For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Winner నటి సావిత్రిలాగా ఆమె.. బిగ్ బాస్ విన్నర్ ఎవరో చెప్పిన అమ్మ రాజశేఖర్?

  |

  ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 హౌజ్ లో గత మూడు రోజులుగా టికెట్ టు ఫినాలే టాస్క్ నడుస్తోంది. అంటే ఈ పోటీలో గెలిచిన ఇంటి సభ్యులు ఒకరు నేరుగా ఫినాలేకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఫినాలే టికెట్ ను అందుకోవడం కోసం ఇంటి సభ్యులు గట్టిగా ట్రై చేస్తున్నారు. అయితే టాస్క్ లో నిత్యం ఏకాభిప్రాయమనే చర్చ రచ్చ చేస్తోంది. అలాగే ఈ టాస్క్ లో ఊహించని సన్నివేశాలు దర్శనమిస్తున్నాయి. ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు 6 కంటెస్టెంట్ల ఆట తీరుపై పై బీబీ కేఫ్ ద్వారా రివ్యూలు ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ బీబీ కేఫ్ కు బిగ్ బాస్ తెలుగు 4 సీజన్ కంటెస్టెంట్ అమ్మ రాజశేఖర్ హాజరయ్యాడు.

  డైరెక్టర్, కొరియోగ్రాఫర్ హాజరు..

  డైరెక్టర్, కొరియోగ్రాఫర్ హాజరు..

  బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ కంటెస్టెంట్ల ఆట తీరుపై బీబీ కేఫ్ ద్వారా అభిప్రాయాలను బయటపెడుతున్న విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూకి మాజీ సీజన్ కంటెస్టెంట్లతోపాటు విన్నర్లు, సెలబ్రిటీలు, రివ్యూవర్లు పాల్గొంటున్నారు. వీళ్లందరినీ బ్యూటిఫుల్ యాంకర్ అరియానా గ్లోరి హోస్ట్ చేయగా బిగ్ బాస్ తెలుగు 6 ఎలిమినేట్ సభ్యులను యాంకర్ శివ హోస్ట్ చేస్తున్నాడు. అయితే తాజాగా బీబీ కేఫ్ కు బిగ్ బాస్ తెలుగు 4 సీజన్, డైరెక్టర్, కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ హాజరై పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు.

  ఆయనతో పెట్టుకుంటే రణం..

  ఆయనతో పెట్టుకుంటే రణం..


  ఆయన మాటల్లో ఉంటుంది శరణం.. ఆయనతో పెట్టుకుంటే రణం అంటూ అమ్మ రాజశేఖర్ ను ఇన్వైట్ చేసింది అరియానా గ్లోరి. ఇద్దరు కలిసి మాస్ డ్యాన్స్ చేశారు. ఈ సీజన్ లో ఎంటర్టైన్ మెంట్ ఎలా ఉంది అని అరియానా అడిగితే.. అందరూ బాగా ఆడుతున్నారు. కానీ ఇది చాలదు. వంద శాతం ఇవ్వాలి అని అమ్మ రాజశేఖర్ అన్నాడు. దీంతో ఎవరు వంద శాతం ఇవ్వట్లేదని అరియానా అడిగింది.

   గేమ్ కూడా ఆడాలి కదా..

  గేమ్ కూడా ఆడాలి కదా..

  అరియానా అడిగిన ప్రశ్నకు కీర్తి వంద శాతం ఆడట్లేదు, చాలా డల్ ఆడుతున్నారు. ఫైమాకు చాలా టాలెంట్ ఉంది, కామేడీ ఉంది. చేయాలి కదా అని అమ్మ రాజశేఖర్ అన్నారు. వాళ్లిద్దరి గురించి కాకుండా ఇంకా ఎవరి గేమ్ గురించి మాట్లాడలనుకుంటున్నారని అరియానా అడగ్గా.. శ్రీసత్య అని ఒక అమ్మాయి ఉంది. బాగా డ్రెస్ వేసుకుంటుంది. బాగా మేకప్ వేసుకుంటుంది. బిగ్ బాస్ లోకి వచ్చింది దేనికి.. గేమ్ ఆడాలి కదా అని అమ్మ రాజశేఖర్ తెలిపారు.

