For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Inaya Sultana: ఊహించని ట్విస్ట్.. సోహెల్ కు ఇనయా సుల్తానా లవ్ ప్రపోజల్.. ప్రాణం ఉన్నంతవరకు అంటూ!

  |

  బిగ్ బాస్ రియాలిటీ షో ఎంతోమందికి పేరు తీసుకొచ్చింది. లైమ్ లైట్ లో లేని సెలబ్రిటీలకు విపరీతమైన ఫాలోయింగ్ పెరిగేలా చేసింది. అలాగే సినీ అవకాలు లేని వారికి బిగ్ బాస్ షో మంచి వేదికగా మారింది. అలా బిగ్ బాస్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకుని హీరోగా మారాడు సయ్యద్ సోహెల్ ర్యాన్. బిగ్ బాస్ తెలుగు 4వ సీజన్ లో తనదైన ఆటతీరుతో ప్రేక్షకులను మెప్పించాడు.

  అలాగే ఎలాంటి అంచనాలు లేకుండా బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ లోకి అడుగుపెట్టింది బ్యూటిఫుల్ ఇనయా సుల్తానా. తొందర్లోనే హౌజ్ నుంచి బయటకు వెళ్తుందనుకున్న ఇనయా ఊహించని విధంగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. హౌజ్ లో ఆర్జే సూర్యతో సన్నిహితంగా ఉన్న ఇనయా తాజాగా సోహెల్ కు లవ్ ప్రపోజ్ చేసి షాక్ ఇచ్చింది.

  21 మంది సెలబ్రిటీల్లో ఒకరిగా..

  21 మంది సెలబ్రిటీల్లో ఒకరిగా..

  సెప్టెంబర్ 4న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ లోకి మొత్తంగా 21 మంది సెలబ్రిటీల్లో ఒకరిగా ఎంట్రీ ఇచ్చింది ఇనయా సుల్తానా. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని ఇనయాకు సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ద్వారా ఫేమ్ వచ్చింది. తన బర్త్ డే పార్టీకి వచ్చిన ఆర్జీవీతో ఇనయా సుల్తానా కలిసి డ్యాన్స్ చేసింది. దీంతో ఆ అమ్మాయి ఎవరా అని విపరీతంగా తెలుసుకోవడం మొదలు పెట్టారు.

  ఆర్జీవీ ద్వారా పాపులర్..

  ఆర్జీవీ ద్వారా పాపులర్..

  ఆర్జీవీతో కలిసి డ్యాన్స్ చేయడానికి ముందే పలు చిత్రాల్లో కూడా నటించింది ఇనయా. అయితే అవేవి గుర్తింపును తీసుకురాలేదు. ఆర్జీవీ ద్వారా పాపులర్ కావడంతో బిగ్ బాస్ కి అవకాశం లభించింది. దీంతో బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ లోకి ఎలాంటి అంచనాలు లేకుండా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

  సీజన్ రెండు వారాల్లోనే వెళ్లిపోతుందని అంతా అనుకున్నారు. కానీ తనదైన ఆట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా టైటిల్ విన్నర్ సింగర్ రేవంత్ కు గట్టి పోటీగా ఆడియెన్స్ భావించారు.

  కలిసి హగ్స్ ఇచ్చుకోవడం..

  కలిసి హగ్స్ ఇచ్చుకోవడం..

  ఆరో సీజన్ లో 14వ వారం జరిగిన ఎలిమినేషన్ లో భాగంగా ఇనయా సుల్తానా ఎవరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయి హౌజ్ ను వీడింది. హౌజ్ లో ఉన్నప్పుడు ఆర్జే సూర్యతో ఇనయా మంచి బాండింగ్ ఏర్పర్చుకుంది. తరచు ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం, హగ్స్ ఇచ్చుకోవడం వంటివి జరిగాయి. ఇక హౌజ్ ను వీడాకా కూడా ఆర్జే సూర్యతో కలిసి చక్కర్లు కొడుతున్నట్లు వార్తలు వినిపించాయి.

