జలదాంకి తెలిపారు. గతంలో గీతా సుబ్రమణ్యం అనే వెబ్ సిరీస్‌ను శివసాయి రూపొందించిన సంగతి తెలిసిందే.

కార్పోరేట్ ప్రపంచంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల జీవితం ఎలా సాగింది. వారి ఎదుర్కొన్న అనుభవాలు, నేర్చుకొన్న గుణాపాఠాలు వారిని ఎలాంటి మార్గనిర్దేశం చేశాయి అనేది ఆగస్టు 12 స్ట్రీమింగ్ అయ్యే హల్లో వరల్డ్ వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.
హల్లో వరల్డ్ వెబ్ సిరీస్ టీజర్ వీడియోను నిహారిక కొణిదెల ట్వీట్ చేసింది. అనేక కష్టాలు పడిన యువకులు కలిసికట్టుగా హల్లో వరల్డ్ అంటూ వస్తున్నారు. మీరు వారిని కలిసేందుకు రెడీగా ఉండండి అని ట్వీట్‌లో పేర్కొన్నది.
నటీనటులు: ఆర్యన్ రాజేశ్, సదా, రామ్ నితిన్, నయన్ కరిష్మా, సుదర్శన్ గోవింద్, నిత్యాశెట్టి, నిఖిల్ వీ సింహా, అపూర్వ రావు, గీలా అనిల్, స్నేహల్ ఎస్ కామత్, రవి వర్మ, జయప్రకాశ్ తదితరులు
స్క్రిప్టు రైటర్, దర్శకత్వం: శివసాయివర్ధన్ జే
సినిమాటోగ్రాఫర్: ఎడురోలు రాజు
మ్యూజిక్ డైరెక్టర్: పీకే దండి
ఎడిటర్: ప్రవీణ్ పూడి
క్యాస్టూమ్ డిజైనర్: ఆన్షి గుప్తా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మన్యం రాజేష్
రిలీజ్ డేట్: 2022-08-12


Click it and Unblock the Notifications











