twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Unstoppable 2పై హైకోర్టు కీలక ఆదేశాలు.. వెంటనే తొలగించాలంటూ షాకింగ్ గా!

    |

    నందమారి నటసింహం బాలకృష్ణ 60 ఏళ్ల వయసులోనూ ఎంతో ఉత్సాహంగా కనిపిస్తూ యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా జోష్ చూపిస్తున్నారు. అందుకు ఉదాహరణే బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న 'Unstoppable with NBK' షో. ప్రముఖ తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ఆహా సంస్థ వేదికగా ఈ టాక్ షో ప్రసారమవుతోందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ షోలో స్టార్ హీరోలు, హీరోయిన్లు సందడి చేయగా తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎపిసోడ్ పార్ట్ 1 డిసెంబర్ 29న రాత్రి 9 గంటలకు ప్రసారం చేశారు. అయితే తాజాగా ఈ అన్ స్టాపబుల్ టాక్ షోపై ఢిల్లీ హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

    రికార్డ్ స్థాయిలో రేటింగ్స్..

    రికార్డ్ స్థాయిలో రేటింగ్స్..


    అన్ స్టాపబుల్ 2 సీజన్ మొదటి ఎపిసోడ్ లో నారా చంద్రబాబు గెస్ట్ గా వచ్చిన తర్వాత అనేక మంది స్టార్ సెలబ్రిటీలు వచ్చి సందడి చేశారు. దీంతో ఇండియాలో టాప్ రేటింగ్ టాక్ షోగా బాలకృష్ణ నంబర్‌వన్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల ఆదరణకు నోచుకుంటోంది. దాంతో రికార్డుస్థాయి వ్యూస్‌ను, రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. అయితే ఆహా సాధిస్తున్న రికార్డు అధిగమించేందుకు నిర్వాహకులు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మ్యాచో హీరో గోపిచంద్‌తో భారీ ఎపిసోడ్‌ను ప్లాన్ చేశారు.

    జనవరి 6న రెండో పార్ట్..

    జనవరి 6న రెండో పార్ట్..


    ఇటీవల షూటింగ్ జరుపుకున్న ప్రభాస్, బాలకృష్ణ, గోపిచంద్ ఇంటర్వ్యూ నిడివి భారీగా ఉండటంతో ఈ ఎపిసోడ్‌ను బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 1 ది బాహుబలి బిగినింగ్‌గా, బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 1 ది బాహుబలి కన్‌క్లూజన్‌గా రెండు భాగాలు స్ట్రీమింగ్ చేయాలని డిసైడ్ చేశారు. బాహుబలి పార్ట్‌1ను డిసెంబర్ 29న విడుదల చేయగా.. బాహుబలి 2 ను జనవరి 6వ తేదీన స్ట్రీమింగ్ చేయాలని డేట్స్ ఫిక్స్ చేశారు.

    కీలక ఆదేశాలు..

    కీలక ఆదేశాలు..

    అయితే బాలకృష్ణ, ప్రభాస్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ స్టార్ట్ అయిన వెంటనే సర్వర్లు క్రాష్ కావడంతో నిర్వాహకులు పోస్టు పెట్టారు. ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్లు లాగిన్ కావడం, ప్రభాస్ అభిమానులు ఎక్కువ మంది ప్రేమను పంచడంతో ఓవర్ లోడ్‌ను తట్టుకోలేక యాప్ క్రాష్ అయింది. త్వరలోనే మేము యాప్‌ను పునరుద్దరిస్తాం అని ఆహా ట్వీట్ చేసింది. తర్వాత పునరుద్ధరించి ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా అన్ స్టాపబుల్ టాక్ షోపై ఢిల్లీ హైకోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది.

    అర్హ మీడియా వ్యాజ్యం..

    అర్హ మీడియా వ్యాజ్యం..

    అన్ స్టాపబుల్ షోలో ప్రభాస్, పవన్ కల్యాణ్ వంటి స్టార్స్ తో వరుస ఎపిసోడ్స్ షూట్ చేసుకున్న ఆహా సంస్థ వాటిని స్ట్రీమ్ చేయనుందని తెలిసిందే. అయితే ఈలోపే సోషల్ మీడియా, వివిధ ప్రసార సాధనాల్లో వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఆన్ లైన్ లోకి వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో అర్హ మీడియా అండ్ బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఢిల్లీ హైకోర్టు లో వ్యాజ్యం దాఖలు చేసింది.

     ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వాల్సిందిగా..

    ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వాల్సిందిగా..

    ప్రభాస్ ఎపిసోడ్ తో పాటు మిగిలిన ఎపిసోడ్ లను అనధికారికంగా ప్రసారం చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని లాయర్ ప్రవీణ్ ఆనంద్, అమిత్ నాయక్ లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అనధికార ప్రసారాల వల్ల షో నిర్వాహకులు వాణిజ్యపరంగా నష్టపోవాల్సి వస్తోందని కోర్టుకు విన్నవించారు. ఇలాంటివి అడ్డుకునేందుకు ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ విషయంపై విచారణ చేపట్టిన జస్టిస్ సంజీవ్ సచ్ దేవ్ ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది.

    ఆ లింకులను తొలగించాలి..

    ఆ లింకులను తొలగించాలి..

    ప్రస్తుత పరిస్థితుల్లో వెబ్ సైట్స్ తోపాటు ఇతర మీడియా మాధ్యమాలపై చర్యలు తీసుకునేలా డైనమిక్ ఇంజక్షన్ ఇవ్వకపోతే ఫిర్యాదుదారుడికి భారీ నష్టం వాటిల్లుతుందని కోర్టు పేర్కొంది. అందుకే తదుపరి విచారణ వరకు మధ్యంతర ఇంజెక్షన్ మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. అలాగే అన్ స్టాపబుల్ షోకి సంబంధించి సోషల్ మీడియాలో ఉన్న అనధికారిక లింక్ లను తొలగించాలని టెలికమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ మంత్రత్వ శాఖ, ఇంటర్నెట్ ప్రొవైడర్లను న్యాయస్థానం అదేశించింది.

    English summary
    Delhi High Court Restrains Illegal Streaming Of Nandamuri Balakrishna Talk Show Unstoppable 2 In Aha OTT
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X