OTT Movies: దసరా బోనాంజా.. ఈ వారం ఓటీటీలో దుమ్ము రేపే స్ట్రీమింగ్స్

OTT Movies: దసరా పండగ సందర్భంగా థియేటర్లలో పెద్ద సినిమాలు హంగామా చేస్తున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'ఓజీ' బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. నయా రికార్డులు క్రియేట్ చేయడమే కాదు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇక ఈ వారంలో తెలుగు స్ట్రెయిట్ సినిమాలేవీ రిలీజ్ అవ్వడం లేదు. కానీ, రిషభ్ శెట్టి 'కాంతార 1', ధనుష్ 'ఇడ్లీ కొట్టు'వంటి డబ్బింగ్ సినిమాలు మాత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక థియేటర్లలో సినిమా కరువు ఉన్న నేపథ్యంలో ఓటీటీల్లో మాత్రం దసరా స్పెషల్‌గా సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇంతకీ ఆ సినిమాలేంటీ? ఏ సినిమా ఏందులో స్ట్రీమింగ్ అవుతోంది? వివరాలు అనే వివరాలు

ముఖ్యంగా లిటిల్ హార్ట్స్ మూవీ స్ట్రీమింగ్‌పై ప్రత్యేకంగా దృష్టి ఉంది. థియేటర్లలో హాస్యంతో అలరించిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుందో చూడాలి. అలాగే జూనియర్స్, మదరాసి వంటి చిత్రాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో వచ్చిన ద గేమ్ వెబ్ సిరీస్ కూడా థ్రిల్లింగ్ కంటెంట్‌తో ఆసక్తిని పెంచుతోంది.

OTT Movies Dasara Special Full Streaming List This Week

లిటిల్ హార్ట్స్

టాలీవుడ్ యువ టాలెంట్స్‌కి గుర్తింపు తెచ్చిన మూవీ లిటిల్ హార్ట్స్. ఎలాంటి అంచనాలు లేకుండా సెప్టెంబర్ 5న రిలీజ్ అయింది. ఈ లిటిల్ హార్ట్స్ మూవీలో 90s మిడిల్ క్లాస్ బయోపిక్ ఫేమ్ మౌలి తనుజ్, అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ ఫేమ్ శివానీ నాగారం జంటగా నటించారు. యువ డైరెక్టర్ సాయి మార్తాండ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందింది. చిన్న బడ్జెట్ రూ.2.5 కోట్లు మాత్రమే అయిన ఈ సినిమా, విడుదల సమయంలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందుతూ రూ.33 కోట్ల కంటే ఎక్కువ వసూలు చేసింది. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్స్ లో నిర్మితమైన ఈ చిత్రాన్ని నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నందిపాటి సమర్పించారు. మహేశ్‌బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు కూడా ఈ సినిమాను మెచ్చి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన 'లిటిల్ హార్ట్స్' (Little Hearts)ఇప్పుడు ఓటీటీ వేదికపై సందడి చేసేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 1 నుంచి 'ఈటీవీ విన్' (ETV Win) లో స్ట్రీమింగ్ కానుంది.

జూనియర్

బాక్సాఫీసు రిలీజ్‌ల్లో వాయిదా పడటం సాధారణమే. అదే పరిస్థితి ఓటీటీ సినిమాలకీ వర్తిస్తుంది. ఈ మధ్యకాలంలో 'జూనియర్' (Junior) మూవీ ఓటీటీ రిలీజ్ ఆలస్యమైంది. ముందుగా ఆహా (Aha) ఈ నెల 22 నుంచి స్ట్రీమింగ్ కానుందని ప్రకటించినా, ఆ తేదీకి సినిమా రిలీజ్ కాలేదు. తాజాగా కొత్త ఓటీటీ రిలీజ్ డేట్ను ప్రకటిస్తూ అక్టోబర్ 30న జూనియర్ మూవీ స్ట్రీమింగ్ ప్రారంభమవుతుందని తెలిపింది. చిన్న హీరోగా పరిచయం అయిన గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి ఇందులో హీరోగా నటించిన చిత్రమిది. శ్రీలీల హీరోయిన్‌గా, జెనీలియా కీలక పాత్రలో ఉన్నారు. పేరుకు తగ్గట్టే 'వైరల్ వయ్యారి' పాట సాంగ్ పెద్ద హిట్ అయింది. ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ జులైలో థియేటర్లలో విడుదలై మంచి స్పందన పొందింది.

