Unstoppable With NBK చంద్రబాబు, లోకేష్‌కు బాలయ్య గన్‌ పాయింట్.. యూట్యూబ్‌లో రికార్డు సృష్టించిన ప్రోమో

నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న Unstoppable With NBK రియాలిటీ షో తొలి సీజన్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. పలువురితో బాలయ్య చేసిన ఇంటర్వ్యూలు, మాట ముచ్చటకు సంబంధించిన ఎపిసోడ్స్ వైరల్ కావడమే కాకుండా టాప్ రేటింగ్‌ను నమోదు చేసుకొన్నది. అలాంటి టాప్ రేటింగ్ షోకు కొనసాగింపుగా Unstoppable With NBK Season 2 ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నది. ఈ రియాలిటీ షోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

దేశంలోనే టాప్ రేటింగ్ షోగా

దేశంలోనే టాప్ రేటింగ్ షోగా

బాలకృష్ణ హోస్ట్‌గా ప్రారంభమైన Unstoppable With NBK అంచనాలకు మించి రెస్పాన్స్ కూడగట్టుకొన్నది. దేశవ్యాప్తంగా బుల్లితెరపై అత్యధిక రేటింగ్ సొంతం చేసుకొన్న కామెడీ నైట్స్ విత్ కపిల్ షో రేటింగ్‌ను కూడా అధిగమించి.. దేశంలోనే అత్యధిక రేటింగ్ సాధించిన రియాలిటీ షోగా అన్ స్టాపబుల్ ఓ ఘనతను సొంతం చేసుకొన్నది.

చంద్రబాబుతో సీజన్ 2

చంద్రబాబుతో సీజన్ 2

Unstoppable With NBK సీజన్ 1 కు కాస్త విరామం ప్రకటించిన ఆహా ఓటీటీ నిర్వాహకులు మరోసారి పవర్‌ఫుల్ కెంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్లాన్ చేశారు. అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే సీజన్ 2‌లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ బాబుతో ఎపిసోడ్ ప్లాన్ చేశారు.

వివాదాస్పద అంశాలతో బాలయ్య

వివాదాస్పద అంశాలతో బాలయ్య

Unstoppable With NBK Season 2కు సంబంధించిన ప్రోమోను విడుదల అక్టోబర్ 11వ తేదీన ఆహా రిలీజ్ చేసింది. బాలకృష్ణ పవర్‌ఫుల్ ఎంట్రీతో ఈ ప్రోమో ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇక చంద్రబాబు, లోకేష్‌ను బాలయ్య అడిగిన ప్రశ్నలు క్రేజీగా మారాయి.

ఎన్టీఆర్‌ను సీఎం పీఠం నుంచి తప్పించడం, సైబారాబాద్ డెవలప్‌మెంట్ గురించి ప్రశ్నలు వేయగా.. లోకేష్‌ను మంగళగిరిలో ఓటమి, విదేశాల్లో అమ్మాయిలతో జల్సా లాంటి అంశాలను ప్రశ్నల రూపంలో సంధించారు.

యూట్యూబ్‌లో ట్రెండింగ్‌

Unstoppable With NBK Season 2 Episode Number 1 ప్రోమోకు మంచి ఆదరణ లభిస్తున్నది. విడుదలైన కొద్ది సేపటికే లక్షలాది వ్యూస్‌ను సొంతం చేసుకొన్నది. సోషల్ మీడియాలో ప్రోమోలోని పలు అంశాలు వీడియోల రూపంలో ట్రెండ్ అయ్యాయి. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఈ ప్రోమో నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతున్నది.

అక్టోబర్ 14న ఆహా ఓటీటీలో

అక్టోబర్ 14న ఆహా ఓటీటీలో

Unstoppable With NBK Season 2 Episode Number 1 శుక్రవారం అంటే.. అక్టోబర్ 14వ తేదీన ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నది. అలాగే ఈ రియాలిటీ షో ప్రతీ శుక్రవారం సరికొత్త ఎపిసోడ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నది. యూట్యూబ్‌లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న బాలయ్య, చంద్రబాబు పూర్తి ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X