For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Non Stop: అఖిల్ బ్యాచ్‌కు బాబా భాస్కర్ షాక్.. విన్నర్ ఎవరో చెప్పకనే చెప్పేశాడుగా!

  |

  తెలుగు బుల్లితెర చరిత్రలోనే భారీ స్థాయిలో టీఆర్పీ రేటింగ్‌ను సొంతం చేసుకుని నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఇలా ఏకంగా ఐదు సీజన్లను ఒకదానికి మించి ఒకటి సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే దేశంలోనే నెంబర్ వన్ షోగానూ ఎదిగిపోయింది. దీంతో నిర్వహకులు ఇప్పుడు ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్‌ను కూడా మరింత ఉత్సాహంతో నడుపుతున్నారు. ఎన్నో అంచనాలతో మొదలైన ఈ సీజన్ ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. ఫలితంగా ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందిస్తోంది. ఇక, తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన బాబా భాస్కర్.. మొదటి రోజే అఖిల్ బ్యాచ్‌కు షాకిచ్చాడు. అసలేం జరిగిందో మీరూ చూడండి!

  వినోదం డబుల్.. రెస్పాన్స్ భారీగా

  వినోదం డబుల్.. రెస్పాన్స్ భారీగా


  బిగ్ బాస్ షోకు తెలుగులో ఆదరణ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. దీంతో ఓటీటీ వెర్షన్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌పై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఇది ఆరంభం నుంచే రంజుగా సాగుతోంది. ఇందులో డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు, బోల్డు బ్యూటీల రచ్చ, గొడవలతో రచ్చగా నడుస్తోంది. ఫలితంగా ఇంకాస్త ఎక్కువ మజా పంచుతోంది.

  Samantha: సమంత బాడీపై చైతూ గుర్తు.. నెటిజన్ ఊహించని ప్రశ్న.. మీరు కూడా ఆ తప్పు చేయొద్దంటూ!

  7 వారాల్లో.. ఏడుగురు ఎలిమినేట్

  7 వారాల్లో.. ఏడుగురు ఎలిమినేట్

  బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి మొత్తం 17 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా అడుగు పెట్టారు. ఇందులో కొత్త వాళ్లతో పాటు మాజీ కంటెస్టెంట్లు కూడా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వీళ్లలో నుంచి ఏడు వారాలకు గానూ ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వీలు, ముమైత్ ఖాన్ (రెండోసారి), స్రవంతి చోకారపు, మహేశ్ విట్టాలు షో నుంచి ఎలిమినేట్ అయిపోయారు.

  నామినేషన్ రచ్చ.. ఈ సారి ఇలా

  నామినేషన్ రచ్చ.. ఈ సారి ఇలా

  ఈ రియాలిటీ షో మొత్తంగా ఎన్నో రకాల టాస్కులుంటాయి. కానీ, అందులో అత్యంత ముఖ్యమైనదిగా నామినేషన్స్‌ను చెప్పుకోవచ్చు. దీని ద్వారా ఎవరిని ఉంచాలో ప్రేక్షకులు డిసైడ్ చేస్తుంటారు. ఇక, ఎనిమిదో వారానికి సంబంధించిన నామనేషన్ ప్రక్రియ కూడా గొడవలతో సాగింది. ఇందులో బిందు మాధవి, అఖిల్, అజయ్, అషు రెడ్డి, హమీదా, అనిల్ నామినేట్ అయ్యారు.

  చరణ్ హీరోయిన్ ఎద అందాల ఆరబోత: బ్లౌజ్ ఉన్నా లేనట్లే మరీ ఘోరంగా!

  హౌస్‌లోకి బాబా భాస్కర్ ఎంటర్

  హౌస్‌లోకి బాబా భాస్కర్ ఎంటర్

  ఆదివారం ఎపిసోడ్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన ప్రముఖ కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్.. హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వకుండా సీక్రెట్ రూమ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఆయన మాస్ సాంగ్‌తో బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లారు. అందులోని కంటెస్టెంట్లతో మొదట ఎన్నో రకాల ఆటలు ఆడించి అలరించారు. ఇదంతా ఎంతో ఫన్‌గా సాగింది.

  వాళ్లకు టాస్క్ ఇచ్చేసిన మాస్టర్

  వాళ్లకు టాస్క్ ఇచ్చేసిన మాస్టర్

  టాస్కులు ఆడించిన తర్వాత బాబా భాస్కర్ నేరుగా కంటెస్టెంట్ల దగ్గరకు వెళ్లిపోయాడు. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఆ తర్వాత అందరినీ లోపలికి పిలిచిన ఆయన.. నామినేట్ అవని వాళ్లంతా.. నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురిలో ఒకరిని సెలెక్ట్ చేయమని చెప్పాడు. దీంతో ఆరియానా ఆయనతో గొడవకు దిగింది. ఆ సమయంలో హౌస్‌లో గందరగోళ పరిస్థితి కనిపించింది.

  మళ్లీ రెచ్చిపోయిన దిశా పటానీ: ఈ సారి బట్లలేమీ లేకుండానే యమ ఘాటుగా!

  అఖిల్ బ్యాచ్‌కు షాక్.. పరోక్షంగా

  అఖిల్ బ్యాచ్‌కు షాక్.. పరోక్షంగా

  నామినేట్ అవని నటరాజ్, శివ, ఆరియానా, మిత్రాలు కలిసి అనిల్ పేరు చెప్పారు. కానీ, బాబా భాస్కర్ మాత్రం తనకు ఇద్దరి ఆట నచ్చుతుందని అజయ్, బిందు పేరు చెప్పాడు. చివరికి వాళ్లిద్దరిలో బిందూను సేఫ్ చేస్తున్నట్లు వెల్లడించాడు. దీంతో బిందు టైటిల్ ఫేవరెట్ అని.. అఖిల్ బ్యాచ్‌కు ఆయన పరోక్షంగా చెప్పనట్లైంది. ఇదే విషయాన్ని వాళ్లంతా మాట్లాడుకున్నారు.

  8వ వారంలో ఐదుగురు నామినేట్

  8వ వారంలో ఐదుగురు నామినేట్

  బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో ఎనిమిదో వారానికి గానూ జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో ఎన్నో మలుపుల తర్వాత మొత్తం ఐదుగురు నామినేట్ అయినట్లు బిగ్ బాస్ వెల్లడించాడు. అందులో అఖిల్ సార్థక్, అజయ్, అషు రెడ్డి, హమీదా ఖటూన్, అనిల్‌లు ఎలిమినేషన్ జోన్‌కు వచ్చారు. దీంతో ఈ వారం కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

  English summary
  Bigg Boss Telugu Non Stop OTT First Season Running Successfully. Baba Baskar Saves Bindu Madhavi From Nominations in This Week.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X