Don't Miss!
- Finance
Zomato: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఫుడ్ డెలివరీ సంస్థలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు
- News
vastu tips: నైరుతి అభిముఖంగా ఇల్లు.. ఈ వాస్తు నివారణలతో ఇకపై అశుభం కాదు!!
- Sports
ICC ODI Rankings: కివీస్ క్లీన్ స్వీప్.. టీమిండియాదే అగ్రస్థానం! ఆసీస్ పనిబడితే..!
- Lifestyle
వినడం కూడా ఒక కళ, మీకు పెళ్లైతే వినడం నేర్చుకోవాల్సిందే..
- Technology
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్‌డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
- Automobiles
గ్రాండ్ విటారా కోసం రీకాల్ ప్రకటించిన మారుతి సుజుకి.. కారణం ఏమిటంటే?
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
HIT 2 OTT: అడివి శేష్‌కు బిగ్ షాక్.. ఓటీటీ నుంచి హిట్ 2 తొలగింపు.. అందులో లీక్ అవడమే కారణం!
తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన టాలెంట్‌తో సత్తా చాటుతూ.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో అడివి శేష్. విలక్షణమైన నటన, విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న అతడు.. ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ సత్తా చాటుతోన్నాడు. ఈ జోష్‌లోనే ఇటీవలే అతడు 'హిట్ ద సెకెండ్ కేస్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి భారీ స్పందన రావడంతో లాభాలు దక్కాయి. ఈ నేపథ్యంలో 'హిట్ 2' మూవీని ఓటీటీ సంస్థ తొలగించింది. ఆ వివరాలు మీకోసం!

ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా వచ్చింది
యంగ్ అడివి శేష్ నటించిన తాజా చిత్రమే 'హిట్: ది సెకెండ్ కేస్'. విశ్వక్ నటించిన 'హిట్'కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాను శైలేష్ కొలను తెరకెక్కించాడు. నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని ఈ మూవీని నిర్మించారు. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమా కోసం ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు పని చేశారు.
Anchor Prashanthi: గృహలక్ష్మి లాస్య హాట్ షో.. ఎద భాగాన్ని హైలైట్ చేస్తూ అరాచకంగా!

పాజిటివ్ టాక్... కలెక్షన్లు భారీగా
ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందిన 'హిట్: ది సెకెండ్ కేస్' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విశేషమైన స్పందన దక్కింది. దీంతో కలెక్షన్లు పోటెత్తాయి. ఫలితంగా ఈ సినిమా కేవలం వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుంది. అదే ప్రపంచ వ్యాప్తంగానూ ప్రభావాన్ని చూపించింది. దీంతో అన్ని ఏరియాల్లోనూ దీనికి కలెక్షన్లు సునామీ సృష్టించి సత్తాను చాటుకుంది.

హిట్ 2 మూవీతో నానికి లాభాలు
అడివి శేష్ హీరోగా నాని నిర్మించిన 'హిట్: ది సెకెండ్ కేస్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 14.25 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 15 కోట్లుగా నమోదైంది. ఇక, ఫుల్ రన్‌లో దీనికి రూ. 22.75 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ 7.75 కోట్లు లాభాలు నాని ఖాతాలోకి వచ్చాయి.
స్విమ్మింగ్ పూల్‌లో హాట్‌గా భూమిక: తడిచిన బట్టల్లో యమ ఘాటుగా!

ఆ ఓటీటీలో రాబోతున్న హిట్ 2
థియేటర్లలో దాదాపు మూడు వారాల పాటు సందడి చేసిన 'హిట్: ది సెకెండ్ కేస్' మూవీ ఓటీటీ రైట్స్ కోసం తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ అత్యధిక ధర చెల్లించి కొనుగోలు చేసింది. ఇక, ఈ సినిమాను జనవరి 6 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు సదరు సంస్థ అధికారికంగా వెల్లడించింది.

రెంట్ పద్దతిలో అందుబాటులో
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'హిట్: ది సెకెండ్ కేస్' మూవీ ఓటీటీ రైట్స్ దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ.. దీన్ని మంగళవారం నుంచే స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తెచ్చేసింది. అయితే, ఈ చిత్రాన్ని చూడాలనుకున్న వారు రూ. 129 రెంట్ చెల్సించాల్సి ఉంటుందని ప్రకటించింది. మూడు రోజుల ముందే రావడంతో ఈ మూవీని చాలా మంది చూశారు.
జాకెట్ లేకుండా యాంకర్ శ్యామల: తొలిసారి ఇలా తెగించి మరీ హాట్ షో

అమెజాన్ నుంచి తొలగించేసి
'హిట్: ది సెకెండ్ కేస్' మూవీని రెంటల్ బేసిస్ మీద అందుబాటులోకి తెచ్చిన అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ.. తాజాగా దీన్ని అందులో నుంచి తొలగించేసింది. అయితే, ఈ విషయానికి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ ఇవ్వకుండానే ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో సినిమాను రెంటల్ బేసిస్ మీద చూద్దామని భావిస్తోన్న ప్రేక్షకులలకు మాత్రం నిరాశే ఎదురు అవుతోంది.

అందులో లీక్ అవడమే కారణం
అడివి శేష్ హీరోగా నటించిన 'హిట్: ది సెకెండ్ కేస్' మూవీని రెంటల్ బేసిస్ మీద అందుబాటులోకి తెచ్చి ఆ వెంటనే తొలగించడంపై తాజాగా ఓ క్లారిటీ వచ్చింది. దీన్ని కొన్ని పైరసీ సంస్థలు ఇప్పటికే తమ తమ వెబ్‌సైట్‌లలో లీక్ చేసి పెట్టినట్లు తెలిసింది. ఇదే కంటిన్యూ అయితే సినిమాకు ఆదరణ వచ్చే అవకాశం ఉండదనే అమెజాన్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.