Don't Miss!
- Sports
Australia Open 2023 క్వీన్ అరినా సబలెంక..!
- Lifestyle
Astrology Tips: స్త్రీలు చేయకూడని పనులు.. వాటిని చేయడం వల్ల ఇంట్లో దరిద్రమే
- News
YCPకి నియోజకవర్గాన్ని రాసిస్తున్న TDP సీనియర్ నేత!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Finance
Multibagger Stock: ఒక సంవత్సరంలో 1000 శాతం రాబడి అందించిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
Disney + Hotstar లో రికార్డు సృష్టించిన ఐరావతం.. 100 మిలియన్ల వ్యూస్‌తో..
సస్పెన్స్, ఎమోషనల్ థ్రిల్లర్‌గా, మదర్ సెంటిమెంట్‌తో రూపొందిన ఐరావతం ఓటీటీలో భారీగా వ్యూస్ రాబడుతున్నది. ఎస్తేర్ నోర్హా, తన్వీ నేగి, జానకి కలగనలేదు ఫేమ్ అమర్ దీప్, అరుణ్, సప్తగిరి నటించిన ఈ ఎమోషనల్ డ్రామా నవంబర్ 17 తేదీన పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ+హాట్ స్టార్‌లో మంచి రెస్పాన్స్ కూడగట్టుకొంటున్నది. ఈ చిత్రం 100 మిలియన్ల వ్యూస్‌తో రికార్డు సృష్టించింది. చిన్న చిత్రంగా వచ్చిన మిస్టరీ చిత్రానికి భారీగా ప్రేక్షకుల ఆదరణ లభిస్తున్నది.
ఇక ఐరావతం సినిమా విషయానికి వస్తే.. శ్లోక అనే బ్యూటీషియన్‌కు తన బర్త్ డే రోజున ఒక వైట్ కెమెరా బహుమతిగా వస్తుంది. వైట్ కెమెరా ఎప్పుడైతే వస్తుందో ఆమె జీవితంలో అనూహ్యమైన సంఘటనలు చోటుచేసుకొంటాయి. బర్త్ డే వీడియో తీస్తే.. డెత్ దే వీడియోలు వస్తుంటాయి. అయితే అలాంటి మిస్టరీ పరిస్థితులను డీకోడ్ చేస్తే... ఊహించని రహస్యాలు బయటకు వస్తాయి. ఆ మిస్టరీ సంఘటనలకు కారణమేమిటనే ప్రశ్నలకు సమాధానమే ఐరావతం సినిమా కథ.

ఐరావతం సినిమాను నూజివీడు టాకీస్‌పై రేఖ పలగని సమర్పణలో రాంకీ పలగాని, బాలయ్య చౌదరి చల్లా, లలిత కుమారి తోట నిర్మాతలుగా నిర్మించారు. ఐరావతం సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో యూనిట్ సభ్యులు సక్సెస్ పార్టీని సెలబ్రేట్ చేసుకున్నారు. త్వరలోనే ఐరావతం సీక్వెల్ రాబోతున్నదనే హింట్‌ను చిత్ర యూనిట్ ఇచ్చింది.
నిర్మాతలు:
రాంకీ
పలగాని,
బాలయ్య
చౌదరి
చల్లా,
లలిత
కుమారి
తోట
సమర్పణ:
రేఖ
పలగాని
కథ,
స్క్రీన్
ప్లే,
దర్శకత్వం:
సుహాస్
మీరా
సినిమాటోగ్రాఫర్:
ఆర్
కె
వెల్లపు
సాంగ్స్
మ్యూజిక్:
సత్య
కశ్యపు
రీరికార్డింగ్:
కార్తిక్
కడగండ్ల
లిరిక్స్:
పూర్ణాచారి
ఎడిటింగ్:
సురేష్
దుర్గం
పీఆర్వో:
మధు
వీఆర్