twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Thunivu OTT: ఓటీటీలోకి అజిత్ 'తెగింపు' చిత్రం.. ఎన్ని రోజులకు విడుదల అంటే?

    |

    eకొత్త ఏడాది వచ్చిందంటేనే సంక్రాంతి వాతావరణం నెలకొంటుంది. ఇక సినిమాలు సందడి అంతా ఇంతా కాదు. సంక్రాంతి బరిలోకి స్టార్ హీరోలే దిగుతారు. మకర సంక్రాంతి వేళ స్టార్ హీరోల మధ్య సినిమాల పోటీ కోడిపందాలను తలపించేలా ఉంటుందని పలువురి అభిప్రాయం. ఇప్పటికే ఈ సంక్రాంతి బరిలో అగ్ర హీరోలు, నందమూరి నటసింహం బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవితోపాటు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, అజిత్ లు థియేటర్లలో పోటీ పడుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు అజిత్ తెగింపు (తునివు) సినిమాకు సంబంధించిన ఓటీటీ పార్ట్ నర్ విషయాలు హాట్ టాపిక్ గా మారాయి.

    మూడో చిత్రంగా..

    మూడో చిత్రంగా..

    సంక్రాంతి బరిలో పోటీగా దిగిన స్టార్ హీరోల్లో తలా అజిత్ ఒకరు. 2023 సంక్రాంతి బరిలోకి తెగింపు (తునివు) సినిమాతో గట్టి పోటీ ఇచ్చేందుకు వచ్చాడు తలా అజిత్. ఇటీవల అజిత్ నటించిన నేర్కొండ పార్వై (హిందీ పింక్ రీమేక్), వలిమై చిత్రాలకు దర్శకత్వం వహించిన హెచ్ వినోద్ ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించారు. అలాగే ఈ రెండు సినిమాలకు బాలీవుడ్ అగ్ర నిర్మాత బోనీ కపూర్ నిర్మించారు. జనవరి 11న విడుదలైన అజిత్ తెగింపు చిత్రానికి కూడా బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరించారు. అంటే అజిత్-వినోద్-బోనీ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన మూడో చిత్రం ఇది.

    ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ..

    ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ..

    యాక్షన్ డ్రామాగా వచ్చిన అజిత్ తాజా చిత్రం తెగింపులో ఫీమెల్ లీడ్ గా మంజు వారియల్ నటించగా సముద్ర ఖని, వీర, జాన్ కొక్కెన్, అజయ్, సీబీ చంద్రన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జనవరి 11న విడుదలైన ఈ సినిమా అంతగా పాజిటివ్ టాక్ తెచ్చుకోవట్లేదు. అజిత్ నిత్యం చేసే మాస్ మసాలా సినిమాలాగే ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కానీ కలెక్షన్ల పరంగా మాత్రం బాగానే ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం అజిత్ తునివు మూవీ డిజిటల్ పార్టనర్స్ ఎవరనే విషయం హాట్ టాపిక్ గా ఉంది. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన తెగింపు డిజిటల్ రైట్స్ కోసం తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది.

    ప్రముఖ ఓటీటీ దిగ్గజం..

    ప్రముఖ ఓటీటీ దిగ్గజం..

    అజిత్ తునివు చిత్రం ఓటీటీ హక్కుల కోసం చాలా సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ తెగింపు చిత్రం హక్కులను సొంతం చేసుకుందని సమాచారం. ఇందుకోసం నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తాన్ని అందజేసినట్లుగా ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇక ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ తర్వాత 4 వారాలకు కానీ, లేదా మూవీకి వచ్చే టాక్ ని బట్టి నిర్ణయిస్తారని అంటున్నారు. తెగింపు చిత్రం మరి నెగెటివ్ టాక్ తెచ్చుకుంటే విడుదలైన నెల రోజులకే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

    English summary
    Ajith Thunivu Digital Rights Goes To Netflix With Big Price And Will Stream After Theatrical Run Over
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X