Baahubali The Epic రిలీజ్‌కు ముందు షాక్.. ఆ ఓటీటీ నుంచి బాహుబలి డిలీట్

తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రాలు బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్‌క్లూజన్. కలెక్షన్ల పరంగా ఈ సినిమాలు సరికొత్త రికార్డులు సృష్టించడంతో పాటు పాన్ ఇండియా కల్చర్‌కు శ్రీకారం చుట్టింది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మార్కెటింగ్ స్ట్రాటజీతో ఈ సినిమా బాలీవుడ్‌ పునాదులు కదిలించింది. భారతీయ సినిమా అంటే బాలీవుడ్ అనే భ్రమలు తొలగించి టాలీవుడ్ జెండా రెపరెపలాడించారు రాజమౌళి. బాహుబలి వేసిన బాటలో కేజీఎఫ్ సిరీస్, పుష్ప సిరీస్, కాంతార, కల్కి 2898 ఏడీ, కార్తీకేయ వంటి సినిమాలు హిందీ నాట కలకలం రేపాయి.

రికార్డ్ వసూళ్లతో బాహుబలి సంచలనం
ప్రభాస్, అనుష్క, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్, తమన్నా, నాజర్ తదితరులు నటించిన బాహుబలి సిరీస్‌‌ను ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలు నిర్మించగా కే రాఘవేంద్రరావు సమర్పకుడిగా వ్యవహరించారు. ఎంఎం కీరవాణి సంగీత సారథ్యం వహించగా.. కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటిండ్ నిర్వహించారు. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథను అందించారు. వీటితో బాహుబలి ది బిగినింగ్ చిత్రం 2015 జూలై 10న ప్రేక్షకుల ముందుకొచ్చింది. దక్షిణాదితో పాటు హిందీలోనూ ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపించింది. థియేట్రికల్ రన్ ముగిసేసరికి బాహుబలికి ది బిగినింగ్‌కు 650 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు.

Baahubali The Beginning and Baahubali The Conclusion Hindi and English versions Removed from Netfilx

భారతీయ సినీ చరిత్రపై బాహుబలి ముద్ర
దీనికి కొనసాగింపుగా బాహుబలి ది కన్‌క్లూజన్ వచ్చింది. బాహుబలి 1లో అమరేంద్ర బాహుబలిని కట్టప్ప ఎందుకు వెన్నుపోటు పొడిచి చంపాడో తెలియకపోవడంతో సస్పెన్స్ నెలకొంది. ఈ ఒక్క పాయింట్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. 2017 ఏప్రిల్ 28న రిలీజైన బాహుబలి ది కన్‌క్లూజన్ మూవీ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించింది. ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. తద్వారా అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల్లో దంగల్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు సినిమాలు భారతీయ చిత్ర పరిశ్రమపై బలమైన ప్రభావం చూపాయి.

త్వరలో బాహుబలి ది ఎపిక్
ప్రస్తుతం టాలీవుడ్ టూ కోలీవుడ్ రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తుండటంతో బాహుబలిని కూడా రీ రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు భావించారు. దీనిలో భాగంగా బాహుబలి 1, బాహుబలి 2 రెండింటిని కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో అక్టోబర్ 31న రిలీజ్ చేయనున్నారు. నిడివి దృష్ట్యా కొన్ని సన్నివేశాలను తొలగించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం కోసం ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో బాహుబలి యూనిట్‌కు పెద్ద షాక్ తగిలింది.

ఆ ఓటీటీ నుంచి బాహుబలి తొలగింపు
బాహుబలి సిరీస్‌ డిజిటల్ హక్కులను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దక్కించుకోగా.. దక్షిణాది భాషలతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషలలో ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. ఇప్పటికీ ఈ ఐకానిక్ మూవీకి మిలియన్లలో వ్యూయర్‌షిప్ ఉంది. ఇలాంటి వేళ బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్‌క్లూజన్‌ చిత్రాలను నెట్‌ఫ్లిక్స్ తన ఫ్లాట్‌ఫాం నుంచి తొలగించింది. దీంతో ప్రభాస్ అభిమానులు షాక్ అయ్యారు. ఎందుకిలా జరిగింది అంటూ స్క్రీన్ షాట్లను షేర్ చేస్తూ ప్రశ్నించారు. అయితే ఫిలింనగర్ వర్గాలు చెబుతున్న దానిని బట్టి.. నెట్‌ఫ్లిక్స్‌తో స్ట్రీమింగ్ హక్కుల ఒప్పందం కాలపరిమితి ముగిసిందని అందుకే ఓటీటీ నుంచి తొలగించారని అంటున్నారు. అయితే కొందరు మాత్రం బాహుబలి ది ఎపిక్ రిలీజ్ సందర్భంగా ఇది రాజమౌళి మార్క్ స్ట్రాటజీ అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ గందరగోళంపై చిత్ర యూనిట్ త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X