Samrat Prithviraj ఓటీటీలో ఎప్పుడు? ఎక్కడ రిలీజ్ అంటే.. అక్షయ్ కుమార్ సినిమా దారుణంగా!

బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రముఖ దర్శకుడు చంద్రప్రకాశ్ ద్వివేది దర్వకత్వంలో రూపొందిన సామ్రాట్ పృథ్వీరాజ్ చిత్రం భారీ అంచనాల మధ్య జూన్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చారిత్రాత్మక నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను, సినీ విమర్శకులను పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. దాంతో ఈ సినిమా కలెక్షన్లు బాక్సాఫీస్ వద్ద పేలవంగా నమోదు అవుతున్నాయి.

Recommended Video

Ante Sundaraniki Movie Genuine Review *Reviews | Telugu Filmibeat

సామ్రాట్ పృథ్వీరాజ్ చిత్రం తొలి రోజున అంటే శుక్రవారం 10.70 కోట్లు, శనివారం 12.60 కోట్లు, ఆదివారం 16.10 కోట్లు, సోమవారం ఈ చిత్రం 5 కోట్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం ఇండియా వైడ్‌గా 44.4 కోట్లు వసూలు చేసింది. అయితే ఊహించని విధంగా సోమవారం ఈ చిత్ర కలెక్షన్లు భారీగా పడిపోయాయి.

 Akshay Kumars Samrat Prithviraj OTT Release date on Amazon Prime Video

బాక్సాఫీస్ వద్ద పేలవమైన ప్రదర్శన చేస్తుండటంతో సామ్రాట్ పృథ్వీరాజ్ చిత్రం ఓటీటీ రిలీజ్ ఎప్పుడనే ఆసక్తి నెటిజన్ల పెరుగుతున్నది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోతో ఓటీటీ రిలీజ్ కోసం ఒప్పందం కుదుర్చుకొన్నది. యష్ రాజ్ ఫిలింస్ రూపొందించిన ఈ చిత్రం థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నది. అయితే అమెజాన్‌తో ఒప్పందం ప్రకారం నాలుగు వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి రానున్నది.

గతంలో యష్ రాజ్ ఫిలింస్ రూపొందించిన బంటీ ఔర్ బబ్లీ చిత్రం నవంబర్ 19న రిలీజైంది. అయితే నాలుగు వారాల తర్వాతే ఆ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేశారు. ఇప్పుడు సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాను కూడా నాలుగు వారాల తర్వాత అంటే.. జూలై 1వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే థియేటర్లలో ఈ సినిమా రన్ త్వరగా ముగిస్తే.. తొందర్లోనే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం లేకపోలేదు అని అంటున్నారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X