Bigg Boss Non Stop విజేత పేరు ముందే డిసైడ్ అయిందా? ఆ నలుగురి పరిస్థితి ఏంటో?
బిగ్‌బాస్ నాన్ స్టాప్ రియాలిటీ షో ముగింపు దశకు చేరుకొన్నది. 70 రోజులకుపైగా సాగుతున్న ఈ పాపులర్‌లో టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరో ఆదివారం (మే 15న) తేలిపోతుంది. దాంతో ఈ షో ముగింపు వారం ఆసక్తికరంగా మారబోతున్నది. దాంతో విజేత ఎవరో అనే విషయంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతున్నది. ఈ నేపథ్యంలో టాప్ 5లోకి ఎవరు వస్తారు? టైటిల్ రేసులో ఎవరు ఉంటారనే విషయంలోకి వెళితే..

టాప్ 5 కోసం ఎనిమిది మంది
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ఇంటిలో ప్రస్తుతం బిందు మాధవి, అఖిల్ సార్థక్, నటరాజ్ మాస్టర్, యాంకర్ శివ, మిత్రా శర్మ, బాబా భాస్కర్, అనిల్ రాథోడ్, అరియానా గ్లోరి ఉన్నారు. ఈ ఎనిమిది మందిలో నుంచి ఐదుగురు మాత్రమే టైటిల్ రేసులో ఉండే అవకాశం ఉంది. అయితే టాప్ 5లో ఎవరు చేరుతారనే విషయం ప్రస్తుతం ఆసక్తిగా మారింది.

ఈ సారి విజేత మహిళా కంటెస్టెంట్ అంటూ
అయితే గత కొద్దికాలంగా సోషల్ మీడియాలో బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విజేత మహిళా కంటెస్టెంట్ అనే ప్రచారం జోరుగా సాగుతున్నది. ఈ క్రమంలో ఇంటిలో బిందుమాధవి, మిత్రాశర్మ, అరియానా గ్లోరి ముగ్గురు మహిళా కంటెస్టెంట్లు పోటీలో ఉన్నారు. అయితే అరియానా గ్లోరి కూడా ఈ సారి లేడి కంటెస్టెంట్ విజేత అవుతుందనే బలంగా నమ్ముతున్నారు.

టాప్ 5 ఎవరు ఉంటారనే ఆసక్తి
ఆదివారం రోజున హోస్ట్ నాగార్జున వేదికపైకి రానున్నారు. దాంతో ముగ్గురిని ఎలిమినేట్ చేసి.. టాప్ 5లోకి ఐదుగురిని పంపిస్తారా అనే విషయం ఆసక్తిని రేపుతున్నది. అయితే టాప్ 5లోకి చేరడానికి అర్హత ఉన్న వారిలో బిందు మాధవి, అఖిల్ సార్థక్, నటరాజ్ మాస్టర్, యాంకర్ శివతోపాటు మిత్రా శర్మ గానీ, బాబా భాస్కర్‌లో ఎవరో చివరి పోరులో నిలిచే అవకాశం ఉంది.

ఆ నలుగురు స్ట్రాంగ్‌గా
ఒకవేళ బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విజేత మహిళా కంటెస్టెంట్ అయితే మాత్రం ఈ టైటిల్‌పై భారీగా ఆశలు పెట్టుకొన్న అఖిల్, నటరాజ్ మాస్టర్, బాబా మాస్టర్, యాంకర్ శివకు తీవ్ర నిరాశే మిగులుతుంది. అఖిల్ తనకు తాను టైటిల్ విన్నర్ అనే మూడ్‌లో కనిపిస్తున్నారు. దీంతో ఈ నలుగురి భవిష్యత్ ఇప్పడు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది.

టైటిల్‌పై ఎవరికి వారే ధీమా
ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. ఆడపులి అనే ట్యాగ్‌తో బిందు మాధవి టైటిల్ రేసులో ముందు ఉన్నట్టు కనిపిస్తున్నది. అయితే అఖిల్ సార్థక్‌కు భారీ ఫాలోయింగ్ ఉండటం కారణంగా టైటిల్ రేసులో తాను ఉన్నట్టు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే నటరాజ్ మాస్టర్ తన జీవిత లక్ష్యంగా శ్రమిస్తున్నాడు. బిందుకు టఫ్ పోటీ ఇస్తున్న మిత్రా శర్మ కూడా టాప్‌తోపాటు టైటిల్ రేసులో ఉంటాననే కాన్ఫిడెన్స్‌ను చూపిస్తున్నారు. ఎవరు విజేతగా నిలుస్తారో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











