Don't Miss!
- Sports
INDvsAUS : భారత్తో టెస్టు సిరీస్ ముందు.. బెంగళూరులో ఆస్ట్రేలియా జట్టు ప్రాక్టీస్ సెషన్స్
- News
హైదరాబాద్లో మరో దిగ్గజ సంస్థ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్: 1800 మందికి ఉపాధి
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Lifestyle
ఈ రాశుల వారు భగ్నప్రేమికులు, అలా పడిపోతారు ఇలా విడిపోతారు
- Finance
Adani Enterprises FPO: అనుకున్నది సాధించిన అదానీ.. మూడో రోజు మ్యాజిక్.. ఏమైందంటే..
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
Bigg Boss 6 శ్రీహన్ కు గోల్డెన్ ఛాన్స్.. సిరితో కలిసి ఓటీటీ జాక్ పాట్.. అలా ప్లాన్ చేసిన శేఖర్ మాస్టర్!
బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ లో టైటిల్ విన్నర్ గా నిలవాల్సిన శ్రీహన్ రన్నరప్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఒక విధంగా అతను గెలవలేకపోయినప్పటికి కూడా ఆర్థికంగా చాలానే లాభపడ్డాడు. ఇక శ్రీహన్ కి ఇప్పుడు బయట మంచి ఆఫర్స్ కూడా వస్తున్నాయి. ఇక ఇప్పుడు అతని తన ప్రేయసి సిరితో కూడా ఒక ఓటీటీ ప్రాజెక్ట్ చేసేందుకు రెడీ అయ్యాడు. అందుకోసం కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ముందడుగు వేయడం విశేషం. ఆ వివరాల్లోకి వెళితే..

బిగ్ బాస్ లో అదే తరహాలో
మొదట వెబ్ సీరీస్ లతో మంచి గుర్తింపును అందుకున్న శ్రీహన్ అనంతరం సిరి హనుమంతుతో కూడా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేశాడు. సోషల్ మీడియాలో హిట్ పేయిర్ గా గుర్తింపును అందుకున్న వీరు బిగ్ బాస్ లో అదే తరహాలో క్రేజ్ అందింది. 5వ సీజన్ లో పాల్గొన్న సిరి టాప్ 5లో నిలువగా.. శ్రీహన్ 6వ సీజన్ లో రన్నరప్ గా నిలిచి మంచి క్రేజ్ అందుకున్నాడు.

బిగ్ బాస్ ద్వారా..
బిగ్ బాస్ ద్వారా వచ్చిన క్రేజ్ ను ఈ ఇద్దరు మరో లెవెల్ కు తీసుకి వెళ్లాలని అనుకుంటున్నారు. సిరి హనుమంతుకు బిగ్ బాస్ తరువాత సినిమా ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు అయితే రాలేదు. ఎప్పటిలాగే ఆమె వెబ్ సీరీస్ లు చేసినా వాటికి సరైన గుర్తింపు దక్కలేదు. ఇక బిగ్ బాస్ రన్నరప్ గా నిలిచినటువంటి శ్రీహన్ కు మాత్రం ఇప్పుడు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇక అతను ముందుగానే తన కెరీర్ ను సెట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు.

వెబ్ సీరీస్ ప్లాన్
అయితే బిగ్ బాస్ 6వ సీజన్ లో శ్రీహన్ ను చూసేందుకు వచ్చిన సిరికి కూడా మంచి క్రేజ్ వచ్చింది. వీరు కలుసుకున్న ఎపిసోడ్ బాగానే క్లిక్కయ్యింది. అందుకే వీరితో వెబ్ సీరీస్ ప్లాన్ చేయాలి అని చాలామంది చాలా రకాలుగా ఆఫర్స్ ఇచ్చారట. కానీ తొందర పడకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను చేయాలని ఫిక్స్ అయ్యారు. రీసెంట్ గా ఒక ఓటీటీ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

నిర్మాతగా శేఖర్ మాస్టర్
సిరి హనుమంత్ - శ్రీహన్ జంటకు ఇంటర్నెట్ వరల్డ్ లో మంచి క్రేజ్ ఉంది. బిగ్ బాస్ తరువాత వారి రేంజ్ మరింత పెరిగింది. అందుకే శేఖర్ మాస్టర్ ఆ క్రేజ్ ను ఉపయోగించుకొని సరికొత్త వెబ్ సీరీస్ ను ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక అధికారికంగా సోషల్ మీడియా ద్వారా శేఖర్ మాస్టర్ ఒక ఫొటోతో ఆ క్లారిటీ ఇచ్చేశారు. త్వరలోనే వెబ్ సీరీస్ ను ఎనౌన్స్ చేయనున్నట్లు చెప్పారు.

శేఖర్ మాస్టర్ పెట్టుబడి
పూర్తిస్థాయిలో కొత్త తరహా టెక్నీకల్ టీమ్ తో కలిసి శేఖర్ మాస్టర్ వీరిపై డీసెంట్ బడ్జెట్ తో నిర్మాతగా పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే స్క్రిప్ట్ మొత్తం కూడా ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు కొరియోగ్రాఫర్ గా డ్యాన్స్ షోలతో జడ్జిగా క్రేజ్ అందుకున్న శేఖర్ మాస్టర్ ఇప్పుడు మొదటిసారి నిర్మాతగా కూడా మారబోతున్నారు. ఇక త్వరలోనే వీరి కాంబినేషన్ లో వచ్చే వెబ్ సీరీస్ పై పూర్తి వివరాలను తెలియజేయనున్నారు.