  ఎమోషనల్ డ్రామా చేస్తున్నారా..

  ఎమోషనల్ డ్రామా చేస్తున్నారా..


  మీ అంతా కాకపోయినా.. మీలాంటి ప్లేయర్ ఎవరైనా అనిపిస్తున్నారా ఉన్నవాళ్లలో అని అరియానా గ్లోరి అడగ్గా.. రేవంత్ కొంచెం ఓకే.. అప్పుడప్పుడు అగ్రెసివ్ అవుతాడు. ఆర్గ్యుమెంట్స్ చేస్తాడు. ఇప్పుడు కొంచెం కూల్ అయ్యాడని అమ్మ రాజశేఖర్ పేర్కొన్నాడు. ఉన్న టాప్ 8లో హౌజ్ లో ఎవరైనా ఎమోషనల్ డ్రామా చేస్తున్నారన్న దానికి.. పాత సినిమాల్లో కేఆర్ విజయ, సావిత్రి ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారు కదా. అలా కీర్తి ఎప్పుడూ చూసిన ఏడుస్తూనే ఉంటుందని అమ్మ రాజశేఖర్ అంటే.. బాధ అమ్మా పెయిన్ అని అరియానా అంది. దానికి పెయినా అది.. ఎక్కువ ఏడ్చినా కూడా ఇరిటేషన్ వస్తుందని అమ్మ రాజశేఖర్ అన్నాడు.

  అరియానాకు అమ్మ రాజేశేఖర్ పంచ్..

  అరియానాకు అమ్మ రాజేశేఖర్ పంచ్..

  టికెట్ టు ఫినాలే ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారని అరియానా అడిగితే.. ఆలోచిస్తూ.. కచ్చితంగా ఎవరో ఒకరు గెలుస్తారని కామెడీ చేశాడు అమ్మ రాజశేఖర్. నా షోకి వచ్చి నన్నే రోస్టింగ్ చేస్తున్నారా అని అరియానా అంది. అంతే కదా అని లాస్ట్ లో కప్ (బిగ్ బాస్ విన్నర్) ఎవరికి ఇస్తారో చెప్పనా అని మళ్లీ ఎవరో ఒకరికే ఇస్తారని మళ్లీ అరియానాకు పంచ్ వేశాడు అమ్మ రాజశేఖర్. పైకి ఫ్రెండ్ అని చెప్పి గేమ్ లో తొక్కేయాలని చూసే వాళ్లు ఎవరైనా ఉన్నారా అని అడిగితే.. అందరూ ఉన్నారు అని ఆన్సర్ ఇచ్చాడు అమ్మ రాజశేఖర్.

  నామినేషన్లలో ఆరుగురు..


  బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లో ప్రస్తుతం మిగిలిన 8 మందికి 13వవారం నామినేషన్స్ ప్రక్రియ మరింత వాడీ వేడిగా సాగింది. ఈ వారం నామినేషన్లలో కెప్టెన్ అయినా కారణంగా ఇనయా సుల్తానా, ఎవరు నామినేట్ చేయనందున శ్రీహాన్ సేఫ్ అయ్యాడు. దీంతో మిగతా ఇంటి సభ్యులు అయినా రోహిత్, రేవంత్, ఫైమా, ఆదిరెడ్డి, శ్రీ సత్య, కీర్తి భట్ ఆరుగురు నామినేట్ అయ్యారు. వీరంత ప్రస్తుతం నామినేషన్ లో ఉన్నారు.

  English summary
  Bigg Boss Telugu 4 Contestants Director And Choreographer Amma Rajasekhar About Bigg Boss Telugu 6 Winner In BB Cafe With Ariyana Glory.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X