For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Anasuya Bharadwaj: ఓటీటీలో యాంకర్ అనసూయ మూవీ.. ఎప్పుడు? ఎక్కడంటే?

  |

  యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి తెలుగు బుల్లి తెర, వెండితెర ప్రేక్షకులకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. యాంకర్ అంటే చలాకీ మాటలతో పాటు కాస్తా గ్లామర్ తో కూడా ఆకట్టుకుంటారు. ఆలాంటి గ్లామరస్ యాంకర్లలో బ్యూటిఫుల్ అనూసయ భరద్వాజ్ ఒకరని తెలిసిందే. బుల్లితెరపై పాపులర్ యాంకర్‌గా వెండితెరపై అద్బుతమైన నటిగా అందరి అభిమానాన్ని సంపాదించుకుంది. యాంకర్ గా, సోషల్ మీడియాలో గ్లామర్ ఒలకబోస్తూనే వెండితెరపై తనదైన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. ఇక ఇటీవల ఆమె నటించిన చిత్రం దర్జా. సునీల్, అనసూయ కీలక పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్దమైంది.

   హాట్ యాంకర్ గా పేరు..

  హాట్ యాంకర్ గా పేరు..

  బుల్లితెర హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న అనసూయ అటు షోలతో పాటు మరోవైపు సినిమాల్లో అలరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రంగస్థలం మూవీలో రంగమ్మత్తగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత పుష్ప ది రైజ్ చిత్రంలో దాక్షాయణిగా గుర్తింపు తెచ్చుకుంది.

   రెండు వేరియేషన్స్ లో..

  రెండు వేరియేషన్స్ లో..

  ఇక రవితేజ ఖిలాడీ మూవీలో రెండు వేరియేషన్స్ లో నటించి ఆకట్టుకుంది. ఇలా వరుసగా సినిమాలతో దూసుకుపోయిన యాంకర్ అనసూయ ఇటీవల నటించిన చిత్రం దర్జా. కమెడియన్ సునీల్, అనసూయ లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రానికి సలీమ్ మాలిక్ దర్శకత్వం వహించారు.

   ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్ టైన్..

  ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్ టైన్..

  కామినేని శ్రీనివాస్ సమర్పణలో పీఎస్ఎస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్ టైన్ చిత్రంగా దర్జా తెరకెక్కింది. శివశంకర్ పైడిపాటి నిర్మించిన ఈ మూవీకి కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా రవి పైడిపాటి వ్యవహరించారు. ఇదిలా ఉంటే ఈ చిత్రం జులై 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే.

  ఓటీటీ ఆడియెన్స్ కోసం..

  ఓటీటీ ఆడియెన్స్ కోసం..

  అయితే ఈ మూవీ థియేటర్లలో అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఈ మూవీని ఓటీటీ ఆడియెన్స్ కోసం అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మూవీ ఓటీటీ మూవీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా కొనుగోలు చేసింది. స్పెషల్ ప్రీమియర్ గా దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 5 నుంచి ప్రసారం చేయనున్నారు.

   వరుస సినిమాలతో..

  వరుస సినిమాలతో..


  ఈ మూవీలో అనసూయ, సునీల్ తోపాటు డ్యాన్సర్ అక్సా ఖాన్, జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్ లు కూడా మరో పాత్రల్లో నటించారు. ఇదిలా ఉంటే అనసూయ భరద్వాజ్ ఓ వైపు యాంకర్​గా, మరోవైపు నటిగా పాపులారిటీ తెచ్చుకుంది. ఇటీవలే వాంటెడ్​ పండుగాడ్​ మూవీతో ప్రేక్షకులను పలకరించిన అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్​ బిజీగా ఉంది.

  వేశ్య పాత్రలో అనసూయ..

  వేశ్య పాత్రలో అనసూయ..


  ఇప్పటికే ఆమె 'రంగమార్తాండ', 'వేదాంతం రాఘవయ్య', 'గాడ్ ఫాదర్', 'హరిహర వీరమల్లు', 'పుష్ప 2', 'భోళా శంకర్' వంటి భారీ చిత్రాల్లో భాగమైంది. అలాగే సినిమాలే కాకుండా వెబ్​ సిరీస్​లకు కూడా ప్రాధాన్యత ఇస్తానంటోంది అనసూయ. ఇందులో భాగంగానే కన్యాశుల్కం అనే వెబ్​ సిరీస్​లో అనసూయ నటించనుంది. గురజాడ అప్పారావు క్లాసిక్​ నాటకం ఆధారంగా వస్తున్న ఈ సిరీస్​లో మధుర వాణి అనే వేశ్య పాత్రలో అనసూయ నటించనున్నట్లు సమాచారం.

  English summary
  Anchor Anasuya Bharadwaj And Sunil Starrer Movie Darja Will Streaming On AHa OTT From October 5th Date.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X