#BringbackGeetu.. ఓడిపోయాను.. క్షమించండి.. ఎలిమినేషన్ తర్వాత గీతూ ఎమోషనల్ పోస్ట్..
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 6 చాలా చప్పగా సాగుతున్న నేపథ్యంలో భారీ కుదుపు కనిపించింది. ఎవరూ ఊహించనిదే జరిగేది అనే రేంజ్‌లో 9వ వారం ఎలిమినేషన్ జరిగింది. టాప్ కంటెస్టెంట్ గీతూ రాయల్ ఎలిమినేషన్ ఇంటి సభ్యులకే కాకుండా బిగ్‌బాస్ అభిమానులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. అయితే గీతూ రాయల్ ఎలిమినేషన్ తర్వాత సీక్రెట్ రూమ్‌కు వెళ్లారనే విషయంపై క్లారిటీ ఏమిటంటే?

ఇంటి నుంచి వెళ్లడానికి నిరాకరిస్తూ..
బిగ్‌బాస్ తెలుగు 6 ఆరో వారంలో ఎలిమినేషన్‌లో చివరగా శ్రీ సత్య, గీతూ రాయల్ నిలిచారు. అయితే తాను ఎలిమినేట్ కాననే ధీమాతో గీతూ కనిపించింది. అయితే అనూహ్యంగా గీతూ ఎలిమినేట్ కావడంతో తానే నమ్మలేకపోయింది. ఎలిమినేషన్ తర్వాత తనని ఒంటరిగా ఉండనివ్వమంటూ భావోద్వేగానికి గురైంది. నాకు ఇంటి నుంచి వెళ్లాలని లేదు అంటూ గేట్ వద్ద దారుణంగా రోధించింది.

సిబ్బందితో బయటకు పంపించిన నాగ్
ఇక బిగ్‌బాస్ వేదికపైన నాగార్జునతో కలిసి తన జర్నీని చూస్తూ ఎమోషనల్ అయింది. బిగ్‌బాస్ హౌస్‌లో ఉండనివ్వండి.. నేను బయటకు వెళ్లను అంటూ భోరుమని విలపించింది. గీతూను ఓదార్చేందుకు నాగార్జున ప్రయత్నించాడు. చివరకు బిగ్‌బాస్ సిబ్బందిని పిలిపించి.. బయటకు పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సీక్రెట్ రూమ్‌లోకి అంటూ..
అయితే గీతూను సీక్రెట్ రూమ్‌కు పంపించి ఉంటారని మీడియాలోను, ఇంటి సభ్యులు, ఆమె అభిమానుల్లో ఊహగానాలు వచ్చాయి. అయితే అలాంటి వార్తలు, అభిప్రాయాలకు చెక్ చెబుతూ.. సోషల్ మీడియాలో గీతూ పోస్ట్ పెట్టింది. తాను బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాను. ఇక నా ప్రయాణం ముగిసింది అంటూ క్లారిటీ ఇచ్చింది.

నేను ఓడిపోయాను అంటూ
నా జీవితంలో బిగ్‌బాస్ జర్నీ మోస్ట్ బ్యూటీఫుల్. నా జీవితంలో ఎన్నడూ లేని అనుభూతిని పొందాను. కానీ ఈ జర్నీలో నేను ఓడిపోయాను. మనుషుల విలువ తెలిసింది. దయచేసి నా తప్పులని క్షమించండి. నన్ను నన్నుగా అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి. నాకు సపోర్ట్ చేసినా ప్రతీ ఒకరికి చచ్చిపోయేంత వరకు రుణపడి ఉంటాను. బిగ్‌బాస్‌తో నా ప్రయాణం ఇక్కడే ముగిసింది అని ఎమోషనల్ అయింది.

బిగ్‌బాస్ మీద చిరాకు అంటూ
ఇక ఊహించని విధంగా బిగ్‌బాస్ షో నుంచి రావడంపై నిరాశకు లోనైనా అభిమానులను ఊరడించే ప్రయత్నం చేసింది. నా వల్ల బిగ్‌బాస్ మీద చిరాకు వచ్చిన వాళ్లకి కూడా పెద్ద సారి అంటూ కామెంట్ చేసింది. అయితే తీవ్ర మనోవేదనకు గురైన గీతూ రాయల్‌కు సోషల్ మీడియాలో భారీగా సానుకూలమైన స్పందన లభిస్తున్నది.

బిగ్‌బాస్ నిర్ణయం రాంగ్ అంటూ
గీతూ రాయల్ ఎలిమినేషన్‌పై నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. గీతూను ఎలిమినేట్ చేయడం సమంజసం కాదు. అక్క నీ కంటే.. తక్కువ ఆడేవారు ఇంటిలో ఉన్నారు. బిగ్‌బాస్ కరెక్ట్ నిర్ణయం తీసుకోలేదు. ఇక నుంచి బిగ్‌బాస్ చూడం అంటూ నెటిజన్లు కామెంట్స్ పెట్టారు. ఇక కొందరు స్పందిస్తూ.. నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ అక్కా.. బిగ్‌బాస్‌లో ఒక కంటెస్టెంట్ వెళ్లిపోతే నా కళ్లలో నీళ్లు రావడం ఇదే మొదటిసారి అని కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











