twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 6 తొలివారం నామినేషన్‌లో ఏడుగురు.. బిగ్‌బాస్ ట్విస్టుకు ఒకరు బలి!

    |

    Bigg Boss Telugu 6 రియాలిటీ షో రంజుగా సాగుతున్నది. తొలి మూడు రోజుల్లోనే గొడవలు, వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఎప్పటి లానే తొలి వారం నామినేషన్స్‌కు తెర లేపారు. ఇంటి సభ్యులందరిని సమావేశ పరిచి ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి అవకాశం ఉన్న కంటెస్టెంట్లను నామినేట్ చేయాలని బిగ్‌బాస్ సూచించాడు. దాంతో ఇంటి సభ్యులు తమ సహచర కంటెస్టెంట్ల బలహీనతలను చెబుతూ నామినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ వారం ఎవరెవరూ నామినేట్ అయ్యారంటే..

    యువరక్తంతో నింపేసిన బిగ్‌బాస్

    యువరక్తంతో నింపేసిన బిగ్‌బాస్

    ఇటీవల ప్రారంభమైన బిగ్‌బాస్ తెలుగు 6 షోలో సినీ తారలకు పెద్దగా చోటు కనపించలేదు. ఎక్కువ మంది సోషల్ మీడియా స్టార్స్, యూట్యూబ్ స్టార్స్, టెలివిజన్ నటులతో నింపేశారు. చాలా మంది పేర్లు, ముఖాలు కూడా ప్రేక్షకులకు పరిచయం లేకుండా ఉన్నాయి. ముఖ్యంగా యువ రక్తానికి బిగ్‌బాస్ పెద్ద పీట వేశారు. దాంతో ఈ సీజన్ కాస్త ఆసక్తిగానే మొదలైందని చెప్పవచ్చు.

    రేవంత్, చలాకీ చంటి టార్గెట్‌గా

    రేవంత్, చలాకీ చంటి టార్గెట్‌గా

    ఇక బిగ్‌బాస్ తెలుగు 6 సీజన్‌లో కొన్ని నిబంధనలు మార్చారు. ప్రతీ ఆదివారం ఎలిమినేషన్ జరిగిన వెంటనే నామినేషన్ ప్రక్రియను మొదలుపెట్టారు. కానీ ఈ సీజన్‌లో నామినేషన్ ప్రక్రియను బుధవారం ఆరంభించారు. తొలి వారం నామినేషన్ ప్రక్రియ చాలా కూల్‌గా సాగిపోయింది. ఎక్కువగా సింగర్ రేవంత్, చలాకీ చంటిని కంటెస్టెంట్లు టార్గెట్ చేశారు. రేవంత్‌కు యాటిట్యూబ్ ప్రాబ్లెం అని, నోరేసుకొని పడిపోతాడనే కామెంట్లు చేశారు. చంటి పనిలో భాగం కావడం లేదు. ఇంటి పనుల్లో జోక్యం చేసుకోవడం లేదని కంటెస్టెంట్లు ఫిర్యాదు చేశారు.

    ఫస్ట్ రౌండ్ నామినేషన్ ఇలా..

    ఫస్ట్ రౌండ్ నామినేషన్ ఇలా..

    నామినేషన్ పక్రియలో అత్యధికంగా ఓట్లు వచ్చిన క్లాస్ రూమ్ సభ్యులు సింగర్ రేవంత్, చంటి, శ్రీ సత్య, ఫైమా, ట్రాష్ సభ్యులు ఇనయా సుల్తానా, బాలాదిత్య, అభినయ శ్రీ నామినేట్ అయ్యారు. అయితే ఈ నామినేషన్ నుంచి ఒకరిని తప్పించేందుకు బిగ్‌బాస్ ట్విస్టు పెట్టారు. ఇంటి సభ్యులకు మరో టాస్క్ ఇవ్వడం ఆసక్తిగా మారింది.

    బిగ్‌బాస్ ట్విస్టు ఇలా..

    బిగ్‌బాస్ ట్విస్టు ఇలా..

    నామినేషన్ ప్రక్రియలో బిగ్‌బాస్ ట్విస్టు ఇచ్చాడు. క్లాస్ రూమ్ సభ్యులకు ప్రత్యేక అధికారం ఇస్తూ కంటెస్టెంట్లకు మరో పరీక్ష పెట్టారు. క్లాస్ రూమ్ సభ్యులు ట్రాష్‌లో ఉండి నామినేట్ అయిన ఇనయ, అదిత్య, అభినయ శ్రీని సేఫ్ అయిన సభ్యుల నుంచి ఒకరిని స్వాప్ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. దాంతో ఇంటి సభ్యులు చర్చకు దిగారు. అనంతరం ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకొని స్వాపింగ్ టాస్క్‌ను పూర్తి చేశారు.

    బాలాదిత్యను సేఫ్ చేసి..

    బాలాదిత్యను సేఫ్ చేసి..


    నామినేట్ అయిన ఇనయా సుల్తానా, ఆదిత్య, అభినయ శ్రీ నుంచి ఒకరిని సేఫ్ చేసేందుకు సిద్దమయ్యారు. ట్రాష్ సభ్యులు ఆదిరెడ్డి, గీతూ రాయల్, తర్జనభర్జన పడ్డారు. చివరికి సేఫ్ అయిన కంటెస్టెంట్‌ అరోహిరావు ను నామినేట్ చేసి బాలాదిత్యను సేఫ్ చేశారు. దాంతో తుది నామినేషన్ ప్రక్రియకు బిగ్‌బాస్ రెడీ అయ్యారు.

    ఫైనల్‌‌గా నామినేట్ అయిన సభ్యులు

    ఫైనల్‌‌గా నామినేట్ అయిన సభ్యులు

    ట్రాష్ సభ్యుల నిర్ణయం అనంతరం బిగ్‌బాస్ ఫైనల్ నామినేషన్స్ ప్రకటించారు. తొలి వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి అవకాశం ఉన్న సభ్యుల్లో సింగర్ రేవంత్, చలాకీ చంటీ, శ్రీ సత్య, జబర్దస్త్ ఫైమా, ఇనయా సుల్తాన్, కొరియోగ్రాఫర్ అభినయ శ్రీ, యాంకర్ అరోహిరావు‌ను నామినేట్ చేస్తూ నిర్ణయం తీసుకొన్నారు. దాంతో ఈ వారం ఎవరు బయటికి వెళ్తారనే ఉత్కంఠ మొదలైంది.

    English summary
    Bigg Boss Telugu 6 eliminations on cards for First week. Here is the seven members nominations list. Revanth, Chalaki Chanti and faima are in the list.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X