Don't Miss!
- Sports
నేను కూడా జంక్ ఫుడ్ తిన్నా: విరాట్ కోహ్లీ
- News
Wife: భార్య మీద విపరీతమైన అనుమానం, ఇంటికి వెళ్లి ముగ్గురిని కొడవలితో నరికేసి ఆత్మహత్య, చివరికి ?
- Finance
Stock Market: హుషారుగా మార్కెట్లోకి వచ్చిన ఇన్వెస్టర్లు.. ఉసూరు మంటూ ఇంటికెళ్లారు..!
- Lifestyle
Sickle Cell Anemia: సికిల్ సెల్ అనీమియా అంటే ఏంటి? లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకోండి
- Technology
కొత్త బడ్జెట్ లో PAN కార్డు పై కొత్త రూల్స్! ఇకపై అన్ని డిజిటల్ KYC లకు PAN కార్డు చాలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
NBK Vs PSPK ఓడిపోవడానికి సిద్ధం.. ఇదే నా చివరి సినిమా.. బాలయ్య ప్రశ్నలకు పవన్ షాకింగ్‌గా!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఈ పేరు వింటే చాలు తెలుగు రాష్ట్రాల్లో విజిల్స్, అరుపులతో మోత మోగిపోతుంది. ఏ హీరో ఫంక్షన్ అయినా సరే.. పవన్ కల్యాణ్ అని పేరు వింటే చాలు.. రచ్చ రచ్చే. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా వెండితెరకు పరిచయమయ్యారు పవన్ కల్యాణ్. చిరు తమ్ముడిగా ఎంటరైన పవన్ కల్యాణ్ తనదైన నటన, మ్యానరిజంతో అశేష అభిమానులను సంపాదించుకుని పవర్ స్టార్‌గా ఎదిగారు. ఇక ఆయన సినిమా కోసం ఎదురు చూసే అభిమానులు, ప్రేక్షకులు అనేకం. అయితే ఈ సినిమాల కంటే ముందుగా డిజిటల్ తెరపై పవన్ కల్యాణ్ సందడి చేయనున్న విషయం తెలిసిందే. ఆహా వేదికగా ప్రసారం కానున్న అన్ స్టాపబుల్ 2 సీజన్ పవన్ కల్యాణ్ ఎపిసోడ్ టీజర్ ను తాజాగా విడుదల చేశారు.

ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తూ..
ఇటీవల భీమ్లా నాయక్ సినిమాతో అలరించిన పవన్ కల్యాణ్ త్వరలో హరిహర వీరమల్లు చిత్రంతో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడిగా సభలు నిర్వహిస్తూ ప్రత్యర్థులను తనదైన వ్యాఖ్యలతో ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తున్నారు. ఇక తాజాగా పవన్ కల్యాణ్ తన అభిప్రాయాలను డిజిటల్ తెరపై పంచుకోనున్నారు.

చివరి ఎపిసోడ్ గా..
ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ వేదిక ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ రోజురోజుకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ అందుకుంటోంది. గతంలో ఎప్పుడు లేనివిధంగా నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా కనిపించిన విధానం ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ అన్ స్టాపబుల్ షో రెండో సీజన్ చివరి ఎపిసోడ్ కు స్పెషల్ గెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రానున్న విషయం తెలిసిందే.

పవన్ కల్యాణ్ తో ముగింపు..
అయితే పవన్ కల్యాణ్ ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా జనవరి 13నే విడుదల చేయాలని ముందుగా భావించారు నిర్వాహకులు. కానీ అనూహ్యంగా అప్పుడు వీర సింహా రెడ్డి చిత్రబృందాన్ని తీసుకొచ్చి ట్విస్ట్ ఇచ్చారు. దీంతో పవన్ కల్యాణ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ వాయిదా పడింది. ప్రభాస్ ఎపిసోడ్ తర్వాత షూటింగ్ కంప్లీట్ చేసుకున్న పవన్ కల్యాణ్ ఎపిసోడ్ తో అన్ స్టాపబుల్ రెండో సీజన్ ను ముగించనున్నారు.

ఫ్యాన్స్ మధ్యలో నుంచి..
ఇప్పుడు పవన్ కల్యాణ్ ఎపిసోడ్ ను జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేస్తే బాగుంటుందని ఆహా టీం ప్లాన్ చేస్తోంది. ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రాలేదు కానీ త్వరలో పూర్తి ఎపిసోడ్ ను రిలీజ్ చేస్తామంటూ ఎపిసోడ్ టీజర్ ను వదిలారు. ఇందులో పవన్ కల్యాణ్ బ్లాక్ కలర్ హుడీ వేసుకుని హుందాగా ఎంట్రీ ఇచ్చారు. అనేక మంది ఫ్యాన్స్ మధ్యలో నుంచి షోలోకి ఎంటర్ అయిన పవన్ కల్యాణ్ ను బాలయ్య బాబు పలు క్వశ్చన్స్ వేశారు.

నేను చాలా పద్ధతిగా మాట్లాడతా..
ఈ పవర్ టీజర్ లో నేను అందరికీ చెబుతుంటాను బాలా అని పిలవమని అని బాలకృష్ణ అన్నారు. అప్పుడు నేను ఓడిపోవడానికి సిద్ధం కానీ, అలా పిలవమంటే అంటూ నవ్వుతూ పవన్ కల్యాణ్ చెబుతుంటే.. ఈ పాలిటిక్సే వద్దు అని బాలకృష్ణ అన్నారు. ఈ మధ్య నీ విమర్శల్లో వాడీ వేడీ.. ఇంపాక్ట్ డబుల్ అయిందని బాలయ్య అంటే.. లేదు నేను చాలా పద్ధతిగా మాట్లాడతానండి అని పవన్ కల్యాణ్ అనడం ప్రేక్షకుల చేత అరిపించేలా చేసింది.
మా వదినకు ఫోన్ చేసి..
తర్వాత మీ అన్నయ్య చిరంజీవి నుంచి నేర్చుకున్న, వద్దనుకున్న విషయాలు ఏంటీ అని బాలకృష్ణ అడిగితే.. మా వదినకు ఫోన్ చేసి.. ఇదే నా లాస్ట్ సినిమా.. ఇంక నా వల్ల కాదు అని పవన్ కల్యాణ్ చెప్పడం సస్పెన్స్ క్రియేట్ చేశారు. అనంతరం మీపై ఉన్న ఫ్యాన్స్ అభిమానం ఓట్లగా ఎందుకు మారలేదు అని అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని సస్పెన్స్ తో వదిలేశారు. టీజర్ చివరిలో మేము బ్యాడ్ బాయ్స్ 1 2 3 నుంచి 10 వరకు చెప్పి హాలీవుడ్ సినిమా సిరీస్ ను ప్రస్తావించారు బాలకృష్ణ.