twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6: బింబిసార స్టైల్ లో ఎంట్రీ ఇచ్చిన చలాకీ చంటి.. ఈసారి టైటిల్ నాదే అంటూ..

    |

    బిగ్ బాస్ లో ఈసారి కొంతమంది కమెడియన్సు కూడా హైలెట్ కాబోతున్నట్లు ముందు నుంచి అనేక రకాల వార్తలొచ్చాయి. ఇక జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపును అందుకున్న చలాకీ చంటి ఇప్పుడు బిగ్ బాస్ 6వ సీజన్ లో 4వ కంటెస్టెంట్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు. ఇక అతను ఎక్కడ నుంచి వచ్చాడు అతని కెరీర్ టర్నింగ్ పాయింట్ ఏమిటి? ఇక నటుడిగా గుర్తింపు కోసం ఎన్ని కష్టాలు దాటి వచ్చాడు అనే వివరాల్లోకి వెళ్తే..

    బింబిసార స్టైల్ లో ఎంట్రీ

    బింబిసార స్టైల్ లో ఎంట్రీ


    చలకి చంటి కి సంబంధించిన ప్రత్యేకమైన వీడియో కూడా ఎంతగానో కట్టుకుంది. ఇక అతను బింబిసార స్టైల్ లోనే ఎంట్రీ ఇస్తూ బిగ్ బాస్ లో కూడా చంటిసారగా అడుగు పెట్టారు. ఈసారి టైటిల్ నాదే అని ధైర్యంగా చెప్పాడు. ఇక తర్వాత నాగార్జునను చూసిన సంతోషంలో ఇది నిజమా కల అంటూ ఆశ్చర్యపోయాడు. అలాగే తన ఫ్యామిలీ గురించి తన భార్య గురించి కూడా చంటి సరదాగా తెలియజేశాడు. అలాగే లోపల మాత్రం అందరిని ఎంటర్టైన్ చేస్తాను అని చంటి వివరణ ఇచ్చాడు.

    జబర్దస్త్ తోనే..

    జబర్దస్త్ తోనే..

    చలాకి చంటి గురించి దాదాపు అందరికీ తెలిసిందే. అతను ఈటీవీ జబర్దస్త్ ద్వారా మొదట మంచి గుర్తింపు అందుకున్నాడు. అంతకుముందే సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలతో కమిడియన్ గా మంచి క్రేజ్ అందుకున్నప్పటికీ అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ ఎప్పుడైతే జబర్దస్త్ లో కనిపించాడో అప్పుడే అతని కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. జబర్దస్త్ ద్వారానే అతను ఆర్థికంగా కూడా నిలదొక్కుకున్నాడు.

    అసలు పేరు

    అసలు పేరు

    ఇక జబర్దస్త్ చంటి వివరాల్లోకి వెళితే అతని అసలు పేరు వినయ్ మోహన్. సినిమా ఇండస్ట్రీలో ఉన్నన్ని రోజులు కూడా అతని ఎక్కువగా చంటి అనే పిలిచేవారు. ఇక ఎప్పుడైతే జబర్దస్త్ లోకి వచ్చాడో అప్పుడు టీమ్ లీడర్గా గా చలాకి చంటి అనే పేరుతో పాపులర్ అయ్యాడు. అతను చేసిన స్కిట్స్ అన్నీ కూడా బాగా వైరల్ కావడంతో సినిమా ఇండస్ట్రీలో కూడా ఆ తర్వాత మంచి అవకాశాలు వచ్చాయి.

    ఆర్థిక సమస్యల వలన

    ఆర్థిక సమస్యల వలన


    చలాకి చంటి 1986 జూన్ 29న హైదరాబాదులో జన్మించాడు. అతని విద్యాబ్యాసం హైదరాబాదులోనే కొనసాగింది. ఇక డిగ్రీ చదువుతూ ఉండగా పలు ఆర్థిక సమస్యలతో అతను గ్రాడ్యుయేషన్ ను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఇక తర్వాత కొన్ని ప్రైవేట్ కంపెనీలలో కూడా చిన్న తరహా జాబ్స్ కూడా చేసుకుంటూ వచ్చాడు. మొదట టాటా ఇండికాంలో అతను కస్టమర్ ఎగ్జిక్యూటివ్ గా కూడా వర్క్ చేశాడు.

     రేడియో మిర్చిలో

    రేడియో మిర్చిలో

    చలాకి చంటి ఒకానొక సమయంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇక తర్వాత రేడియో మిర్చి లో మొదటి ఆడిషన్ లో పాల్గొనగానే అతనికి రేడియో జాకీగా మంచి గుర్తింపు దక్కింది. అందులోనే 'చంటి బ్యాంక్' అనే ఒక ప్రోగ్రాం చేసిన అతను జనాలందరికీ కూడా చంటి అనే పేరుతోనే ఎక్కువగా దగ్గరయ్యాడు.

    మిమిక్రి ఆర్టిస్ట్

    మిమిక్రి ఆర్టిస్ట్

    మిమిక్రీ ఆర్టిస్టుగా కూడా చంటికి మంచి గుర్తింపు లభించింది. ఇక అతను ట్యాంక్ బండ్ టూరిజం బోట్స్ లో కూడా మిమిక్రీ ఆర్టిస్ట్ గా కూడా కొన్ని రోజులపాటు జీవితాన్ని కొనసాగించాడు. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ వచ్చాడు. ఇక 2009లో అతను మొదటగా జల్లు అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యాడు.

     90 సినిమాల అనుభవం

    90 సినిమాల అనుభవం

    ఇక అనంతరం నాని నటించిన భీమిలి కబడ్డీ జట్టు సినిమాలో కమెడియన్ గా అతనికి మంచి గుర్తింపు లభించింది. దాదాపు తెలుగు చిత్ర పరిశ్రమలో 90 సినిమాలో నటించాడు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ 6వ సీజన్ లోకి ఎంట్రీ ఇచ్చిన చంటి ఎలాగైనా టైటిల్ విన్నర్ గా నిలవాలని అనుకుంటున్నాడు. ఇక అతని దూకుడుకు జనాల నుంచి ఎలాంటి మద్దతు అందుతుందో చూడాలి.

    English summary
    Bigg boss telugu 6 chalaki chanti entry as a fifth contestant
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X