Dude OTT Release: రికార్డ్ ధరకు డ్యూడ్ ఓటీటీ డీల్... ప్రదీప్ రంగనాథన్ మూవీ స్ట్రీమింగ్ ఎందులో అంటే?

తమిళ చిత్ర పరిశ్రమలో ఫ్యూచర్ సూపర్‌స్టార్‌గా ఎదుగుతున్నారు యువ హీరో ప్రదీప్ రంగనాథన్. లవ్ టుడే, డ్రాగన్ తదితర హిట్స్‌తో ఒక్కసారిగా ఆయన స్టార్ రేసులో దూసుకొచ్చేశారు. తాజాగా ప్రదీప్ రంగనాథన్ నటించిన మూవీ డ్యూడ్. తెలుగులో టాప్ నిర్మాణ సంస్థగా ఉన్న మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వై రవిశంకర్, నవీన్ యెర్నెనీ ఈ సినిమాను నిర్మించారు. డ్యూడ్‌లో ప్రదీప్ రంగనాథన్ సరసన మమితా బైజు, నేహా శెట్టి హీరోయిన్‌గా నటించారు. శరత్ కుమార్, హ్రిదు హరూన్, డ్రావిడ్ సెల్వమ్, సత్య, రోహిణి, ఐశ్వర్య శర్మలు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. డ్యూడ్ చిత్రానికి సుధ కొంగర వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన కీర్తీశ్వన్ దర్శకత్వం వహించారు. నిఖిత్ బొమ్మి సినిమాటోగ్రఫి, భరత్ విక్రమన్ ఎడిటర్‌గా పనిచేశారు. సాయి అభయాంకర్ సంగీత సారథ్యం వహించారు.

డ్యూడ్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి డ్యూడ్ చిత్రానికి 30 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. యూత్‌లో ప్రదీప్ రంగనాథన్ క్రేజ్, టీజర్, ట్రైలర్లతో డ్యూడ్ మూవీకి తమిళ్, తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. తమిళనాడులో డ్యూడ్ మూవీ థియేట్రికల్ రైట్స్‌ను మొదట రోమియో పిక్చర్స్ సంస్థ దక్కించుకుంది. అయితే ఈ సంస్థ అనూహ్యంగా తప్పుకోవడంతో ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ హక్కులను సొంతం చేసుకుంది. ఓవర్సీస్‌లో డ్యూడ్ చిత్రానికి ప్రత్యంగిరా సినిమాస్ డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తోంది.

Dude OTT Release When And Where To Watch Pradeep Ranganathan s Movie Online After Theatrical Run

డ్యూడ్ ప్రీ రిలీజ్ బిజినెస్
తెలుగు రాష్ట్రాల్లో డ్యూడ్ మూవీ థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే... నైజాంలో 4.5 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 1.5 కోట్ల రూపాయలు, ఆంధ్రలో 4 కోట్ల రూపాయలు చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఆంధ్రా, నైజాంలలో ప్రదీప్ రంగనాథన్ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 11 కోట్ల రూపాయల షేర్... 22 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు తెలిపారు.

ఇండియాలోని ఇతర రాష్ట్రాలలో డ్యూడ్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ పరిశీలిస్తే... తమిళనాడులో 31 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల రూపాయలు, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో 6 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 12 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 59 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ చేసింది ఈ చిత్రం. ప్రదీప్ రంగనాథన్ మూవీ లాభాల్లోకి రావాలంటే 60 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్.. 120 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌ రాబట్టాల్సి ఉంది.

డ్యూడ్ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్
ప్రదీప్ రంగనాథన్ క్రేజ్ నేపథ్యంలో అడ్వాన్స్ బుకింగ్‌లో డ్యూడ్ చిత్రం దుమ్మురేపుతోంది. అమెరికాలో పెయిడ్ ప్రీమియర్స్‌ + తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్‌లో ప్రదీప్ కొత్త రికార్డులు సృష్టించాడు. అమెరికా వ్యాప్తంగా 314 సెంటర్లలో.. 686 షోలకు గాను 5969 టికెట్లు అమ్ముడయ్యాయి. తద్వారా తెలుగు వెర్షన్ 46K , తమిళ వెర్షన్‌కు 42K చొప్పున మొత్తంగా 88,083K డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు 78 లక్షల రూపాయలు) వసూలు చేసింది.

ఇక ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్ కింద తమిళ వెర్షన్‌కు గాను 1,80,862 లక్షల టికెట్లు అమ్ముడై... 2.93 కోట్ల రూపాయలు, తెలుగు వెర్షన్‌కు గాను 62,801 టికెట్లు అమ్ముడై 9.54 లక్షల రూపాయలు చొప్పున మొత్తంగా 3.89 కోట్ల రూపాయలు వసూలు చేశాడు ప్రదీప్ రంగనాథన్. ఓవరాల్‌గా అడ్వాన్స్ బుకింగ్ కింద ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి 4.67 కోట్ల రూపాయలు రాబట్టింది.

డ్యూడ్ ఓటీటీ ప్లాట్‌ఫాం
డ్యూడ్ డిజిటల్ రైట్స్‌ను దాదాపు 25 కోట్ల రూపాయలు వెచ్చించి ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ప్రదీప్ రంగనాథన్ కెరీర్‌లో ఓ సినిమా ఓటీటీ రైట్స్ ఈ స్థాయిలో ధర పలకడం ఇదే తొలిసారి. డిజిటల్ రైట్స్ ద్వారానే దాదాపుగా డ్యూడ్‌కి నిర్మాతలు పెట్టిన పెట్టుబడి వచ్చేసిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. థియేటర్‌లో రిలీజైన 6 వారాల తర్వాత డ్యూడ్ చిత్రం ఓటీటీలోకి రావాలనే నిబంధన కింద ఒప్పందం కుదిరినట్లుగా తెలుస్తోంది. ఈ లెక్కల ప్రదీప్ రంగనాథన్ మూవీ నవంబర్ చివరి వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. అయితే థియేట్రికల్ రన్‌ని బట్టి ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఆలస్యం కావొచ్చు.. లేదా ముందుగానే రావొచ్చు. డ్యూడ్ డిజిటల్ స్ట్రీమింగ్‌పై త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X