twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Nonstop : ఊహించినట్టుగానే అజయ్ ఔట్.. ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ!

    |

    తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ ఒటీటీ వర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే 8 వారాలు విజయవంతంగా పూర్తి అయ్యాయి. ఆదివారం నాడు నాగార్జున హౌస్ లోకి ఎంట్రీ ఇస్తూనే హౌస్ లో ఒకరిని ఎలిమినేట్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక ఎపిసోడ్ ఆసాంతం ఆసక్తికరంగా సాగిన క్రమంలో ఎపిసోడ్ చివరిలో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనే విషయం మీద నాగార్జున క్లారిటీ చేశారు. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనే విషయం క్లారిటీ ఇచ్చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

     మొత్తం ఏడుగురు సభ్యులు

    మొత్తం ఏడుగురు సభ్యులు


    బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో కొత్తగా ఒక వర్షన్ తీసుకువచ్చారు తెలుగు బిగ్ బాస్ నిర్వాహకులు. అందులో భాగంగానే మొత్తం 17 మందిని హౌస్ లోపలికి తీసుకు వెళ్లారు. అందులో కొంత మంది కొత్త కంటెస్టెంట్ లు మరి కొంతమంది పాత కంటెస్టెంట్ లు కూడా ఉన్నారు. ఇక ఏడు వారాలు పూర్తి కాగా మొత్తం ఏడుగురు సభ్యులు ఇంటి నుంచి ఎలిమినేట్ అయి బయటకు వెళ్లారు.

    నామినేషన్స్

    నామినేషన్స్


    మొదటి వారం ముమైత్ ఖాన్, రెండవ వారం శ్రీ రాపాక, మూడవ వారం ఆర్ జై చైతూ, 4వ వారం సరయు, 5వ వారం తేజస్వి ఆరో వారం మళ్ళీ ముమైత్ ఖాన్, స్రవంతి, ఏడవ వారం మహేష్ విట్టా ఎలిమినేట్ అయ్యారు. ఇక ఎనిమిదో వారం మొత్తం ఆరుగురు హౌస్ సభ్యులు నామినేషన్స్ లోకి వెళ్లాల్సింది.

    చాలా స్ట్రాంగ్ గా

    చాలా స్ట్రాంగ్ గా


    కానీ బాబా భాస్కర్ ఎంట్రీ ఇస్తూ ఒక స్పెషల్ పవర్ తో బిందుని నామినేషన్స్ నుంచి తప్పించడంతో అఖిల్, అషు రెడ్డి, అజయ్ కతుర్వార్, అనిల్ రాథోడ్, హమీదా నామినేషన్స్ లోకి వచ్చారు. ఓట్ల లెక్కల వ్యవహారానికి వస్తే ముందు నుంచి బిందుమాధవి, అఖిల్, శివ హౌస్ లో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. నామినేషన్స్ లో బిందుమాధవి, శివ లేరు కాబట్టి వారి ఓట్లన్నీ ఎక్కువగా వారి ఫ్రెండ్ అనిల్ కు పడ్డాయి. అఖిల్ ఓట్లు అఖిల్ కి ఎలాగో పడ్డాయి.

     అనుకున్నట్టుగానే

    అనుకున్నట్టుగానే


    హమీద కూడా మంచి ఓటింగ్ శాతం తెచ్చుకుంది. అయితే వీరందరిలో కూడా అషు రెడ్డి, అజయ్ కతుర్వార్ ఇద్దరికీ ఓటింగ్ శాతం తగ్గిందని ప్రచారం జరుగుతూ వచ్చింది. అందులో భాగంగానే ముందు మిగతా ముగ్గురు సేవ్ అయ్యారు. చివరికి అషు రెడ్డి అఖిల్ ఎలిమినేషన్ జోన్ లోకి ఎంట్రీ ఇచ్చారు. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాగార్జున అజయ్ ఎలిమినేట్ అవుతున్నట్లు ప్రకటించారు. దీంతో మిగతా అందరినీ చూసి ఎమోషనల్ అయిన అజయ్ ఎట్టకేలకు బయటకు అయితే వచ్చాడు . ఈ ఎలిమినేషన్ చూసి అఖిల్ షాకయ్యాడు.

     ఆడియన్స్ ఏమంటున్నారు అంటే?

    ఆడియన్స్ ఏమంటున్నారు అంటే?


    ఇక ఈ ఎలిమినేషన్ గురించి నెటిజన్లు పలురకాలుగా చర్చించుకుంటున్నారు. అయితే ఎక్కువమంది గత వారాలలో జరిగిన ఎలిమినేషన్ కంటే ఇది ఫెయిర్ ఎలిమినేషన్ అని స్పందిస్తున్నారు. కొంత మంది ఫెయిర్ ఎలిమినేషన్ అంటూనే అజయ్ కంటే ముందుగా అషు రెడ్డిని పంపించి ఉంటే బాగుండేదని కామెంట్లు చేస్తున్నారు. అజయ్ కి ఓటు బ్యాంకు లేకపోయినా ఇప్పటివరకు నిలబడుతూ వచ్చాడు అంటే గొప్ప విషయమే అని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు మొత్తంమీద ఈవారం ఎలిమినేషన్ అనుకున్న విధంగానే జరిగింది.

    English summary
    Ajay kathurvar eliminated from the Bigg Boss Non Stop house in 8th week.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X