For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Non Stop: బిందుపై నటరాజ్ అసభ్య వ్యాఖ్యలు.. అవి చూపించడానికే అలాంటి బట్టలు అంటూ!

  |

  చిత్ర విచిత్రమైన టాస్కులు, కంటెస్టెంట్ల మధ్య రకరకాల ఎమోషన్లు, అప్పుడప్పుడూ టెన్షన్ కలిగించే ఎలిమినేషన్లు ఇలా ఎన్నో సంఘటనల సమాహారమే బిగ్ బాస్ షో. రియాలిటీ ఆధారంగా నడుస్తూ ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ షో.. ఆరంభం నుంచే భారీ రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది. ఫలితంగా దేశంలోనే నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది.

  దీంతో నిర్వహకులు ఇప్పటికే ఐదు రెగ్యూలర్ సీజన్లను పూర్తి చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ను జనాలు మెచ్చే కంటెంట్‌తో నడుపుతున్నారు. ఇక, తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో నటరాజ్ మాస్టర్.. బిందు మాధవిపై అసభ్య వ్యాఖ్యలతో పర్సనల్ ఎటాక్ చేశాడు. అసలేం జరిగింది? దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

  చివరి దశకు చేరడంతో రసవత్తరం

  చివరి దశకు చేరడంతో రసవత్తరం

  ఎన్నో అంచనాల నడుమ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ ప్రారంభం అయింది. అందుకు అనుగుణంగానే ఇది భారీ స్థాయిలో స్పందనను దక్కించుకుంది. ఫలితంగా అత్యధిక వ్యూస్‌ను దక్కించుకుంటోంది. ఇక, ఇప్పుడు ఈ సీజన్‌ చివరి దశకు చేరుకోవడంతో మరింత రంజుగా సాగుతోంది. మరీ ముఖ్యంగా టాప్ 5లో ఎవరు ఉంటారన్న దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది.

  స్పోర్ట్స్ బ్రాతో శృతి హాసన్ సెల్ఫీ: టాప్ వ్యూ నుంచి ఎద అందాల జాతార

  టైటిల్ ఫేవరెట్.. నామినేషన్స్ వల్ల

  టైటిల్ ఫేవరెట్.. నామినేషన్స్ వల్ల

  బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి మొత్తం 18 కంటెస్టెంట్లు వచ్చారు. ఇందులో కొత్త వాళ్లతో పాటు మాజీ కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. ఇక, ఇందులో తెలుగు హీరోయిన్ బిందు మాధవి టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. ఆటకు ఆటతో పాటు మైండ్ గేమ్ పరంగానూ సత్తా చాటుతోంది. ఇక, నామినేషన్స్‌లో గొడవల వల్ల ఈమె మరింత హైలైట్‌గా అవుతూనే ఉంటోంది.

   పదకొండో వారం నామినేషన్స్ ఇలా

  పదకొండో వారం నామినేషన్స్ ఇలా

  11వ వారానికి జరిగిన నామినేషన్ ప్రక్రియను సరికొత్తగా డిజైన్ చేశారు. ఇందులో భాగంగా హౌస్‌లోని కంటెస్టెంట్లు నామినేట్ చేయాలనుకున్నవారిని ముగ్గురిని ఎంచుకోవాలి. వాళ్లను గార్డెన్ ఏరియాలో ఉన్న ఎగ్జిట్ బోర్డు కింద నిల్చోబెట్టాలి. ఆ తర్వాత అందుకు తగిన కారణాలను చెప్పాలి. ఈ వారానికి హౌస్‌లో కెప్టెన్ ఎవరూ లేకపోవడంతో అందరూ నామినేషన్స్‌లో పాల్గొన్నారు.

  దీప్తి సునైనా అందాల ఆరబోత: అలాంటి బట్టల్లో గతంలో చూడనంత హాట్‌గా!

  ముగ్గురిని ఎంపిక చేసిన హీరోయిన్

  ముగ్గురిని ఎంపిక చేసిన హీరోయిన్

  పదకొండవ వారం నామినేషన్ ప్రక్రియ కూడా గొడవలతోనే సాగింది. ఇందులో ఒక్కో కంటెస్టెంట్ టాప్ 5లో ఉండడానికి అర్హత లేని ముగ్గురిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా బిందు మాధవి.. మిత్ర శర్మ, అఖిల్ సార్థక్, నటరాజ్ మాస్టర్‌లను ఎంచుకుని నామినేట్ చేసింది. ఆ సమయంలో వీళ్లు ముగ్గురూ ఆమెపై విరుచుకుపడ్డారు. అలాగే ఆమెపై మాటల దాడి చేశారు.

   నటరాజ్ అసభ్య వ్యాఖ్యలు చేస్తూ

  నటరాజ్ అసభ్య వ్యాఖ్యలు చేస్తూ

  నామినేషన్స్ టాస్కులో ఎవరైనా తనను నామినేట్ చేస్తే తట్టుకోలేని నటరాజ్ మాస్టర్.. బిందు మాధవిపై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. 'నీకు గేమ్ ఆడడం రాదు. నీకు ఎమోషన్స్ ఉండవు. అసలు నిన్ను బిగ్ బాస్ ఎందుకు తీసుకు వచ్చారో అర్థం కావడం లేదు. నువ్వొక పిచ్చిదానివి. పాయింట్స్ లేక ఏదేదో మాట్లాడతావు. బిగ్ బాస్ ఈమెను బయటకు పంపేయండి' అన్నాడు.

  Samantha: శృతి మించిన సమంత హాట్ షో.. ఆమెను ఇంత గ్లామర్‌గా ఎప్పుడూ చూసుండరు!

  పెంపకం గురించి ఆమె తండ్రిపైన

  పెంపకం గురించి ఆమె తండ్రిపైన

  అనంతరం బిందు మాధవి పెంపకం పైనా నటరాజ్ కామెంట్స్ చేశాడు. 'అయ్యా.. మీ కూతురిని ఎలా పెంచారు? ఈ విషయంలో మీరు మాత్రం ఫెయిల్ అయ్యారు. మీ అమ్మాయిని లాయర్ చేద్దామని అనుకున్నారు కదా. ఈమె డబ్బులు తీసుకునే దొంగ లాయర్ అవుతుంది. అస్సలు ఆడడం చేతకాదు. ఎప్పుడూ బెడ్ మీద కూర్చుని కాళ్లు ఊపుతుంది' అని చెప్పుకొచ్చాడు.

  అవి చూపించాలనే ఆ బట్టలు అని

  అవి చూపించాలనే ఆ బట్టలు అని

  నామినేషన్స్ టాస్క్ అయిన తర్వాత రూమ్‌లో 'బిందు మాధవి అనే అమ్మాయి పర్సనల్‌గా ఎటాక్ చేస్తుంది. గేమ్ ఆడడం రాదు. కానీ, అందరి ఎమోషన్స్‌తో ఆడుకుంటుంది. ఈమె షో తర్వాత చెన్నై వెళ్లిపోతుంది. నేను తెలుగొడిని. ఆమె ఇక్కడ ఉండదు. అసలు దెబ్బలు తగిలాయని చూపించడానికే స్లీవ్‌లెస్ బట్టలు వేసుకుని తిరిగింది' అంటూ నటరాజ్ పర్సనల్‌గా ఎటాక్ చేశాడు.

  English summary
  Bigg Boss Non Stop Season Running Successfully. Nataraj Master Did Shocking Comments on Bindu Madhavi In Recent Episode.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X