For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Non Stop Winner: ఓటింగ్‌లో బిగ్ ట్విస్ట్.. మళ్లీ మారిన టాప్ పొజిషన్.. ఓట్లలో తేడా ఎంతంటే!

  |

  దేశంలోని ఎన్నో భాషల్లో ప్రసారం అవుతోన్నా.. తెలుగులో మాత్రమే అత్యధిక టీఆర్పీ రేటింగ్‌ను సొంతం చేసుకుంటూ టాప్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. గతంలో ఎన్నడూ చూడని కాన్సెప్టే అయినా మన ప్రేక్షకులు దీనికి భారీ స్థాయిలో స్పందన అందించారు. ఫలితంగా ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ను కూడా సక్సెస్‌ఫుల్‌గా నడుపుతున్నారు. ఇందులో ప్రస్తుతం ఫినాలే వీక్ జరుగుతోంది. ఇక, ఈ సీజన్‌లో టైటిల్ కోసం ఏడుగురు పోటీ పడుతుండగా.. వాళ్లలో ఇద్దరికి మాత్రమే భారీగా ఓట్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం చివరికి ఓటింగ్‌లో ట్విస్ట్ కనిపించిందని తెలిసింది. ఆ సంగతులేంటో మీరే చూడండి!

  ఫినాలే వీక్.. జర్నీ వీడియోలు

  ఫినాలే వీక్.. జర్నీ వీడియోలు

  బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌ ఆరంభం నుంచే ఆసక్తికరమైన సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఇందులో గతంలో ఎన్నడూ చూడని టాస్కులు, సన్నివేశాలు, బోల్డు సీన్స్‌ను చూపించడంతో ఆదరణను దక్కించుకుంది. ఫలితంగా ఫినాలేకు చేరుకుని మరింత మజాను అందిస్తోంది. ఇక, ఇప్పుడు ఈ వారంలో కంటెస్టెంట్ల జర్నీ వీడియోలను ప్రసారం చేస్తున్నారు.

  ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో హీరోయిన్ హాట్ ట్రీట్: అబ్బో ఆమెనిలా చూశారంటే!

  18 మంది రాక... వాళ్లంతా ఔట్

  18 మంది రాక... వాళ్లంతా ఔట్

  బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి 18 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో కొత్త వాళ్లతో పాటు మాజీ కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. వీళ్లలో నుంచి 11 వారాలకు గానూ ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వీలు, ముమైత్ ఖాన్ (రెండోసారి), స్రవంతి చోకారపు, మహేశ్ విట్టా, అజయ్ కుమార్‌, హమీదా ఖటూన్‌, అషు రెడ్డి, నటరాజ్‌లు బయటకు వెళ్లిపోయారు.

  టాప్ 5 కాదు... టాప్ 7 అంటూ

  టాప్ 5 కాదు... టాప్ 7 అంటూ

  ప్రేక్షకుల్లో ఏర్పడిన అంచనాలకు ఏమాత్రం తగ్గకుండానే బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ రసకందాయంగా సాగుతోంది. ఇందులో ప్రాసెస్ కూడా గతంలో మాదిరిగా కాకుండా కొత్తగా డిజైన్ చేశారు. మరీ ముఖ్యంగా ఈ సారి టాప్ 5 కాకుండా.. టాప్ 7 కంటెస్టెంట్లను ఫినాలేకు పంపారు. అందులో బిందు, మిత్రా, అఖిల్, బాబా, అనిల్, ఆరియానా, శివలు టైటిల్ బరిలో నిలిచారు.

  బెడ్‌పై బ్రాతో అషు రెడ్డి రచ్చ: ఏకంగా అవి చూపిస్తూ రెచ్చిపోయిందిగా!

  టైటిల్ ఫైట్ ఇద్దరి మధ్యనే

  టైటిల్ ఫైట్ ఇద్దరి మధ్యనే

  తాజా సీజన్‌లో విజేత ఎవరో మరికొన్ని రోజుల్లోనే తేలనుంది. ఇందుకోసం ఫినాలే వీక్ ఓటింగ్ ప్రక్రియను ఆదివారం రాత్రి నుంచే మొదలు పెట్టారు. అయితే, గతంలో మాదిరిగా కాకుండా ఓటింగ్ లైన్స్‌ను ఈ బుధవారం రాత్రి 11:59 గంటల వరకు మాత్రమే కొనసాగించబోతున్నారు. ఇక, ఇందులో టైటిల్ పోరు అఖిల్ సార్థక్, బిందు మాధవి మధ్యలోనే జరుగుతోంది.

  రోజుకు ఒకరు.. తరచూ మారి

  రోజుకు ఒకరు.. తరచూ మారి

  బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ విన్నర్‌ను నిర్ణయించే ఓటింగ్ ప్రక్రియ ఎన్నో మలుపులతో సాగుతున్నట్లు తెలుస్తోంది. మొదటి రోజు ఆదివారం రాత్రి అఖిల్ సార్థక్ టాప్‌లో ఉండగా.. సోమవారం మొత్తం బిందు మాధవి మొదటి స్థానంలో కొనసాగినట్లు తెలిసింది. అయితే, మంగళవారంలో మాత్రం మరోసారి అఖిల్ హవాను చూపించి టాప్‌కు చేరుకున్నాడని అంటున్నారు.

  మసాజ్ వీడియో షేర్ చేసిన హీరోయిన్: ఒంటిపై నూలుపోగు లేకుండా ఘోరంగా!

  ఇద్దరి మధ్య తేడా ఎంతంటే

  ఇద్దరి మధ్య తేడా ఎంతంటే

  తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. మంగళవారం రాత్రి వరకూ టాప్‌లో ఉన్న అఖిల్ సార్థక్.. దాన్నే కంటిన్యూ చేస్తున్నాడని తెలుస్తోంది. దీంతో బిందు మాధవి ప్రస్తుతానికి రెండో స్థానానికే పరిమితమైందట. అయితే, ఈ ఇద్దరి మధ్య ఓట్లలో స్వల్ప తేడానే ఉన్నట్లు తెలుస్తోంది. అంటే బుధవారం ఓటింగ్ ముగిసే సరికి ఎవరు టాప్‌లో ఉంటారో చెప్పలేని పరిస్థితి నెలకొంది.

  ఆ కంటెస్టెంట్ల స్థానాలు ఇవే

  ఆ కంటెస్టెంట్ల స్థానాలు ఇవే

  ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో ఫినాలే వీక్‌కు ఏడుగురు కంటెస్టెంట్లు చేరుకున్నారు. ఇందులో బిందు మాధవి, అఖిల్ సార్థక్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇక, యాంకర్ శివ మూడో స్థానంలో, ఆరియానా గ్లోరీ నాలుగో స్థానంలో, బాబా భాస్కర్ ఐదో స్థానంలో, మిత్రా శర్మ ఆరో స్థానంలో, అనిల్ రాథోడ్‌లు ఏడో స్థానంలో కొనసాగుతున్నారని తెలుస్తోంది.

  English summary
  Bigg Boss Telugu Non Stop OTT First Season Running Successfully. Akhil Sarthak Crosses Bindu Madhavi in Voting in Finale Week.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X