Don't Miss!
- News
బీజేపి ఛీఫ్ కు ప్రమాద ఘంటికలు.!అధిష్టానం టచ్ లో ఆ ఉద్యమ నేత.!"సన్ స్ట్రోక్" ప్రభావమేనా.?
- Sports
INDvsNZ : పృథ్వీ షాకు నో ఛాన్స్!.. పాండ్యాకు మూడో టీ20లో అగ్ని పరీక్ష!
- Finance
SBI: లోన్ తీసుకుంటే వడ్డీ డిస్కౌంట్.. అబ్బా SBI బలే ఆఫర్.. పూర్తి వివరాలు
- Technology
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్లు!
- Automobiles
సీరియల్స్ చేస్తూ ఖరీదైన బెంజ్ కారు కొనేసి రూపాలి గంగూలీ.. ధర ఎంతో తెలుసా?
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
- Lifestyle
Chanakya Niti: జీవితంలో ఈ సుఖాలు అనుభవించాలంటే మంచి కర్మలు చేసుండాలి, అవేంటంటే..
Bigg Boss: గెలిచిన వారందరి పరిస్థితి దారుణం.. కనీసం బిందుమాధవి అయినా బ్రేక్ చేస్తుందా?
బిగ్ బాస్ అనేది ప్రస్తుత రోజుల్లో ఓ వర్గం నటీనటులకు అలాగే టెక్నీషియన్స్ కు కూడా మంచి ప్లాట్ ఫామ్ గా మారిపోయింది. బిగ్ బాస్ ద్వారా గుర్తింపుని అందుకున్న తర్వాత మంచి కెరియర్ ను సెట్ చేసుకుందామని చాలా ఓపిక తో కంటెస్టెంట్ ఎంట్రీ ఇస్తూ ఉంటారు.. ఫ్యామిలీ కి దూరంగా ఇండస్ట్రీకు దూరంగా బిగ్ బాస్ లో ఉండడం అంటే అంత సాధారణమైన విషయం కాదు.
కానీ జీవితంలో మరొక అడుగు ముందుకు వేయాలని ఈ ఫ్లాట్ ఫార్మ్ ను ఉపయోగించుకోవాలని అనుకుంటారు. అయితే ఇప్పటివరకు బిగ్ బాస్ తెలుగు అన్ని సీజన్స్ లో కూడా విన్నర్స్ ఒక చేదు అనుభవాన్ని ఎదుర్కొంటున్నారు. ఇక బిందు మాధవి బ్యాడ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మొదటి విన్నర్
బిగ్ బాస్ మొదటి సీజన్ లో ఎవరూ ఊహించని విధంగా శివబాలాజీ టైటిల్ విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే. అతను గెలిచిన తర్వాత భారీ స్థాయిలో ప్రైజ్ మనీ సొంతం చేసుకున్నప్పటికీ కెరీర్ విషయంలో మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. ఆ తరువాత ఏదో ఒకటి రెండు సినిమాలలో తప్పితే మళ్లీ కనిపించలేదు. ఆ సినిమాలు కూడా డిజాస్టర్ అయ్యాయి.

కౌశల్ మండా.. డిజాస్టర్
ఇక రెండవ సీజన్ లో కౌశల్ మండా ఏ స్థాయిలో గుర్తింపు అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతనికి వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ చూసిన తర్వాత తప్పకుండా ఇండస్ట్రీలో ఒక హీరోగా నిలదొక్కుకున్నాడు అని అందరూ అనుకున్నారు. కానీ కనీసం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా అతనికి అవకాశాలు రాలేదు. బిగ్ బాస్ లో అతని స్ట్రాటజీ సక్సెస్ అయినప్పటికీ బయట ప్రపంచంలో మాత్రం సినీ కెరీర్ విషయంలో పూర్తిగా విఫలమయ్యాడు.

రాహుల్ సిప్లిగంజ్
ఇక మూడవ సీజన్లో రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లోకి రాక ముందే ఈ సింగర్ కు మంచి క్రేజ్ అయితే ఉంది. చాలా సినిమాల్లో పాడే అవకాశాలు కూడా వచ్చాయి. బిగ్ బాస్ తర్వాత కూడా పెద్దగా అతని కెరీర్ విషయంలో వండర్స్ ఏమీ జరగలేదు. గతంలో ఎలాగైతే గాయకుడిగా కొనసాగుతున్నాడో ఇప్పుడు కూడా అదే తరహాలో కొనసాగుతున్నాడు.

అబిజిత్ కూడా..
ఇక నాలుగవ సీజన్లో అభిజిత్ కూడా భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. అతను టైటిల్ విన్నర్ అని షో మొదలైన మొదటి వారం నుంచే ప్రేక్షకులలో ఒక నమ్మకం ఏర్పడింది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో హీరోగా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన అభిజిత్ ఆ తర్వాత బిగ్ బాస్ ద్వారా క్లిక్ అవుతాడు అనుకుంటే అతనికి ఆ షో ఎలాంటి లాభం ఇవ్వలేకపోయింది.

Vj సన్నీ గెలిచినా లాభం లేదు
ఇక ఐదవ సీజన్ లో ఎవరూ ఊహించని విధంగా వీజే సన్నీ గెలిచాడు. అతను గెలుస్తాడు అని అయితే ఎవరూ ఊహించలేకపోయారు. అదృష్టవశాత్తు టాప్ ఫైనల్ స్టేజ్ కి వచ్చిన సన్నీ టైటిల్ ను సొంతం చేసుకున్న తర్వాత హీరోగా కూడా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కానీ అతని నుంచి ఆశించినంత అప్డేట్స్ అయితే ఏమీ రాలేదు.

బిందుమాధవి సక్సెస్ అవుతుందా?
ఈ తరహాలో ఇప్పటి వరకు ఐదు సీజన్స్ లో గెలిచిన ఫైనల్ విన్నర్స్ కు బిగ్ బాస్ ద్వారా వారి జీవితాల్లో పెద్దగా మార్పులేమి చోటు చేసుకోలేదు. ఇక ఇప్పుడు నాన్ స్టాప్ షోలో ఆడపులి అంటూ గెలిచినా బిందు మాధవి సినిమా ఇండస్ట్రీలో ఎంతవరకు నిలదొక్కుకుంటుంది అనేది హాట్ టాపిక్ గా మారింది. మరి ఆమె ఇప్పటివరకు వస్తున్న బ్యాడ్ సెంటిమెంటును బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.