For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Malaika Arora అర్జున్ చేతులు మంచానికి కట్టేసి.. రొమాన్స్ చేశావా? కరణ్ జోహర్ ప్రశ్నకు మలైకా జవాబేమిటంటే?

  |

  బాలీవుడ్ నటి మలైకా అరోరా ఇటీవల ప్రారంభించిన టాక్ షో మూవీంగ్ ఇన్ విత్ మలైకా రంజుగా సాగుతున్నది. తాజా ఎపిసోడ్ లో దర్శకుడు, నిర్మాత కరణ్ జోహర్‌తో చేసిన ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగింది. అడల్డ్ కంటెంట్ జొప్పించి ఈ షోను మరింత రంజుగా మార్చారు. అయితే ముఖ్యంగా శృంగార జీవితం గురించి ఇద్దరు చర్చించిన విషయాలు ప్రేక్షకులను కూడా సిగ్గుపడేలా చేశాయి. అర్జున్ కపూర్‌తో రొమాంటిక్ లైఫ్ గురించి అడిగిన విషయాల్లోకి వెళితే..

   అర్బాజ్ ఖాన్‌తో డైవోర్స్ తర్వాత

  అర్బాజ్ ఖాన్‌తో డైవోర్స్ తర్వాత

  కరణ్ జోహర్‌తో మాట్లాడుతూ.. అర్బాజ్ ఖాన్‌తో విడాకుల తర్వాత దారుణమైన జీవితాన్ని గడిపాను. అయితే ఎప్పుడూ ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. నా జీవితంలో జరుగాల్సింది జరిగిపోయిందని అనుకొన్నాను. భవిష్యత్‌లో ఏం చేయాలనే ప్లాన్ చేసుకొన్నాను. అంతేగానీ... ఎవరు ఏమనుకొంటున్నారు. నేను ఎలా రియాక్ట్ కావాలి అనే విషయాన్ని ఆలోచించలేదు అని మలైకా అరోరా ఎమోషనల్ అయ్యారు.

   నా కొడుకు లైఫ్‌లో బ్రేకపా?

  నా కొడుకు లైఫ్‌లో బ్రేకపా?


  అయితే నా కొడుకు అర్హాన్ ఖాన్ నా పరిస్థితిని అర్ధం చేసుకొన్నాడు. నేను తీసుకొన్న నిర్ణయం సరైనదనే భావించాడు. నాకు ఎదురైన క్లిష్టపరిస్థితుల్లో కొడుకు అర్హాన్ వెంట ఉన్నాడు. ఇటీవల నా కొడుకు లవ్ బ్రేకప్ అయిన విషయం నాకు తెలియదు. మా మధ్య అలాంటి టాపిక్ రాదు. చాలా మంది తన కుమారులతో విడిపోయిన భర్త గురించో లేదా.. వారి విషయాలను ఇతరుల నుంచి సేకరించే ప్రయత్నం చేస్తారు. కానీ అలాంటి వాటికి దూరం అని మలైకా చెప్పారు.

  ప్రమాదం తర్వాత అర్బాజ్ ఖాన్..

  ప్రమాదం తర్వాత అర్బాజ్ ఖాన్..


  ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం గురించి మలైకా చెబుతూ దిగ్బ్రాంతికి గురైంది. మాకు ఎదురుగా వస్తున్న లారీ మా వాహనాన్ని ఢీకొట్టింది. ఆ క్షణంలో నాకు ఏం జరిగిందో అర్ధం కాలేదు. ముఖం నిండా గాయాలు. కంటికి పక్కన ఓ గాజు ముక్క కుచ్చుకొన్నది. ఆ ప్రమాదం సమయంలో అర్బాజ్ ఖాన్, ఆయన ఫ్యామిలీ తీసుకొన్న జాగ్రత్తలు నన్ను ఎమోషనల్‌గా మార్చాయి. అర్బాజ్ నాకు అవసరమైన సహాయం చేశాడు. మా మధ్య బ్రేకప్ అయినా నా కోసం హాస్పిటల్‌లో చాలా రోజులు ఉన్నాడు. నాకు సర్జరీ జరిగిన తర్వాత నా కంటి చూపు బాగుందా అని ఆందోళన పడ్డారు. నా ముఖం ముందు చేతులు పెట్టి ఎన్నీ వేళ్లు.. ఇవి ఎన్నీ వేళ్లు అంటూ అడిగాడు అని మలైకా తెలిపారు.

   అర్జున్ కపూర్‌తో రోల్ ప్లే చేస్తావా?

  అర్జున్ కపూర్‌తో రోల్ ప్లే చేస్తావా?


  అర్జున్ కపూర్‌ నా కంటే చాలా తక్కువ వయసు ఉన్న వాడు. అయినా నన్ను బాగా అర్ధం చేసుకొంటాడు అని మలైకా చెప్పింది. అయితే అర్జున్ కపూర్‌తో రోల్ ప్లే చేస్తావా? అని కరణ్ జోహర్ చిలిపి ప్రశ్న అడిగాడు. దాంతో మలైకా సమాధానం చెప్పలేక సిగ్గు పడింది. అయితే నీవు ఎవరితోనైనా రోల్ ప్లే చేశావా అని మలైకా ఎదురు ప్రశ్న వేస్తే.. చాలా మందితో చేశాను. కానీ కొన్నిసార్లు సక్సెస్ అయింది.. కొన్నిసార్లు ఫెయిల్ అయింది అని కరణ్ జోహర్ చెబుతూనే.. ఈ ప్రొగ్రాం మా అమ్మ చూస్తే.. చంపేస్తుంది అని అన్నారు.

   మంచానికి కట్టేసి రొమాన్స్ చేశావా?

  మంచానికి కట్టేసి రొమాన్స్ చేశావా?


  అలాగే మలైకా అరోరాను కరణ్ జోహర్ శృంగారపరమైన ప్రశ్నలను అడుగుతూ విసిగించాడు. అర్జున్‌ కపూర్‌ను మంచానికి కట్టేసి అలాంటి పని చేశావా? అతడి చేతికి హ్యాండ్ కఫ్స్‌ వేసి రొమాన్స్ చేశావా? అని కరణ్ ప్రశ్న వేస్తే.. మలైకా అరోరా కాస్త కోపం ప్రదర్శిస్తూ.. ముందు నా ముందు నుంచి లేచిపో.. ఇక చాలూ.. నువ్వు ఇంటి నుంచి వెళ్లిపో అని చిలిపిగా అరిచింది. కరణ్ జోహర్ సరసమైన సంభాషణ హద్దుల్లేకుండా సాగింది.

  English summary
  Bollywood actress Malaika Arora is started new show titled Moving In With Malaika. She is sharing her life experiences with celebrities. In this occassion, She speak to Karan Johar with high romantic way.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X