For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  F3 OTT Release: అమెజాన్ ప్రైమ్ ను కాదని ఆ సంస్థకు హక్కులు.. రిలీజ్ అయ్యేది ఎప్పుడంటే?

  |

  వెంకటేశ్ వరుణ్ తేజ్ నటించిన కామెడీ మల్టీస్టారర్ మూవీ F 3 సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో టాలెంటెడ్ దర్శకుడు అనిల్ రావిపూడి తెరపైకి తీసుకువచ్చిన సినిమాకు మొదటి నుంచి కూడా అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. తప్పకుండా ఈ సారి సినిమా అంతకుమించిన ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది అని కూడా చిత్ర యూనిట్ ప్రమోషన్ చేసింది. ఇక ఈ సినిమా విడుదల రోజే ఓటీటీలో ఎప్పుడు రాబోతోంది అనే విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

  F3 Movie Review కుంభస్థలం కొట్టిందా? గురి తప్పిందా? | Filmibeat Telugu
   భారీగా బిజినెస్

  భారీగా బిజినెస్

  F2 సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అదే సినిమాకు ఫ్రాంచైజ్ గా కొనసాగిస్తూ దర్శకుడు అనిల్ రావిపూడి F3 సినిమా కథను రెడీ చేసుకున్నాడు. F2 సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు అంతకు మించిన అనేలా F3 సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ సినిమా 80 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది.

  భిన్నమైన కామెడీ టైమింగ్

  భిన్నమైన కామెడీ టైమింగ్


  సినిమాకు ఓ వర్గం వారి నుంచి అయితే మంచి పాజిటివ్ టాక్ వస్తోంది. వెంకటేష్ వరుణ్ తేజ్ ఇద్దరు కూడా వారి సరికొత్త కామెడీ టైమింగ్ తో ఎంతగానో మెప్పించారు అని అలాగే సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు కూడా భిన్నమైన కామెడీ టైమింగ్ తో నటించినట్లుగా చెబుతున్నారు. మొత్తానికి సినిమా ప్రీమియర్ షో ద్వారానే ఒక మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

  దిల్ రాజు మంచి ఆలోచన

  దిల్ రాజు మంచి ఆలోచన


  నిర్మాత దిల్ రాజు ఎలాంటి సినిమా చేసినా కూడా సినిమా బిజినెస్ లో చా జాగ్రత్తలు తీసుకుంటారు అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా విషయంలో కూడా ఆయన టేబుల్ ప్రాఫిట్ వచ్చే విధంగా అడుగులు వేసినట్లు సమాచారం. ముఖ్యంగా ఈ సినిమా కోసం టికెట్ల రేట్లను పెంచకుండా ప్రయోగం చేశారు. జనాలను థియేటర్లోకి రప్పించాలని ఎక్కువ మంది జనాలు చూస్తూనే లాభాలు వస్తాయి అని ఆలోచించే సినిమా టికెట్లు రేట్లు పెంచకుండానే విడుదల చేస్తున్నారు.

  ఆ సంస్థకు ఓటీటీ హక్కులు

  ఆ సంస్థకు ఓటీటీ హక్కులు

  ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ ఈ సినిమాను భారీ స్థాయిలో ని విడుదల చేశారు. ఇక ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు విడుదల అవుతుంది అనే విషయం కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకునేందుకు అమెజాన్ ప్రైమ్ బాగానే ప్రయత్నాలు చేసింది కానీ చివరికి సోనీ లివ్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.

  ఓటీటీలో ఎప్పుడంటే?

  ఓటీటీలో ఎప్పుడంటే?


  ఇక F3 సినిమా థియేటర్స్ లో విడుదల అయిన తర్వాత ఎన్ని రోజులకు ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి వస్తుంది అనే విషయంలోకి వెళితే.. ముందస్తు ఒప్పందం ప్రకారం 50 రోజుల తర్వాతనే ఓటీటీలో విడుదల చేయాలని అనుకున్నారు. ఏకబ్రిజల్ట్ లో ఏదైనా తేడా వస్తే మళ్ళీ మరొక డీల్ ద్వారా ఎక్కువ అమౌంట్ మాట్లాడుకుని ముందుగానే రిలీజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది.

  ఆ నెలలోనే స్ట్రీమింగ్?

  ఆ నెలలోనే స్ట్రీమింగ్?

  ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే F3 సినిమా ను జూలై నెలలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. జూలై రెండవ వారం తర్వాత సోని లీవ్ లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంటే జూలై 15 లేదా 16వ తేదీన వీకెండ్స్ లో F3 సినిమాను స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

  English summary
  F3 Movie telugu OTT Release date and streaming in sony liv
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X