HIT 2 OTT: అడివి శేష్ బిగ్గెస్ట్ హిట్ మూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే.. స్ట్రీమింగ్ ప్లాన్ రెడీ!

టాలెంటెడ్ యువ హీరో హీరో అడివి శేష్ నటించిన హిట్ 2 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. నేచురల్ స్టార్ నాని నిర్మించిన ఈ సినిమా మొదట కొంత విభిన్నమైన టాక్ అందుకున్నప్పటికీ ఆ తర్వాత మంచి బాక్సాఫీస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. పెట్టిన పెట్టుబడికి మంచి ప్రాఫిట్స్ అందించిన సినిమాగా హిట్ 2 నిలిచింది. అంతేకాకుండా అడివి శేష్ కెరీర్ లో కూడా అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకున్న సినిమాగా కూడా ఒక రికార్డ్ క్రియేట్ చేసింది.

ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ విడుదలపై కూడా చాలా రకాల రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇప్పటివరకు అయితే చిత్ర యూనిట్ సభ్యుల నుంచి అధికారికంగా ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఓటీటీ విడుదలపై ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను ఓటీటీ హక్కులను దక్కించుకోవడానికి బడా ఓటీడీ ఫ్లాట్ ఫామ్స్ పోటీ పడ్డాయి. మొదట హాట్ స్టార్ దక్కించుకోవాలని అనుకుంది. కానీ ఆ తర్వాత ఆమెజాన్ ప్రైమ్ భారీ ధరకు ఈ సినిమాను చేజెక్కించుకుంది.

Adivi sesh new movie hit 2 ott streaming release date streaming partner

ఇక ఓటీటీ లో ఈ సినిమా ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతోంది అనే వివరాల్లోకి వెళితే. మొన్నటి వరకు ఈ ఏడాది చివరిలో స్ట్రీమింగ్ కావచ్చు అని అనుకున్నారు. కానీ వీకెండ్స్ లో సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తుండడంతో క్రిస్మస్ సెలవులకు కూడా ఎంతో కొంత కలెక్షన్స్ రావచ్చు అని ఎదురుచూస్తున్నారు. అందుకే అప్పటివరకు ధియేటర్లో ఉండాలి అని న్యూ ఇయర్ సందర్భంగా మొదటివారంలో హిట్ 2 సినిమాను అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

Adivi sesh new movie hit 2 ott streaming release date streaming partner

ఒకవేళ అప్పుడు కూడా సినిమా కలెక్షన్స్ కొంత పెరిగితే సంక్రాంతి తరువాత ఓటీటీ లో విడుదల చేయవచ్చు అని సమాచారం. అమెజాన్ ప్రైమ్ అయితే న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమాను తీసుకురావాలి అని చూస్తోంది. త్వరలోనే ఈ విషయంలో అధికారికంగా ఒక క్లారిటీ అయితే రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X