Don't Miss!
- News
తెలంగాణ గవర్నర్ తమిళిసై మార్పు..?!
- Sports
INDvsAUS : ప్రాక్టీస్‌లో మా ఫోకస్ అంతా దానిపైనే: రాహుల్ ద్రావిడ్
- Lifestyle
Super Brain Yoga: సూపర్ బ్రెయిన్ యోగా, దీంతో ఎన్నో ఉపయోగాలున్నాయ్.. తెలుసా?
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Unstoppable 2: మేడమ్‌తో అంత రొమాన్స్ ఏంటి.. ప్రభాస్‌ను ఇరికించిన బాలయ్య.. మీకు లేవా అంటూ కౌంటర్
దాదాపు రెండేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోన్న షోలలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న 'Unstoppable with NBK' ఒకటి. సినీ సెలెబ్రిటీలతో చిట్ చాట్ చేసే ఈ టాక్ షో రికార్డుల దుమ్ముదులిపేస్తూ సత్తా చాటింది. ఫలితంగా మొదటి సీజన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుని.. ఇప్పుడు రెండో దాన్ని నడుపుకుంటోంది. ఇక, ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. బాలయ్యతో కలిసి తెగ సందడి చేశాడు. ఈ నేపథ్యంలో ప్రముఖ హీరోయిన్‌తో అతడి డేటింగ్ రూమర్స్‌ను హైలైట్ చేశారు. ఆ సంగతులు మీకోసం!

బాహుబలి ఎపిసోడ్‌లో ప్రభాస్
'Unstoppable with NBK 2' షోలో భాగంగా కొత్త ఎపిసోడ్‌లో పాల్గొనేందుకు గానూ పాన్ ఇండియా స్టార్‌గా వెలుగొందుతోన్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ గెస్టుగా వచ్చారు. అతడికి భారీ స్థాయిలో ఎలివేషన్ ఇచ్చి మరీ హోస్ట్ నటసింహా నందమూరి బాలకృష్ణ షోలోకి సాదర స్వాగతం పలికారు. ఆ తర్వాత ప్రభాస్‌ను ఆప్యాయంగా కౌగిలించుకుని స్టేజ్ మీదకు ఆహ్వానించారు.
మళ్లీ రెచ్చిపోయిన కేతిక శర్మ.. చాలీ చాలని బట్టల్లో అందాల ప్రదర్శన

అదిరిపోయే పంచ్‌లతో రచ్చ
'Unstoppable
with
NBK
2'
షోలోకి
గెస్టుగా
వచ్చిన
ప్రభాస్‌ను
అతడి
ప్రాజెక్టులు,
డేటింగ్
రూమర్స్,
పెళ్లి
సహా
ఎన్నో
విషయాల
గురించి
నందమూరి
బాలకృష్ణ
ప్రశ్నించారు.
అలాగే,
ఈ
స్టార్
హీరోతో
కొన్ని
గేమ్స్
కూడా
ఆడించారు.
ఇందులో
ప్రభాస్‌ను
బాలయ్య
తనదైన
ప్రశ్నలతో
ఇరికించే
ప్రయత్నం
చేయగా..
వాటికి
అతడు
కూడా
సరిగానే
బదులిచ్చి
ఔరా
అనిపించాడు.

కృతి సనన్‌తో డేటింగ్‌పై ప్రశ్న
ప్రభాస్ ప్రస్తుతం 'ఆదిపురుష్' మూవీలో నటిస్తోన్న విషయం తెలిసిందే. అందులో హీరోయిన్‌గా చేస్తోన్న కృతి సనన్‌తో ఈ పాన్ ఇండియా స్టార్ డేటింగ్ చేస్తున్నాడని ప్రచారం జరిగింది. దీంతో ఆమె స్వయంగా దీనిపై స్పందించి ఈ రూమర్లను కొట్టిపారేసింది. ఇక, తాజాగా 'Unstoppable with NBK 2' షోలో పాల్గొన్న ప్రభాస్‌ను బాలయ్య దీనిపై ప్రశ్నించాడు.
నీ భార్యతో ఎన్నిసార్లు ఆ పని చేశావ్.. లైవ్‌లోనే ఆమెకు ఫోన్ కాల్.. అవినాష్ పరువు తీసిన శ్రీముఖి

మేడం చెప్పారుగా... వింతగా
కృతి సనన్‌తో డేటింగ్ రూమర్లపై బాలయ్య ప్రశ్నించగానే ప్రభాస్ 'వాళ్లు చెప్పారు సార్' అన్నాడు. దీనికాయన 'వాళ్లు చెప్పారు.. మనం కూడా చెప్పాలి కదా' అని కౌంటర్ వేశారు. దీంతో ప్రభాస్ 'మేడం ఆల్రెడీ దీని గురించి చెప్పారుగా సార్' అన్నాడు. అప్పుడు బాలకృష్ణ 'చెప్పారా? చెప్పించారా' అంటూ పంచ్ వేశారు. దీంతో ఖంగుతిన్న ప్రభాస్ తల పట్టుకున్నాడు.

నేను అలానే పిలుస్తా అంటూ
ఆ తర్వాత కూడా ప్రభాస్ 'మేడం మేడం' అంటుండగా.. బాలయ్య 'మేడం ఏంటి? అంత రొమాన్స్ ఏంటి' అంటూ అదిరిపోయే ప్రశ్న అడిగారు. దీంతో అతడు 'మేడంలో ఏముంది సార్' అని అన్నాడు. అప్పుడు బాలయ్య 'మేడంలోనే ఉందమ్మా.. నేను ఇంటికి వెళ్లేటప్పుడు వసు మేడం.. వసు మేడం అని వెళ్తా' అని చెప్పారు. దీంతో షోలో ఒక్కసారిగా నవ్వులు వెల్లివిరిశాయి.
గృహలక్ష్మి లాస్య ఓవర్ డోస్ హాట్ షో: ఎద అందాలు చూపిస్తూ ఘోరంగా!

మీకంటే అప్పుడు ఇలా లేదు
అప్పటితో ఆపని బాలయ్య 'నువ్వేమో నవ్వుతూ నో అంటున్నావు.. ఆ అమ్మాయేమో సీరియస్‌గా నో అంటుంది. బయట మాత్రం ఇంటర్నెట్‌లో' అంటూ సస్పెన్స్‌గా ఉంచేశారు. అప్పుడు ప్రభాస్ 'సార్ మీకు రాలేదా అలాంటి రూమర్స్. అప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి సరిపోయింది. మీకు ఎన్ని వచ్చాయి సార్' అంటూ బాలయ్యకే అదిరిపోయే కౌంటర్లు వేశాడు.

ప్రభాస్ క్లారిటీతో పుల్‌స్టాప్
'Unstoppable with NBK 2' షోలో బాలయ్య ప్రశ్న ద్వారా కృతి సనన్‌తో డేటింగ్ రూమర్స్‌పై ప్రభాస్ నేరుగా స్పందించాడు. మొత్తానికి తనకు ఆమెకు మధ్య అలాంటి రిలేషన్ లేదని స్పష్టం చేశాడు. అదే సమయంలో హీరోల కష్టాల గురించి కూడా బాలయ్యను ఉదాహరణగా చెప్పి వివరించాడు. మొత్తానికి ఈ షోలో ఇద్దరు హీరోలు ప్రేక్షకులకు మజాను అందించారు.