Don't Miss!
- News
పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డిపై ప్రత్యర్థి ఖరారు?
- Finance
mahindra erupee: పండ్ల దుకాణంలో మహీంద్రా.. పేమెంట్ ఎలా చేశారో తెలుసా..?
- Lifestyle
Chanakya Niti: ఈ తప్పుల వల్ల లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురవుతారు, ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి
- Sports
INDvsNZ : గాయంతో టీ20 సిరీస్ యువ బ్యాటర్ దూరం?.. రిప్లేస్ చేసే సత్తా వీళ్లకే..!
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Bigg Boss Finale: బీబీ జోడీ జడ్జ్ గా అలనాటి హీరోయిన్ రాధ.. ఆమెతోపాటు ఆ ఇద్దరు!
అశేష ప్రేక్షాకదరణతో దూసుకుపోతున్న రియాలిటీ షోలలో ప్రధానంగా చెప్పుకోదగింది బిగ్ బాస్. ఎన్నో అనుమాలు, అంచనాల నడుమ విడుదలైన ఈ రియాలిటీ షో తెలుగులోనూ ప్రారంభమై వరుస సీజన్లతో దూసుకుపోతోంది. సెలబ్రిటీ షోగా పేరొందిన ఈ రియాలిటీ షోలో అనేక మంది సెలబ్రిటీలు పాల్గొని సందడి చేస్తుంటారు. ఈ రియాలిటీ షో ఆరో సీజన్ టైటిల్ విన్నర్ ను నేడు ప్రకటించడంతో పూర్తి కానుంది. అయితే ఇటీవల కాలంలో డ్యాన్స్ అండ్ కామెడీ షోస్ ఎక్కువైపోయాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తోనే బీబీ జోడి అనే డ్యాన్స్ షోని తెరపైకి తీసుకొచ్చారు. ఈ బీబీ జోడికి న్యాయ నిర్ణేతలుగా వచ్చే వారు ఎవరనే విషయంలోకి వెళితే..

నేడు పూర్తి కానున్న ఆరో సీజన్..
విపరీతమైన ప్రేక్షాకదరణతో దూసుకుపోతున్న రియాలిటీ షోలలో ప్రముఖంగా చెప్పుకోదగింది బిగ్ బాస్. ఎన్నో అనుమానాలు, అంచనాల నడుమ విడుదలైన ఈ రియాలిటీ షో తెలుగులో 2017లో ప్రారంభమైంది. తొలుత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసి సక్సెస్ సాధించడంతో వరుసపెట్టి సీజన్లతో ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికి ఐదు రెగ్యూలర్ (టీవీ), ఒక ఓటీటీ (నాన్ స్టాప్) వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుంది. ఇప్పుడు నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ ఆరో సీజన్ కూడా నేడు పూర్తి కానుంది.

స్టెప్స్ లేకుండా నడవడం..
బిగ్ బాస్ తెలుగు 6 గ్రాండ్ ఫినాలేలో ఘనంగా జరుగుతోంది. ఈ ఫినాలేకు ఒక్కొక్క సెలబ్రిటీ వచ్చి సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగానే అలనాటి స్టార్ హీరోయిన్ రాధ ఎంట్రీ ఇచ్చింది. వచ్చిన రాధతో నాగార్జున సరదాగా మాట్లాడారు. రావడం కూడా స్టెప్స్ తోనే వస్తున్నారా అని నాగార్జున అడిగితే.. స్టెప్స్ లేకుండా నడవడం నా వల్ల కాదు. నాలుగో తరగతి నుంచి డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశాను.

న్యాయ నిర్ణేతగా రాధ..
అప్పుడు నేను చాలా సన్నగా ఉండేదాన్ని. అంటే.. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను అని రాధ చెప్పారు. అనంతరం స్టేజీపై చిరంజీవి పాటకు బాలాదిత్య, రాధ కలిసి డ్యాన్స్ చేసి అదరగొట్టారు. చిరంజీవి హావాభావాలను బాలాదిత్య దించేశాడు. దీని తర్వాత బీబీ జోడి త్వరలో రానుందని ఆ షోకి న్యాయ నిర్ణేతగా రాధ ఉండనుందని నాగార్జున తెలిపారు.

డ్యాన్స్ గురించి మాట్లాడటం..
తను
హీరోయిన్
గా
ఉన్నప్పుడు
హీరోలకంటే
కొంచెం
ఎక్కువగా
చేయాలనుకున్నేదాన్ని
అని
రాధ
తెలిపారు.
అలాగే
మనకు
ఉన్న
ప్యాషన్
ను
కొద్దిగా
లెవలప్
చేస్తే
మనం
ఎక్కడో
ఉంటాం.
నేను
ఇప్పుడు
మళ్లీ
సినిమాల్లో
నటించొచ్చు.
కానీ,
బీబీ
జోడి
డ్యాన్స్
షోకి
నన్ను
జడ్జ్
గా
పిలవడం
నాకు
చాలా
సంతోషంగా
ఉంది.
అక్కడ
కూర్చొని
డ్యాన్స్
గురించి
మాట్లాడటం,
చర్చించడం
నాకు
ఎంతో
ఇష్టమని
డ్యాన్స్
పట్ల
తనకున్న
ఇష్టాన్ని
తెలియజేశారు
రాధ.

బీబీ జోడీలో డ్యాన్స్..
ఈ బీబీ జోడీ ప్రోమోను బిగ్ బాస్ తెలుగు 6 ఫినాలే వేదికగా విడుదల చేశారు. అందులో న్యాయ నిర్ణేతలుగా రాధతోపాటు మరో బ్యూటిఫుల్ హీరోయిన్ సదా, కొరియోగ్రాఫర్ తరుణ్ మాస్టార్ వ్యవహరించనున్నారు. ఇక డ్యాన్సర్స్ గా బిగ్ బాస్ షోలో పార్టిస్ పేట్ చేసిన కంటెస్టెంట్లు ఉన్నారు. వారందరిచేత బీబీ జోడీలో డ్యాన్స్ చేయించనున్నారు.

యాంకర్ గా బుల్లితెర రాములమ్మ..
బీబీ జోడీ డ్యాన్స్ షోలో జోడీలుగా అర్జున్ కల్యాణ్-వాసంతి కృష్ణన్, అఖిల్ సార్థక్-తేజస్విని, ఆర్జే సూర్య-ఫైమా, రవికృష్ణ-భాను, రోల్ రైడా-స్రవంతి, ఆర్జే చేతూ-ఆర్జే కాజల్, అవినాష్-అరియానా, మెహబూబ్-అషు రెడ్డి ఉన్నారు. వీరందరికి యాంకర్ గా బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్ రన్నరప్, బుల్లితెర రాములమ్మ శ్రీముఖి వ్యవహరించనుంది. అలాగే ఈ బీబీ జోడి లాంఛ్ కి నాగార్జున కూడా హాజరయ్యారు.