For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Non Stop: ఆరియానా పెళ్లిపై సెన్సేషనల్ న్యూస్.. అతడితోనే ఏడడుగులు.. ముహూర్తం ఎప్పుడంటే!

  |

  తెలుగు బుల్లితెరపై అత్యధిక రేటింగ్‌ను అందుకుంటూ హవాను చూపిస్తోన్న షో బిగ్ బాస్. గతంలో దేనికీ దక్కనంత స్పందనతో దూసుకుపోతోన్న ఈ కార్యక్రమం వల్ల ఎంతో మంది ఫుల్ ఫేమస్ అయ్యారు. తద్వారా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతున్నారు. అందులో హాట్ బ్యూటీ ఆరియానా గ్లోరీ ఒకరు. యూట్యూబ్‌ యాంకర్ నుంచి బిగ్ సెలెబ్రిటీగా మారిపోయిన ఈ భామ.. ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌లోనూ సందడి చేస్తోంది.

  అంతేకాదు, చక్కని ఆటతీరుతో ఫినాలేకు కూడా చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆరియానా గ్లోరీ పెళ్లి గురించి తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఆమె త్వరలోనే బాయ్‌ఫ్రెండ్‌ను వివాహం చేసుకోబోతుందట. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

  అలా ఫేమస్.. బిగ్ బాస్ ఎంట్రీ

  అలా ఫేమస్.. బిగ్ బాస్ ఎంట్రీ

  ఆరియానా గ్లోరీ యూట్యూబ్ యాంకర్‌గా కెరీర్‌ను మొదలెట్టింది. ఈ క్రమంలోనే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసింది. ఆ సమయంలో ఆయనతో ఆమె బోల్డుగా చర్చలు జరపడంతో హైలైట్ అయింది. దీంతో ఆమె పేరు మారుమ్రోగిపోయింది. ఫలితంగా బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అవకాశాన్ని అందుకుంది. అలా ఆరియానా మరింత పేరొందింది.

  హాట్ డోస్ పెంచిన సీరియల్ నటి: పెళ్లైన కొత్తలోనే ఇలా రెచ్చిపోయిందేంటబ్బా!

  గెలవకున్నా వరుస ఆఫర్లతోనే

  గెలవకున్నా వరుస ఆఫర్లతోనే

  బిగ్ బాస్‌ నాలుగో సీజన్‌లో గెలవకున్నా ఆరియానా గ్లోరీ తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుంది. ఫలితంగా ఆమె వరుసగా ఆఫర్లను కూడా అందుకుంటోంది. ఇప్పటికే పలు షోలు, ఈవెంట్లు, ప్రారంభోత్సవాలు ఇలా ఎన్నో చేస్తోన్న ఈ బ్యూటీ.. పలు సినిమాల్లోనూ నటిస్తోంది. ఈ మధ్యనే కొన్ని సినిమాలు చేసింది. అలాగే, బిగ్ బాస్ బజ్ టాక్ షోకు హోస్టుగానూ పని చేసింది.

  మరోసారి ఎంట్రీ.. ఈ సారి ఇలా

  మరోసారి ఎంట్రీ.. ఈ సారి ఇలా

  బిగ్ బాస్ తెలుగు ఓటీటీ మొదటి సీజన్ 'బిగ్ బాస్ నాన్ స్టాప్' ఎంతో గ్రాండ్‌గా ప్రారంభం అయింది. అందులో బోల్డ్ బ్యూటీ ఆరియానా గ్లోరీ కూడా కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆరంభంలోనే అదిరిపోయే లుక్‌తో మరోసారి అందరి దృష్టినీ లాగేసింది. అయితే, గతంలో మాదిరిగా ఈ బ్యూటీ సీరియస్‌గా కనిపించకున్నా.. ఆట పరంగా అందరినీ అలరిస్తూ వచ్చింది.

  మసాజ్ వీడియో షేర్ చేసిన హీరోయిన్: ఒంటిపై నూలుపోగు లేకుండా ఘోరంగా!

