For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Non Stop లోకి యాంకర్ అనసూయ.. నటరాజ్ మాస్టర్ అలాంటి షాక్!

  |

  బిగ్ బాస్ నాన్ స్టాప్ చివరి దశలోకి చేరుకుంటున్న తరుణంలో కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా బలంగా పోరాడుతున్నారు. వారి శక్తికి మించి టాలెంట్ ను భయటపెట్టేందుకు ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక మధ్యలో కొన్నిసార్లు సహనాన్ని కూడా కోల్పోవాల్సి వస్తోంది. అయితే ఈ ఫైనల్ ఎపిసోడ్స్ లో బిగ్ బాస్ స్పెషల్ గెస్టులను కూడా హౌస్ లోకి రప్పిస్తున్నాడు. ఇక బిగ్ బాస్ లోకి నేడు మరొక అతిధి కూడా రావడం జరిగింది. అందుకు సంబంధించిన ప్రోమో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

  ఇప్పుడు అనసూయ..

  ఇప్పుడు అనసూయ..

  నిన్నటి ఎపిసోడ్ లో జీవిత రాజశేఖర్ శేఖర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. అలాగే సంగీత దర్శకుడు అనుబ్ రూబెన్స్ కూడా వచ్చాడు. ఇక గ్లామరస్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా మొదటిసారి బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలోకి అడుగు పెట్టడం హైలెట్ గా నిలిచింది.

  నాటంజలి హాట్ డ్యాన్స్

  నాటంజలి హాట్ డ్యాన్స్

  ఇక అనసూయను ఇంప్రెస్ చేసి సేవ్ అయ్యేందుకు కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా బలంగా పోరాడుతున్నారు. అనసూయ అనే పాటతో ఎంట్రీ ఇచ్చిన యాంకర్ కు ఇంటి సభ్యులు అందరూ కూడా డ్యాన్స్ స్టెప్పులతో వెల్కమ్ చెప్పారు. ఇక ప్రత్యేకంగా బాబా భాస్కర్ నాటంజలిని ఇన్వైట్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు.

   ఘాటైన స్టెప్పులు

  ఘాటైన స్టెప్పులు

  నాటంజాలి అంటే మరెవరో కాదు. నటరాజ్ మాస్టర్ అమ్మాయి వేషంలో వచ్చి ఐటెమ్ సాంగ్ తో రెచ్చిపోయాడు. ఆయనతో పాటు యాంకర్ శివ కూడా ఘాటైన స్టెప్పులు వేసి షాక్ ఇచ్చాడు. ఇక బాబా భాస్కర్ అయితే మరింత నాటుగా నటరాజ్ మాస్టర్ ను వెనకాల నుంచి పైకి లేపాడు. వీరి స్టెప్పులు చూసి యాంకర్ అనసూయ మిగతా హౌస్ మేట్స్ కూడా షాక్ అయ్యారు.

  సడన్ చేంజ్.. ఎందుకు?

  సడన్ చేంజ్.. ఎందుకు?


  ఇక ఆ తరువాత అనసూయ ఇంటి సభ్యులను రియల్ ప్రశ్నలు అంటూ బలమైన సందేహాలు గురించి అడిగేసింది. అయితే ఫ్యామిలీ ఎపిసోడ్ తరువాత నువ్వు సడన్ గా బిందుకు క్లోజ్ అయ్యావు. ఎందుకు అలా.. ఉమెన్ కార్డ్ వాడుతున్నావు అని అనసూయ ప్రశ్నించింది. ఇక అందుకు అరియానా నవ్వుతూనే అలా అనిపిస్తే అది మీకే వదిలేస్తున్నాను అంటూ ఆన్సర్ ఇచ్చేసింది.

  అఖిల్ కౌంటర్

  అఖిల్ కౌంటర్


  ఇక బిందుమాధవిని అడుగుతూ.. ప్రతీ సారి గ్రూప్ గేమ్ ఆడుతున్నావు అంటూ అఖిల్ ని టార్గెట్ చేస్తూ నువ్వు స్ట్రాంగ్ అనుకుంటున్నావు కదా అని అనసూయ అడిగింది. ఇక మధ్యలో అఖిల్ కూడా గ్రూప్ గా ఒక్కసారి ఆడినా కూడా అది గ్రూప్ గేమ్ అని అనడంతో.. నేను ఎప్పుడు అలా గ్రూప్ గేమ్ ఆడలేదు అని బిందు సమాధానం ఇచ్చింది. ఇక ఆడియెన్స్ అడిగిన ప్రశ్న అది అని అఖిల్ మరో స్వీట్ కౌంటర్ ఇచ్చాడు.

  అఖిల్ కూడా..


  ఇక అఖిల్ కూడా సడన్ గా ఫ్యామిలీ వీక్ కు వచ్చేసరికి బిందుతో క్లోజ్ గా మంచిగా మాట్లాడుతున్నాడు అని ఎందుకలా అని ప్రశ్నించారు. ఇక నామినేషన్ డే తప్పితే మిగతా చోట్లా పెద్దగా కనిపించని మిత్ర శర్మ ఎలా ఉంటుంది అని మరొక ప్రశ్న ఎదురవ్వగా ఆమె సున్నితంగా ఐ లవ్ యూ అని అడిగిన వారికి సమాధానం ఇచ్చింది. ఇక చివరికి శివను అడుగుతూ.. ఎలా ఉంది? అడిగే దగ్గరి నుంచి.. అడిగించుకునే వరకు వచ్చింది.. అని అనసూయ ప్రశ్నించింది. మరి ఈ ప్రశ్నలకు కంటెస్టెంట్స్ పూర్తి స్థాయిలో ఎలాంటి సమాధానం చెబుతారో నేడు ప్రసారం అయ్యే ఎపిసోడ్ లో చూడాలి.

  English summary
  Bigg boss non stop telugu latest promo anchor anasuya special entry natraj master shocking dance
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  Desktop Bottom Promotion