Kantara Chapter 1 OTT: కాంతార చాప్టర్ 1 ఓటీటీ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎందులో అంటే?

మూడేళ్ల క్రితం సంచలన విజయం సాధించిన కాంతారకు ప్రీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం కాంతార చాప్టర్ 1. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 2వ తేదీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. కాంతారకు ఏ మాత్రం తగ్గకుండా తన మార్క్ ప్రెజెంటేషన్‌తో రిషబ్ శెట్టి.. కాంతార చాప్టర్ 1ను తెరకెక్కించినట్లుగా అభిమానులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కాంతార చాప్టర్ 1 ఓటీటీ రిలీజ్‌ ఎప్పుడు? ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఏ ఓటీటీ సంస్థ దక్కించుకుందో పరిశీలిస్తే?

కాంతార చాప్టర్ 1లో రిషబ్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. జయరామ్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి, రాకేశ్ పూజారి, ప్రకాశ్ తుమినాడ్, దీపక్ రామ్ పనాజీ, హరిప్రసాద్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్, చాలువే గౌడలు దాదాపు రూ.125 కోట్ల భారీ బడ్జెట్‌తో కాంతార చాప్టర్ 1ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీత సారథ్యం వహిస్తుండగా.. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రాఫర్‌గా, సురేష్ మల్లయ్య ఎడిటింగ్ బాధ్యలు నిర్వర్తిస్తున్నారు.

Kantara Chapter 1 OTT Release When And Where To Watch Rishab Shetty s Movie Online After Theatrical Run

కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ బిజినెస్
గతంలో కాంతార విజయం నేపథ్యంలో తాజాగా రిలీజ్ కానున్న కాంతార చాప్టర్ 1పైనా తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలు నెలకొంది. దీనికి తగినట్లుగానే ఈ మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం కాంతార చాప్టర్ 1 తెలుగు థియేట్రికల్ రైట్స్ 100 కోట్లకు పైగా పలుకుతున్నాయట. నైజాంలో 40 కోట్లు, ఆంధ్రలో 45 కోట్లు, సీడెడ్ ఏరియాలో 15 కోట్లుగా చెబుతున్నారు. కాంతార చాప్టర్ 1 తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కావాలంటే 101 రూపాయల షేర్, 202 కోట్ల రూపాయలు గ్రాస్ రాబట్టాల్సి ఉంది.

కాంతార చాప్టర్ 1 బ్రేక్ ఈవెన్ టార్గెట్
తెలుగు రాష్ట్రాలను మినహాయిస్తే.. కర్ణాటక థియేట్రికల్ రైట్స్ రికార్డు స్థాయిలో 169 కోట్ల రూపాయలు, తమిళనాడు హక్కులు 13 కోట్ల రూపాయలు, కేరళ రైట్స్ 20 కోట్ల రూపాయలు, నార్త్ ఇండియా రైట్స్ 96 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 44.5 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా సుమారుగా 440 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని శాండిల్‌వుడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 850 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

కాంతార చాప్టర్ 1 నాన్ థియేట్రికల్ బిజినెస్
ఇక కాంతార చాప్టర్ 1 నాన్ థియేట్రికల్ బిజినెస్ వివరాల్లోకి వెళితే.. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను రికార్డ్ స్థాయిలో 125 కోట్ల రూపాయలు వెచ్చించి అమెజాన్ ప్రైమ్ సంస్థ సొంతం చేసుకుంది. కాంతార చాప్టర్ 1 శాటిలైట్ రైట్స్ 80 కోట్ల రూపాయలు, ఆడియో హక్కులు 30 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేశాయి. దాంతో ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ బిజినెస్ ఏకంగా 235 కోట్ల రూపాయల మేర జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ కలిపి కాంతార చాప్టర్ 1 మూవీకి ఏకంగా 675 కోట్ల బిజినెస్ చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది.

కాంతార చాప్టర్ 1 ఓటీటీ రిలీజ్
కాంతార చాప్టర్ 1 ఓటీటీ రిలీజ్ విషయానికి వస్తే.. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నది. థియేటర్‌లో రిలీజైన 4 నుంచి 6 వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. దీనిని బట్టి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో కాంతార చాప్టర్ 1 మూవీ నవంబర్ తొలి వారంలో ఓటీటీ అందుబాటులోకి రానుంది. అయితే హిందీలో 8 వారాల నిబంధన ఉన్న నేపథ్యంలో నవంబర్ రెండో వారం చివరిలో రిషబ్ శెట్టి మూవీ అక్కడ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. త్వరలోనే కాంతార చాప్టర్ 1 ఓటీటీ రిలీజ్ డేట్‌పై అమెజాన్ ప్రైమ్ క్లారిటీ ఇవ్వనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X