  మరోసారి ఫినాలేకు చేరుకుని

  మరోసారి ఫినాలేకు చేరుకుని

  బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో ఎక్కువగా అమ్మాయిలు కంటెస్టెంట్లుగా వచ్చారు. అందులో ముగ్గురు మాత్రమే ఫినాలేలో అడుగు పెట్టారు. వారిలో ఆరియానా గ్లోరీ ఒకరు. ఆరంభం నుంచే మంచి ఆటతీరుతో ఆకట్టుకున్న ఆమె.. కొన్ని సందర్భాల్లో వాహ్వా అనిపించింది. ఫలితంగా పలుమార్లు ఎలిమినేషన్ తప్పించుకోవడంతో పాటు ఇప్పుడు నేరుగా టైటిల్ బరిలోనే నిలిచింది.

  బిగ్ బాస్ షోలోకి స్పెషల్ గెస్ట్

  బిగ్ బాస్ షోలోకి స్పెషల్ గెస్ట్

  బిగ్ బాస్ షోలో ఫినాలేకు చేరిన కంటెస్టెంట్లకు జాతకాలు చెప్పించడం కోసం ఓ లేడీని హౌస్‌లోనికి పంపుతుంటారు. ఈ క్రమంలోనే ఈ సారి శాంతి అనే కార్డ్ రీడర్‌ను తీసుకు వచ్చారు. ఆమె ఫినాలేకు చేరుకున్న బిందు మాధవి, అఖిల్ సార్థక్, ఆరియానా గ్లోరీ, బాబా భాస్కర్, యాంకర్ శివ, అనిల్ రాథోడ్, మిత్రా శర్మల జాతకాలను కార్డుల ఆధారంగా చక్కగా చెప్పారు.

  F3 హీరోయిన్ ఎద అందాల విందు: ఈ డ్రెస్‌లో ఆమెనిలా చూశారంటే తట్టుకోలేరు!

  ఆరియానా పెళ్లిపై క్లారిటీగానే

  ఆరియానా పెళ్లిపై క్లారిటీగానే

  ఆస్ట్రాలజర్ శాంతి జాతకాలు చెబుతోన్న సమయంలో అందరూ ఆసక్తిగా తిలకించారు. ఇందులో కొందరికి ఆమె విజయ అవకాశాలు ఉన్నాయని పరోక్షంగా వెల్లడించారు. ఇక, ఆరియానా గ్లోరీ వంతు రాగానే ఆమె ఎంతో ఎగ్జైట్ అయిపోయింది. అంతేకాదు, తన పెళ్లి గురించి చెప్పమని ఆమెను ఆరియానా అడిగింది. దీంతో త్వరలోనే పెళ్లి జరగబోతుందని గుడ్ న్యూస్ చెప్పారామె

  అతడితోనే నవంబర్‌లో పెళ్లి

  అతడితోనే నవంబర్‌లో పెళ్లి

  ఆరియానా గ్లోరీకి లవర్స్ కార్డ్ రావడంతో ఆస్ట్రాలజర్ శాంతి 'ఈ నవంబర్‌లోనే మీకు పెళ్లి కావొచ్చు. అబ్బాయి కూడా రెడీగా ఉన్నాడు. కొత్త ఇంటితో పాటు.. కొత్త లైఫ్ కూడా అరియానా కోసం ఎదురు చూస్తుంది. అంతేకాదు, మీ జీవితం ఫుల్ సెలబ్రేషన్స్‌తో కూడుకుని ఉండబోతుంది' అని చెప్పింది. దీంతో ఆరియానా పెళ్లి, ఆమెకు కాబోయే వాడి గురించి చర్చలు జరుగుతున్నాయి.

  English summary
  Bigg Boss Telugu Non Stop OTT First Season Running Successfully. tarot card Reader Clarity on Ariyana Glory Marriage in Recent Episode.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X