For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Non stop: యాంకర్ శివ 'నోటి దూల'.. రెచ్చిపోయిన బిందు.. కానీ చివరికి?

  |

  బిగ్ బాస్ నాన్ స్టాప్ చివరికి వచ్చేసింది మరి కొద్ది రోజుల్లో ఈ సీజన్ కు సంబంధించిన ఫినాలే కూడా జరగబోతోంది. ఈ నేపథ్యంలో హౌస్ మేట్స్ మధ్య ఎంత కుదిరితే అంత వివాదాలు రేపదనికి బిగ్ బాస్ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే తాజా ఎపిసోడ్ లో ఒక వింత టాస్క్ సృష్టించారు. ఈ దెబ్బతో స్నేహితులుగా ఉన్న యాంకర్ శివ, బిందు మధ్య కూడా విభేదాలు ఏర్పడ్డాయి. ఒకరి మీద ఒకరు కామెంట్లు చేసుకోవడం వరకు పరిస్థితి వెళ్లింది. ఆ వివరాల్లోకి వెళితే

  కొత్త టాస్క్

  కొత్త టాస్క్

  హౌస్‌లో ఉన్న ఎనిమిది మందికి 8 టైమ్స్ కార్డ్స్ ఇచ్చారు. ఈ టైమ్స్ కార్డ్‌లో వేర్వేరుగా నిముషాల లెక్కన టైమ్ రాసి ఉంటుంది. ఇంటి సభ్యులంతా ఏకాభిప్రాయంతో ఎక్కువ నిమిషాలు ఉన్న బోర్డు‌ని ధరించాలని చెప్పారు బిగ్ బాస్. మొత్తంగా ఉన్న ఎనిమిది మందిలో యాంకర్ శివ పెర్ఫామెన్స్ బెస్ట్‌గా ఉంటుందని ఇంటి సభ్యులు చెప్పగా.. కెప్టెన్సీ కంటెండర్ అయిన వాళ్లకంటే కానీ వాళ్లు ఎక్కువ కంటెంట్ ఇచ్చారు. ఆ లెక్క ప్రకారం ఆ 15 మినిట్స్ తనకు రావాలని బిందు మొదట వాదించింది.

  మొదటి స్థానం కోసం

  మొదటి స్థానం కోసం

  అయితే మీ ఇద్దరూ ఒకటే కదా అన్నట్టు మాట్లాడటంతో అసలు ఇప్పటి వరకూ శివ వల్ల తనకి ఏం ఉపయోగం కలిగిందో చెప్పాలని కోరింది. ఇంతలో గోల్డెన్ టిక్ వచ్చింది కదా.. అని మిత్రా చెప్పడంతో.. అది స్వాప్ చేయడం వల్ల వచ్చింది.. అది హెల్ప్ కాదు.. ఇప్పటి వరకు నాకు శివ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? నేను ముందు సీజన్లు బట్టి.. ముందు ట్రెండ్‌లను బట్టి నేను ఆడలేదు.. నా గేమ్ కొత్తగా ఉంది కాబట్టి.. ఆ 15 మినిట్స్ బోర్డ్ నాకే కావాలి అని అన్నది.

  లైన్లు గీసుకుని ఆడడం లేదంటూ

  లైన్లు గీసుకుని ఆడడం లేదంటూ

  అయితే మిగతా వాళ్ళు లెక్కలు వేసుకుని ఆడుతున్నారు నేను అలా ఆడడం లేదని చెప్పుకొచ్చింది. అయితే ఇంటి సభ్యులంతా ఏకాభిప్రాయంతో శివకి 15 మినిట్స్ బోర్డ్ ఇవ్వాలని డిసైడ్ కావడంతో.. బిందు మాత్రం ఆ 15 నిమిషాలు బోర్డు నీకు ఎందుకు ఇవ్వాలి.. నీకు ఓటు ఎందుకు వేయాలి చెప్పు అని శివని అడిగింది. దీంతో యాంకర్ శివ ఫస్ట్ వీక్ నుంచి జరిగింది చెప్పుకొస్తుండగా.. బిందు మాధవి అడ్డు తగిలింది. ఇంటి సభ్యులంతా లైన్లు గీసుకుని ఆడుతున్నారు కానీ.. నేను లైన్లు గీసుకుని ఆడలేదు అని చెప్పింది.

  హర్ట్ అయిన బిందు

  హర్ట్ అయిన బిందు

  అంతే కాదు నీ నోటి దూల వల్ల 15 నిమిషాల బోర్డ్ కావాలంటే వెళ్లి తీసుకో అని బిందు పేర్కొంది. తనకి 15 నిమిషాలు కావాలి అది కుదరదు అన్నారు కాబట్టి.. లీస్ట్ గా ఉన్న 1.30 నిమిషాలు బోర్డ్ కావాలి అని చెప్పి ఆ బోర్డు తీసుకుంది. అయితే ఈ నెంబర్ టాస్క్ అయిపోయిన తరువాత నువ్ గేమ్‌ని గివ్ అప్ ఇచ్చేశావ్ అని శివ అనడంతో దానికి బిందుమాధవి హర్ట్ అయింది. నేను టాప్ ప్లేస్ కోసం ఫైట్ చేశా.. ఆ తరువాత ప్లేస్‌లు నాకు వద్దు అయినా నువ్వు ఇలా స్టేట్మెంట్స్ పాస్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పుకొచ్చింది.

  ఇద్దరి మధ్య వాగ్వాదం

  ఇద్దరి మధ్య వాగ్వాదం

  శివ కూడా రాదు నోటి దూల నేను అనడం కరెక్ట్ కాదని అనడంతో వారిద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. నోటి దూల అనే పదం నువ్వే వాడేవారని బిందుమాధవి అంటే నేను ఆటో సరిగా అందడం లేదనే మాట నువ్వే మాట్లాడావని శివ అంటాడు. చివరికి మాటా మాటా పెరగడంతో ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని దూరం వెళ్ళి పోతారు. ఆ తర్వాత మళ్ళీ కలిశారు నోటి దూల అనడం కరెక్ట్ కాదు అని బిందుమాధవి శివ కి సారీ చెప్పింది కూడా అయితే ముందు వారిద్దరు గొడవ పడటం మాత్రం ఆసక్తికరంగా మారింది.

  English summary
  In Bigg Boss Non stop fight between anchor Shiva and Bindu Madhavi became hot topic.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  Desktop Bottom Promotion