F3 Movie streaming ఎప్పుడు? ఎక్కడంటే? ఆ విషయంలో మాటతప్పని.. మడమ తిప్పని దిల్ రాజు
తెలుగు సినిమా పరిశ్రమలో అరుదైన విజయాన్ని సొంతం చేసుకొన్న చిత్రాల్లో F3 మూవీ ఒకటిగా నిలిచింది. గత 40 రోజులకుపైగా థియేటర్లలో మంచి వసూళ్లను సాధించింది. 2022లో విడుదలైన సినిమాల్లో క్లీన్ హిట్‌గా నిలిచింది. ఇక థియేట్రికల్ రన్‌ను దిగ్విజయంగా పూర్తి చేసుకొన్న ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలోకి రాబోతున్నది. ఈ సినిమా ఎప్పుడు? ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందంటే?

50 రోజుల పండుగ కోసం
తెలుగు సినిమా పరిశ్రమ కరోనా పరిస్థితులను తట్టుకొని 2022లో పలు చిత్రాలను రిలీజ్ చేసింది. వాటిలో అఖండ, RRR, KGF2, పుష్ప చిత్రాలు అద్బుతమైన విజయాలు అందుకొన్నాయి. ఆ చిత్రాల తర్వాత F3 మూవీ భారీ వసూళ్లు, థియేటర్లలో ఎక్కువ రోజులు ప్రదర్శించిన సినిమా ఘనతను సొంతం చేసుకొన్నది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 10కి పైగా థియేటర్లలో 50 రోజుల పూర్తి చేసుకోవడానికి పరుగులు పెడుతున్నది.

ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు
F3 చిత్రానికి సంబంధించి సుమారు 8 వారాల్లో భారీ కలెక్షన్లను నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 53.94 కోట్ల షేర్‌ను రాబట్టింది. F3 చిత్రం సుమారు 50 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 134 కోట్ల గ్రాస్, 70.94 కోట్ల షేర్‌ను రాబట్టి ట్రిపుల్ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకొన్నది. అయితే ఈ చిత్రం సుమారు 7 కోట్లకుపైగా లాభాలను రాబట్టింది.

దిల్ రాజు సంచలన నిర్ణయాలు
F3 మూవీ రిలీజ్ సమయంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండు సంచలన నిర్ణయాలు తీసుకొన్నారు. ఒకటి సాధారణ ధరకే టికెట్ రేట్ నిర్ణయించడం అప్పట్లో సినిమా ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఇక సినిమా త్వరలోనే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుందనే వార్తలను గుప్పుమన్నాయి. అయితే దిల్ రాజు, హీరోలు వెంకటేష్, వరుణ్ తేజ్ ఆ వార్తలను ధాటిగా ఖండించారు.

50 రోజుల తర్వాతే ఓటీటీలోకి అంటూ
అయితే F3 మూవీ ఎట్టి పరిస్థితుల్లోను ఓటీటీలోకి రావడం జరగదు. ముందుగా నిర్ణయించుకొన్న ప్రకారం ఈ సినిమాను 50 రోజుల తర్వాతే ఓటీటీలోకి తీసుకొస్తామని దిల్ రాజు స్పష్టం చేశారు. ఇతర నిర్మాతలకు మార్గదర్శకంగా నిలిచేలా దిల్ రాజు చెప్పిన మాటకు కట్టుబడి ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఓటీటీ రిలీజ్ ఎక్కడ? ఎప్పుడంటే?
F3 మూవీ 50 రోజుల తర్వాత ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సినిమాను జూలై 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాను ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ సోని లివ్ చిత్రం సొంతం చేసుకొన్నది. జూలై 22వ తేదీన ఈ సినిమా సోని లివ్ యాప్‌లో స్ట్రీమింగ్ కానున్నది.


Click it and Unblock the Notifications











