Don't Miss!
- News
mother: కూతురితో కలిసి ఆత్మహత్య చేసుకున్న తల్లి, అంగన్ వాడి టీచర్ ఇంట్లో ?
- Finance
7th cpc: ప్రభుత్వ ఉద్యోగులకు పెరగనున్న జీతాలు.. ఎప్పుడు, ఏమేమి పెరుగుతాయో తెలుసా..!
- Sports
అయ్యర్ స్థానంలో అతన్ని ఆడించండి.. శుభ్మన్ గిల్ మాత్రం వద్దు: దినేశ్ కార్తీక్
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Bigg Boss Telugu: ఆ యాంకర్ కి బిగ్ బాస్ బంపర్ ఆఫర్.. హోస్ట్ గా లేకుంటే అలా!.. నిర్ణయం అతనికే?
ఏమాత్రం అంచనాలు లేకుండానే తెలుగులోకి వచ్చి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న రియాలిటీ షో బిగ్ బాస్. ముందుగా ఈ షో అమెరికాలో ప్రారంభమైంది. తర్వాత ఈ రియాలిటీ షో ఎల్లలు దాటి ఇండియాలోకి బిగ్ బాస్ గా వచ్చింది. ముందుగా హిందీలో ప్రారంభమైన ఈ రియాలిటీ షోను క్రమేణా మిగతా భాషల్లోకి కూడా తీసుకొచ్చారు.
ఇందులో భాగంగానే ఎన్నో అనుమానాలు, అంచనాల నడుమ తెలుగులో 2017లో ఈ షో ప్రారంభమైంది. వరుసపెట్టి సీజన్లతో ముందుకు సాగిన ఈ రియాలిటీ షో ఆరో సీజన్ ను ఇటీవలే పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఏడో సీజన్ ను అతి త్వరలో ప్రారంభించేందుకు సన్నహాలు చేస్తున్నారు బీబీ నిర్వాహకులు. ఈ నేపథ్యంలోనే హోస్ట్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలు లీక్ అవుతున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దామా!

తొలుత అమెరికాలో ప్రారంభమై..
బిగ్ బ్రదర్ అనే పేరుతో అమెరికాలో ప్రారంభమైన రియాలిటీ షో ఎల్లలు దాటి ఇండియాలోకి బిగ్ బాస్ గా వచ్చింది. రావడమే కాకుండా అశేషమైన ప్రేక్షకాదరణ పొందింది. దీంతో ముందుగా హిందీలో ప్రారంభమైన ఈ రియాలిటీ షోను క్రమేణా మిగతా భాషల్లోకి కూడా తీసుకొచ్చారు. ఎన్నో అనుమానాలు, అంచనాల నడుమ విడుదలైన ఈ రియాలిటీ షో తెలుగులో 2017లో ప్రారంభమైంది.

సూపర్ సక్సెస్ అయ్యేలా..
బిగ్ బాస్ తెలుగు 1 సీజన్ కు మొదటగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేశారు. హోస్ట్ చేయడమే కాకుండా తనదైన మాట, కామెడీ, యాక్షన్స్ తో సూపర్ సక్సెస్ అయ్యేలా చేశారు. బిగ్ బాస్ రియాలిటీ షోను వరుసపెట్టి సీజన్లతో ముందుకు తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికి ఐదు రెగ్యూలర్ (టీవీ), ఒక ఓటీటీ (నాన్ స్టాప్) వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ సీజన్ లకు ప్రధాన హైలెట్ గా నిలిచేది హోస్ట్.

4 టీవీ, 1 ఓటీటీ సీజన్లకు హోస్ట్ గా..
బిగ్ బాస్ తెలుగు తొలి సీజన్ కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేశారు. ఆయన యాంకరింగ్ తో బిగ్ బాస్ ను స్థాయిని పెంచారు. దీంతో ఈ సీజన్ అత్యధికంగా ప్రేక్షకాదరణ పొందగలిగింది. అలాగే రెండో సీజన్ ను నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేశారు. ఇది కూడా చాలా పాపులర్ అవడంతో పాటు రేటింగ్ పరంగా కూడా దూసుకుపోయింది. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 నుంచి తాజాగా పూర్తయిన ఆరో సీజన్ (ఒక నాన్ స్టాప్ సీజన్) వరకు టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జున హోస్ట్ చేసిన విషయం తెలిసిందే.

సరిగా రాని రేటింగ్..
బిగ్ బాస్ షో తెలుగులో ఎంతటి సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. కానీ, ఆరో సీజన్ మాత్రం చాలా నిరాశజనకంగానే సాగింది. దీనికితోడు ఫేక్ ఎలిమినేషన్స్, రాజకీయ ప్రభావం కూడా పడటంతో కొంతమంది హానెస్ట్ కంటెస్టెంట్స్ కి అన్యాయం జరిగిందన్న విమర్శలు తలెత్తాయి. అందుకే దీనికి రేటింగ్ కూడా సరిగా రాలేదు. దీంతో ఈ ఆరో సీజన్ అట్టర్ ఫ్లాప్ గా మారింది. అందువల్లే ఈ సీజన్ తర్వాత నాగార్జున హోస్టింగ్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సినిమాలకు దూరంగా..
హోస్ట్ గా నాగార్జున తప్పుకోవడంతో బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ కు హోస్ట్ గా యంగ్ హీరో రానా దగ్గుబాటి, నందమూరి నటసింహం బాలకృష్ణ రానున్నాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక రానా దగ్గుబాటి పేరును నాగార్జుననే రికమండ్ చేసినట్లు సమాచారం. మరి వీరిలో ఎవరు రానున్నారనేది తెలియాల్సి ఉంది. అయితే కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండనున్న కారణంగా రానా దగ్గుబాటి హోస్టింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని మరో న్యూస్ లీక్ అయింది.

ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను..
ఈ సీజన్ హోస్ట్ సంగతి అటు ఉంచితే.. సీజన్ లోని కంటెస్టెంట్లను బీబీ బజ్ ద్వారా ఇంటర్వ్యూ చేస్తారన్న విషయం తెలిసిందే. అందుకోసం మాజీ టాప్ 5 కంటెస్టెంట్స్ ని లేదా విన్నర్స్ ను హోస్ట్ గా సెలెక్ట్ చేస్తారు. ఈ ఆరో సీజన్ లో బీబీ కేఫ్ హోస్ట్ గా యాంకర్ అరియానా గ్లోరి, ఆర్జే కాజల్ తోపాటు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ కంటెస్టెంట్, యాంకర్ శివ ఇంటర్వ్యూ చేశాడు.

బీబీ బజ్ హోస్ట్ గా..
ఇప్పుడు తాజాగా ప్రారంభం కానున్న బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ బీబీ బజ్ ప్రోగ్రామ్ కి హోస్ట్ గా చేయమని యాంకర్ శివకు ఆఫర్ ఇచ్చారట మేనేజ్ మెంట్. అంతేకాకుండా హోస్ట్ గా చేయమని లేదా.. కంటెస్టెంట్ గా కూడా చేయొచ్చని బంపర్ ఆఫర్ ఇచ్చారట. ఏది కావాలో నిర్ణయం కూడా అతనికే వదిలేసిందట బీబీ టీమ్. వారు ఇచ్చిన ఆఫర్లో బీబీ బజ్ కు హోస్ట్ గా ఉండటాన్నే యాంకర్ శివ ఎంచుకున్నాడని ఓ న్యూస్ లీక్ అయింది.