మదరాసి

తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ 'మదరాసి' త్వరలో ఓటీటీ వేదికపై సందడి చేయనుంది. సైకలాజికల్ థ్రిల్లర్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ డేట్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 1న 'మదరాసి' అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రం టాప్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందింది. హీరోగా శివ కార్తికేయన్, రుక్మిణి వసంత్, విద్యుత్ జమాల్, బిజు మీనన్, విక్రాంత్ వంటి నటీనటులు నటించారు. సంగీతం అనిరుధ్ రవిచందర్ అందించారు. థియేటర్లలో సెప్టెంబర్ 5న రిలీజ్ అయిన ఈ మూవీ రూ.100 కోట్లు వసూలు చేసి సూపర్ హిట్‌గా నిలిచింది. మరో నెల రోజుల్లోనే ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ప్రైమ్ వీడియో తెలిపింది.

ఇక ఈ వారం స్ట్రీమింగ్‌కు రాబోతున్న పూర్తి లిస్ట్ ఇదిగో:

ఆహా :

జూనియర్ (తెలుగు సినిమా) - సెప్టెంబర్ 30

ఈటీవీ విన్ :

లిటిల్ హార్ట్స్ (తెలుగు సినిమా) - అక్టోబర్ 01

నెట్‌ఫ్లిక్స్ :

మిస్సింగ్ కింగ్ (జపనీస్ వెబ్ సిరీస్) - సెప్టెంబర్ 29

నైట్ మేర్స్ ఆఫ్ నేచర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - సెప్టెంబర్ 30

ద గేమ్ (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్) - అక్టోబర్ 02

మాన్‌స్టర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - అక్టోబర్ 03

అమెజాన్ ప్రైమ్ వీడియో :

మదరాసి (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబర్ 01

ప్లే డర్టీ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 01

సన్ నెక్స్ట్ :

సాహసం (తమిళ సినిమా) - అక్టోబర్ 01

గౌరి శంకర (కన్నడ సినిమా) - అక్టోబర్ 01

టేల్స్ ఆఫ్ ట్రెడిషన్ (తమిళ వెబ్ సిరీస్) - అక్టోబర్ 02

జీ5 :

చెక్ మేట్ (మలయాళ సినిమా) - అక్టోబర్ 02

డాకున్ డా ముందా 3 (పంజాబీ సినిమా) - అక్టోబర్ 02

జియో హాట్‌స్టార్ :

అన్నపూర్ణి (మూవీ) - అక్టోబర్ 01

సోనీ లివ్ :

13th (హిందీ వెబ్ సిరీస్) - అక్టోబర్ 01

ఆపిల్ ప్లస్ టీవీ :

ద సిస్టర్ గ్రిమ్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - అక్టోబర్ 02

లాస్ట్ బస్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 03

ఈ లిస్ట్ చూస్తే.. దసరా వారం థియేటర్లలో కన్నా ఓటీటీల్లోనే ఎంటర్టైన్‌మెంట్ బాగా దొరకనుందని క్లియర్‌గా తెలుస్తోంది. ప్రతి జానర్‌కి తగిన సినిమాలు, సిరీస్‌లు ఉండటంతో ఆడియన్స్‌కి ఈ వారం బోర్ అనిపించే ఛాన్స్ లేదు.

More from Filmibeat

Read more about: junior Little Hearts Madharaasi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X