For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Non Stop గ్రూప్ రాజకీయాల జోరు.. నన్ను చంపేయ్ దేవుడా అంటూ నటరాజ్ మాస్టర్ ఆవేదన

  |

  తెలుగులోకి పరిచయం అయిన చాలా తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను సొంతం చేసుకుని సక్సెస్‌ఫుల్ షోగా పేరు తెచ్చుకుంది బిగ్ బాస్. దేశంలో మరే షోకూ దక్కనంత రేటింగ్‌ను అందుకుంటూ సత్తా చాటింది. ఫలితంగా ఐదు సీజన్లను కూడా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ను నడుపుతున్నారు.

  ఇది చివరి దశకు చేరుకోవడంతో ఊహించని ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. ఫలితంగా ఈ సీజన్ జనరంజకంగా సాగుతూ ప్రేక్షకులకు మజాను అందిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో అఖిల్ సార్థక్‌ చేసిన పనితో నటరాజ్ మాస్టర్‌కు బిగ్ షాక్ తగిలింది. అసలేం జరిగింది? దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

  చివర్లో మరింత రసవత్తరంగా

  చివర్లో మరింత రసవత్తరంగా

  ఎన్నో అంచనాల నడుమ ప్రారంభం అయిన బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ మొదటి నుంచే రసవత్తరంగా సాగుతోంది. కొత్త పాత కంటెస్టెంట్ల సందడితో ఇది ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంటోంది. దీనికితోడు బోల్డు కంటెంట్‌ను ఎక్కువగా చూపించడంతో రెస్పాన్స్ మరింత పెరుగుతోంది. ఇక, ఇప్పుడు చివరి దశకు చేరుకోవడంతో ఇది మరింత రంజుగా మారిపోతోంది.

  ప్రియుడితో ఒకే రూంలో పాయల్ రాజ్‌పుత్: ఏకంగా అలాంటి పని చేస్తూ షాకిచ్చిందిగా!

  నామినేషన్స్ తర్వాత వాళ్లతో

  నామినేషన్స్ తర్వాత వాళ్లతో


  సాధారణంగా బిగ్ బాస్ షోలో నామినేషన్స్ టాస్కులు ఎన్నో గొడవలతో రచ్చ రచ్చగా సాగుతూ ఉంటాయి. ఈ నాన్ స్టాప్ సీజన్‌లో ఇవి మరింతగా శృతి మించుతున్నాయి. ఈ వారం కూడా అదే రీతిలో గొడవలు జరిగాయి. ఆ హీట్ చల్లార్చేందుకు బిగ్ బాస్ హౌస్‌లోకి స్పెషల్ గెస్టులు వస్తున్నారు. బుధవారం ఎపిసోడ్‌లో విశ్వక్ సేన్, గురువారం జీవితా, రాజశేఖర్ ఎంట్రీ ఇచ్చారు.

  ఓట్ అప్పీల్ టాస్కులు స్టార్ట్

  ఓట్ అప్పీల్ టాస్కులు స్టార్ట్


  బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ ఆఖరి దశకు చేరుకోవడంతో కంటెస్టెంట్లను ప్రేక్షకులకు మరింత చేరువ చేయడానికి టాస్కులు ఇస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ వారం ఓట్ అప్పీల్ చేసుకునేందుకు వీలుగా కొన్ని టాస్కులు ఇస్తున్నారు. ఇందులో విజయం సాధించిన వాళ్లు పోడియం దగ్గరకు వెళ్లి మరీ ప్రేక్షకులను తమకు ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్ధించవచ్చు.

  గర్భంతోనూ స్టార్ హీరోయిన్ హాట్ ట్రీట్.. టాప్ అందాలను హైలైట్ చేస్తూ దారుణంగా!

  ఫస్ట్ బాబా... తర్వాత అతడు

  ఫస్ట్ బాబా... తర్వాత అతడు


  ఓట్ అప్పీల్ చేసుకునేందుకు గానూ బిగ్ బాస్ ఇస్తున్న టాస్కుల్లో మొదటి రౌండ్‌లో బాబా భాస్కర్ విజయం సాధించాడు. దీంతో ప్రేక్షకులను ఓట్లు అభ్యర్ధించాడు. ఆ తర్వాత అంటే తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో జరిగిన ఫ్లవర్స్ టాస్కులో అనిల్ రాథోడ్ గెలుపొందాడు. దీంతో అతడు కూడా తనకు ఓట్లు వేయమంటూ ప్రేక్షకులను కోరుకున్నాడు. ఈ టాస్కులు కంటిన్యూ అవుతాయి.

  నటరాజ్‌కు అఖిల్ బిగ్ షాక్

  నటరాజ్‌కు అఖిల్ బిగ్ షాక్


  ఓట్‌ను అప్పీల్ చేసుకునేందుకు బిగ్ బాస్ ఇచ్చిన ఫ్లవర్స్ టాస్కు కొన్ని గొడవలతో సాగింది. మరీ ముఖ్యంగా ఇందులో నటరాజ్ మాస్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడినంత కసిగా ఆడాడు. అయితే, ఆయన క్లోజ్ ఫ్రెండ్ అయిన అఖిల్ సార్థక్.. తన దగ్గర ఉన్న పూలలో కొన్నింటిని అనిల్ రాథోడ్‌కు ఇవ్వడంతో అతడే గెలుపొందాడు. దీంతో నటరాజ్‌కు బిగ్ షాక్ తగిలినట్లైంది.

  ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో యాంకర్ స్రవంతి రచ్చ: ఎద అందాలను హైలైట్ చేస్తూ ఘోరంగా!

  నటరాజ్ వింత ప్రవర్తనతో

  నటరాజ్ వింత ప్రవర్తనతో


  అఖిల్ సార్థక్.. అనిల్‌కు సహాయం చేయడంతో నటరాజ్ మాస్టర్‌కు కాలిపోయింది. అప్పుడాయన 'ప్రాణం పోయేంత వరకూ ఆడతాను. నోరు తెరిచి అఖిల్‌ని అడిగాను. కానీ, నన్ను నాలుగో సారి మోసం చేశాడు. నేను ఓడిపోయే వ్యక్తిని కాదు' అంటూ బాబా భాస్కర్ దగ్గర చెప్పుకున్నాడు. దీనికి అఖిల్ 'ఎప్పటి నుంచో అనిల్‌కు సాయం చేద్దామనుకున్నా' అని క్లారిటీ ఇచ్చాడు.

  నన్ను చంపేయ్ అంటూనే

  నన్ను చంపేయ్ అంటూనే


  అనిల్ గెలిచినట్లు ప్రకటించగానే నటరాజ్ ఆకాశం వైపు చూస్తూ 'బాధ తట్టుకోలేకపోతున్నా. ఈ హౌస్‌లో ఎవరూ నాకు హెల్ప్ చేయరు. నన్ను చంపెయ్. కనీసం ఆడియన్స్ ఓట్లను అడుక్కునే అవకాశం లేకుండా చేశావ్. ఆ అవకాశం కూడా లాగేసుకున్నావే. ఇంకేమి చేస్తావ్. మెడపట్టి చంపెయ్' అంటూ దేవుడితో మాట్లాడాడు. ఇలా అతడి వింత ప్రవర్తనతో అంతా షాక్ అయ్యారు.

  English summary
  Bigg Boss Telugu Non Stop First Season Running Successfully. Nataraj Unexpected Behaviour in Vote Appeal Task In Recent Episode.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  Desktop Bottom Promotion