Don't Miss!
- Lifestyle
చాలా మంది అమ్మాయిలను ఇబ్బంది పెట్టే PCOD మరియు PCOS సమస్యకు ఈ ఆహారాలు పరిష్కారం చూపుతాయి.
- News
వైసీపీకి మద్దతిచ్చిన బీఆర్ఎస్ - పార్లమెంటులో ఆసక్తికర పరిణామం-ఇదే తొలిసారి ?
- Finance
adani: పెట్టుబడులు తరలిపోతున్న వేళ.. అదానీ కంపెనీకి శుభవార్త !!
- Sports
INDvsNZ : పృథ్వీ షాకు నో ఛాన్స్!.. పాండ్యాకు మూడో టీ20లో అగ్ని పరీక్ష!
- Technology
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్లు!
- Automobiles
సీరియల్స్ చేస్తూ ఖరీదైన బెంజ్ కారు కొనేసి రూపాలి గంగూలీ.. ధర ఎంతో తెలుసా?
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
Bindu Madhavi: ఆ మాటతో నన్ను చంపేశారు సార్ అంటూ.. అతనికి అడపులి ఫిదా!
బిగ్ బాస్ నాన్ స్టాప్ షో టైటిల్ విన్నర్ గా నిలిచిన బిందు మాధవి జనాల్లో కూడా మంచి క్రేజ్ అందుకుంది అనే చెప్పాలి. అసలు ఈ షో సక్సెస్ అవుతుందా కాదా అనే అనుమానాలు మొదట చాలానే వచ్చాయి. కానీ బిందుమాధవి తెగింపు చాలామందికి కనెక్ట్ అయ్యేలా చేసింది. ఆమె కనిపించిన విధానం బిగ్ బాస్ షో లో చాలా హైలెట్ గా నిలిచింది. ఇక సోషల్ మీడియాలో చాలా బిజీగా ఉన్న బిందుమాధవి ఇటీవల ఒక వ్యక్తి చేసిన పనికి ఫిదా అయ్యింది. అతని ప్రేమకు స్పందించింది.. ఆ వివరాల్లోకి వెళితే..
Recommended Video


అత్యధిక ఓట్లు
బిగ్ బాస్ నాన్ స్టాప్ షో ఊహించినట్లుగానే చివరి వరకు ఎంతో ఆసక్తికరంగా కొనసాగింది. ఈసారి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ తో కొంతమంది జనాల్లో మంచి గుర్తింపును అందుకున్నారు. ముఖ్యంగా బిందుమాధవి అయితే ఈ సీజన్లో అత్యధిక ఓట్లు అందుకున్న కంటెస్టెంట్ గా కూడా సరికొత్త రికార్డ్ను క్రియేట్ చేసింది. పోటీగా అఖిల్ వచ్చినప్పటికీ కూడా చాలా మొండి పట్టుదలతో టైటిల్ విన్నర్ గా నిలిచింది.

జనాల్లో ప్రేమ
బిగ్ బాస్ లో ఎవరు ఎలా ఉన్నా కూడా బిందుమాధవి మాత్రం ఒకే తరహా సిద్ధాంతంతో ముందుకు సాగింది అనే చెప్పాలి. ఆమె కొన్ని టాస్క్ లలో దారుణంగా ఓడిపోయినప్పటికీ కూడా ప్రేక్షకుల్లో ఏమాత్రం ప్రేమ తగ్గలేదు. ఇంకా ఆమెకు చాలా బాగా కనెక్ట్ అయ్యారు అనే చెప్పాలి. ప్రతి టాస్క్ లో కూడా తన గొంతును వినిపించిన ఆమె శత్రువుల కు అదిరిపోయే కౌంటర్ కూడా ఇచ్చింది.

ఫస్ట్ మహిళగా..
బిందు మాధవి గెలిచిన కారణంగా బిగ్ బాస్ పైన ఒక అపోహ కూడా తొలగిపోయింది అని చెప్పాలి. ఎందుకంటే గత ఐదు సీజన్స్ లో ప్రతి ఫైనల్ ఎపిసోడ్ లో కూడా అమ్మాయిలు గెలవకుండా అబ్బాయిల గెలుస్తున్నారు అనే కామెంట్స్ అయితే చాలానే వచ్చాయి. గతంలో గీతా మాధురి యాంకర్ శ్రీముఖి ఇద్దరు కూడా ఫైనల్ ఎపిసోడ్ వరకు వచ్చినప్పటికీ.. ప్రత్యర్థుల చేతిలో ఓడిపోయారు. కానీ బిందుమాధవి గెలిచి తెలుగు బిగ్ బాస్ తెలుగు టైటిల్ ను సొంతం చేసుకున్న మొదటి మహిళగా నిలిచింది.

ప్రత్యేకంగా అభినందనలు
బిందుమాధవి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమె కోసం భారీ స్థాయిలో ఫ్యాన్స్ ఇంటికి చేరుకొని మరీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఇక సోషల్ మీడియాలో కూడా చాలా మంది కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నట్లు ఆమె గ్రహించింది. ఇటీవల ఒక వ్యక్తి చేసిన మంచిపని పై కూడా బిందు మాధవి స్పందించింది.

బిందుమాధవి కోసం..
బిందు మాధవి టైటిల్ విన్నర్ గా నిలిచినందుకు సింబాలిక్ గా ఒక వ్యక్తి తన ప్రేమను చాటుకోవడానికి రక్తదానం చేశాడు. అయితే ఇది కేవలం ఒక అభిమాన మాత్రమే కాదు అంటూ ప్రాణం ఇచ్చేంత ప్రేమ ఉంది అని.. బిందుమాధవి కోసం బిలియన్ హాట్స్ అని.. తన సోషల్ మీడియాలో ఫోటోలు కూడా పోస్ట్ చేశాడు.

ఆ మాటతో నన్ను చంపేసారు
ఇక ఆ ఫోటోను చూసిన మాధవి చాలా స్వీట్ గా స్పందించింది. ప్రాణం ఇచ్చేంత ప్రేమ.. ఆ మాటతో నన్ను చంపేసారు సార్.. అక్బర్ నాకు చాలా సంతోషంగా ఉంది.. నా గెలుపు ఇలా ఒక మంచి పని చేయడానికి ఉపయోగించినందుకు నిజంగా హ్యాపీగా ఉంది అని బిందుమాధవి వివరణ ఇచ్చింది. దీంతో ఆ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.