  రెస్టారెంట్ లో సోహెల్..

  రెస్టారెంట్ లో సోహెల్..

  అయితే ఇప్పుడు అనూహ్యంగా లక్కీ లక్ష్మణ్ సినిమాకు హీరోగా చేస్తున్న బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ సయ్యద్ సోహెల్ ర్యాన్ కు ప్రపోజ్ చేసి ఆశ్చర్యపరిచింది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఓ బ్యూటిఫుల్ రెస్టారెంట్ లో ఉన్న సోహెల్ కోసం ఇనయా వచ్చింది. నీకోసం ఒక సర్ ప్రైజ్ ఉంది అని ఇనయా అంటే.. ఏంటీ.. అసలు నువ్ రాగానే ఏంటీ ఇలా వచ్చిందని షాక్ అయ్యాను అని సోహెల్ అన్నాడు.

  ప్రాణం ఉన్నంతవరకు..

  ప్రాణం ఉన్నంతవరకు..

  బిగ్ బాస్ తర్వాత ఫస్ట్ నీతోనే మాట్లాడుతున్నాను.. నేను ఏం చేయలేదు అని ఇనయా అంటే సోహెల్ ఆశ్చర్యపోయాడు. ఇక ఒక్కటి నా మనసులో ఉన్నది చెప్పదలుచుకున్న మీరు ఏమనుకున్న పర్వాలేదు అని ఇనయా సిగ్గు పడుతూ చెప్పింది. తర్వాత ఫ్లవర్ బుకే తీసుకుని సోహెల్ దగ్గరకు వెళ్లి.. ప్రేమ ఉన్నంత వరకు కాదు.. ప్రాణం ఉన్నంతవరకు ప్రేమిస్తా అని మోకాళ్లపై కూర్చుని సోహెల్ కు ప్రపోజ్ చేసింది ఇనయా.

  నా మనసులో ఫీలింగ్..

  నా మనసులో ఫీలింగ్..

  తర్వాత ఒక ఫ్లవర్ తీసుకుని మీకు ప్రపోజ్ చేయడం కోసమే ఇలా రెడీ అయి వచ్చానని ఇనయా తెలిపింది. మీరు అంటే నాకు చాలా చాలా ఇష్టం. బిగ్ బాస్ లో చూసినప్పటినుంచి నేను మీకు పెద్ద ఫ్యాన్ ని. ఫ్యాన్ మాత్రమే కాదు మీరంటే నాకు చాలా ఇష్టం.. పిచ్చి.. ఎలా చెప్పాలో తెలియట్లేదు. బిగ్ బాస్ లో కూడా క్రష్ అని మాత్రమే చెప్పా కానీ నా మనసులో ఫీలింగ్ అయితే ఎప్పుడు చెప్పలేదు.. ఐ రియల్లీ లవ్యూ అంటూ ఇనయా సిగ్గు పడింది.

  నాకు ఎవరు ప్రోపోజ్ చేయలేదు..

  ఇనయా ప్రపోజ్ తో సోహెల్ చాలా సిగ్గుపడుతూ అయోమయంగా ఉన్నాడు. అలాగే తనకు ఇప్పటివరకు ఎవరు ప్రపోజ్ చేయలేదని చెప్పాడు. ఇనయాతో పాటు కింద కూర్చుని ఆమె చెప్పేది వింటున్నాడు. దీంతో ఈ ప్రోమో ముగిసింది. అయితే ఇనయా ప్రపోజల్ ను సోహెల్ యాక్సెప్ట్ చేస్తాడా అనేది తెలియాలంటే పూర్తి వీడియో వచ్చేదాకా ఆగాల్సిందే. ఇదిలా ఉంటే బిగ్ బాస్ 6లో ఫ్యామిలీ వీక్ సందర్భంగా ఇనయా కోసం సోహెల్ స్టేజ్ పైకి వచ్చి సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే.

  English summary
  Bigg Boss Telugu 6 Season Contestant Inaya Sultana Love Propose To Syed Sohel With Bending On Knee Video Goes Viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X