For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: బిగ్ బాస్ సంచలన నిర్ణయం.. కొత్త సీజన్‌ క్యాన్సిల్.. ఎందుకు ఆపుతున్నారో తెలిస్తే హ్యాపీనే!

  |

  ఇండియాలోని చాలా భాషల్లో ప్రసారం అవుతోన్నా తెలుగులో మాత్రమే ఊహించిన దాని కంటే ఎక్కువ స్పందనను దక్కించుకుంటూ.. అత్యధిక టీఆర్పీ రేటింగ్‌తో దేశంలోనే నెంబర్ స్థానంలో నిలుస్తోన్న రియాలిటీ షో బిగ్ బాస్. గతంలో ఎప్పుడూ చూడని కాన్సెప్టుతో నడుస్తోన్నా దీనికి ప్రేక్షకులు భారీ రెస్పాన్స్ అందించారు. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఆరో దానిని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ కొత్త సీజన్ క్యాన్సిల్ చేసినట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది. వివరాల్లోకి వెళ్తే..

  ఐదు రెగ్యూలర్.. ఒక ఓటీటీ

  ఐదు రెగ్యూలర్.. ఒక ఓటీటీ

  తెలుగులోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చినా.. ప్రేక్షకుల హృదయాలను చూరగొన్న షో బిగ్ బాస్. అందుకే నిర్వహకులు క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కనీసం ఒక సీజన్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఇప్పటికే ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుందీ షో. ఇవన్నీ భారీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుని సూపర్ డూపర్ హిట్‌లుగా సత్తా చాటాయి.

  కొలతలు చూపిస్తూ కవ్విస్తోన్న అనుపమ: హాట్ షోకు మించిన ట్రీట్‌తో అరాచకం

  ఆరో సీజన్ పూర్తి.. ట్విస్టుతో

  ఆరో సీజన్ పూర్తి.. ట్విస్టుతో


  ఇప్పటి వరకూ వచ్చిన సీజన్లు సూపర్ హిట్ అవడంతో బిగ్ బాస్ నిర్వహకులు ఇటీవలే ఆరో దానిని కూడా విజయవంతంగా నడిపించి.. సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్నారు. గత ఆదివారమే జరిగిన ఆరో సీజన్ ఫినాలే ఎన్నో ట్విస్టులతో సాగింది. ఫలితంగా ఇందులో ప్రైజ్ మనీ ఒకరికి, ట్రోఫి మరొకరికి సొంతమైంది. మొత్తంగా ఇందులో సింగర్ రేవంత్ విజేతగా నిలిచాడు.

  అందరూ వాళ్లే... ఒక్క లేడీ

  అందరూ వాళ్లే... ఒక్క లేడీ

  తెలుగులో ఇప్పటి వరకూ మొత్తం ఆరు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లు విజయవంతంగా పూర్తి అయ్యాయి. ఇలా మొత్తం ఏడు సీజన్లలో ఆరుగురు మేల్ కంటెస్టెంట్లు విన్నర్లు అయ్యారు. ఒక్క నాన్ స్టాప్ సీజన్‌లో మాత్రమే లేడీ కంటెస్టెంట్ విజేతగా నిలిచింది. ఇలా గెలిచిన వాళ్లలో శివ బాలాజీ, కౌశల్, రాహుల్ సిప్లీగంజ్, అభిజీత్, వీజే సన్నీ, బిందు మాధవి, రేవంత్‌లు ఉన్నారు.

  Shrihan Remuneration: శ్రీహాన్ గెలిచింది 45 లక్షలు.. రెమ్యూనరేషన్‌ భారీగా.. ట్యాక్సులు పోను ఎంతంటే!

  ఆరో సీజన్ ప్లాప్.. నాగ్ ఔట్

  ఆరో సీజన్ ప్లాప్.. నాగ్ ఔట్

  తెలుగులో బిగ్ బాస్ షో ఎంతటి సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ, ఆరో సీజన్ మాత్రం ఎంతో చప్పగా సాగింది. దీనికితోడు ఫేక్ ఎలిమినేషన్స్ కూడా ఇందులో కనిపించాయి. అందుకే దీనికి రేటింగ్ కూడా సరిగా రాలేదు. దీంతో ఈ సీజన్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక, ఈ సీజన్ తర్వాత నుంచి నాగార్జున హోస్టింగ్ బాధ్యతలు చేపట్టడం లేదని ప్రచారం జరుగుతోంది.

  కొత్త సీజన్ క్యాన్సిల్ చేస్తూ

  కొత్త సీజన్ క్యాన్సిల్ చేస్తూ

  బిగ్ బాస్ ఆరో సీజన్ గత ఆదివారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో కొత్త సీజన్ గురించి అప్పుడే ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అదే సమయంలో వచ్చే ఏడాది ప్రసారం కానున్న ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ రెండో సీజన్ గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని నిర్వహకులు రద్దు చేసినట్లు తాజాగా ఓ న్యూస్ బయటకొచ్చింది.

  Revanth Remuneration: రేవంత్‌కు షాకింగ్ రెమ్యూనరేషన్.. ప్రైజ్ మనీతో కలిపితే.. చేతికొచ్చింది మాత్రం!

  అసలు కారణం ఏంటంటే

  అసలు కారణం ఏంటంటే

  బిగ్ బాస్ ఆరో సీజన్ ఫ్లాప్ అవడంతో ఏడో దాన్ని ఎలాగైనా సక్సెస్ చేయాలన్న పట్టుదలతో నిర్వహకులు ఉన్నారని తెలిసింది. ఇందులో భాగంగానే దీన్ని వీలైనంత త్వరగా ప్రారంభించాలని ప్లాన్ చేసుకుంటున్నారని తెలిసింది. దీనికి సంబంధించిన పనులపై ఫోకస్ చేయడం కోసమే నాన్ స్టాప్ రెండో సీజన్‌ను క్యాన్సిల్ చేస్తున్నారని బుల్లితెర వర్గాల్లో ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

  ఇది లేకున్నా హ్యాపీగానే

  ఇది లేకున్నా హ్యాపీగానే

  బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో రెండో దానిపై అందరిలోనూ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని క్యాన్సిల్ చేస్తున్నారన్న వార్త చాలా మందిని బాధ పెడుతుంది. అదే సమయంలో బిగ్ బాస్ ఏడో సీజన్ మరింత ముందుగా మొదలు అవుతుందని తెలియడంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని చెప్పొచ్చు.

  English summary
  Bigg Boss Telugu Non Stop OTT First Season Completed Successfully. Now Show Unit Cancelled Second Season for Next Year.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X