For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  OTT: ఓటీటీలో వీకెండ్ ఫెస్టివల్.. ఫ్రైడే ఒక్కరోజే 13 సినిమాలు, మొత్తంగా ఎన్ని అంటే?

  |

  కరోనా కారణంగా వచ్చిన లాక్ డౌన్ తర్వాత ఓటీటీల హవా పెరిగిపోయింది. విభిన్నమైన జోనర్లలో సినిమాలు, సిరీస్ లను తీసుకు రావడంతో ప్రేక్షకులకు, సినీ లవర్స్ కు మంచి టైమ్ పాస్ ఏర్పడింది. దీంతో సిని ప్రియుల అభిరుచి కూడా మారింది. ఇక వాళ్ల అభిరుచికి తగినట్లుగా సొంతంగా సినిమాలను నిర్మించాయి ఓటీటీ సంస్థలు.

  తర్వాత కరోనా తగ్గడం, థియేటర్లు ఓపెన్ అయ్యాక కూడా ఓటీటీలో చిత్రాలను రిలీజ్ చేస్తూ వచ్చారు. ఇటీవల సంక్రాంతి పండుగకు థియేటర్లు మాత్రమే కాకుండా ఓటీటీలు సైతం సినిమాలు, సిరీస్ లతో కళకళలాడాయి. ఇప్పుడు డిజిటల్ వేదికపై ఈ వీకెండ్ కి మరోసారి సినిమాలు తమ జోరు చూపించనున్నాయి.

  దిల్ రాజు-హరీష్ శంకర్ 'ఏటీఎమ్'..

  దిల్ రాజు-హరీష్ శంకర్ 'ఏటీఎమ్'..

  బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్ విన్నర్ వీజే సన్నీ, బిగ్ బాస్ బ్యూటీ దివి వాద్యా, సుబ్బరాజు, దివ్య వాణి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ఏటీఎమ్. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ హరీష్ శంకర్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తోన్న ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 ఫ్లాట్ ఫామ్ లో జనవరి 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. కోట్ల రూపాయల ఏటీఎమ్ దొంగతనం నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్ గా తరెకెక్కిన ఈ వెబ్ సిరీస్ కు చంద్ర మోహన్ దర్శకత్వం వహించారు.

  రకుల్ ప్రీత్ సింగ్ 'ఛత్రీవాలీ'..

  రకుల్ ప్రీత్ సింగ్ 'ఛత్రీవాలీ'..

  టాలీవుడ్ స్టార్ హీరోయిన్, బాలీవుడ్ ఫిట్ నెస్ సుందరి రకుల్ ప్రీత్ సింగ్ 2022లో వరుసగా 5 డిజాస్టర్స్ అందుకుంది. ఇప్పుడు ఈ ఏడాది సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అది కూడా హిందీ చిత్రంతో నేరుగా ఓటీటీలో అలరించనుంది ఈ క్యూట్ బ్యూటి. రకుల్ ప్రీత్ సింగ్ కండోమ్ టెస్టర్ గా నటించిన సినిమా ఛత్రీవాలి. ప్రముఖ నిర్మాత రోనీ స్క్రూవాలా నిర్మించిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని తేజాస్ ప్రభ, డియోస్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా జీ5 వేదికగా జనవరి 20న విడుదల కానుంది.

  రష్మిక మందన్నా 'మిషన్ మజ్ను'..

  రష్మిక మందన్నా 'మిషన్ మజ్ను'..

  నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పుష్ప సినిమాతో వచ్చిన క్రేజ్ తో వరుసగా సౌత్ తో పాటు హిందీ చిత్రాలు కూడా చేస్తూ ముందుకు సాగుతోంది. ఇటీవల గుడ్ బై, వారసుడు సినిమాలతో అభిమానులను పలకరించిన రష్మిక మందన్నా తాజాగా మరొక సినిమాతో అలరించనుంది. మిషన్ మజ్ను అనే హిందీ సినిమాతో ఓటీటీలోకి అడుగుపెట్టిందీ బ్యూటీ. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించిన ఈ సినిమా డైరెక్ట్ గా జనవరి 20న ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాకు శంతన్ బాగ్చి దర్శకత్వం వహించారు.

  రవితేజ 'ధమాకా'..

  రవితేజ 'ధమాకా'..

  మాస్ మహరాజా రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన చిత్రం 'ధమాకా'. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీలా హీరోయిన్‌గా అదరగొట్టింది. డిసెంబర్ 23, 2022న థియేటర్లలో విడుదలై ఘన విజయం సాధించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. భీమ్స్ సంగీతం అందించిన ధమాకా మూవీ నెట్ ఫ్లిక్స్ వేదికగా జనవరి 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

  అంజలి 'ఝాన్సీ' 2 సీజన్..

  అంజలి 'ఝాన్సీ' 2 సీజన్..

  టాలీవుడ్ హీరోయిన్ అంజలితోపాటు బ్యూటిఫుల్ చాందినీ చౌదరి, ఆదర్శ్ బాలకృష్ణ, సంయుక్త హోర్నాడ్ కీలక పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ఝాన్సీ. తిరు దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ అక్టోబర్ 27, 2022న ఆరు ఎపిసోడ్స్ గా విడుదలైంది. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ కు రెండో సీజన్ ను తీసుకొచ్చారు. సస్పెన్స్ క్రైమ్ అండ్ సైకాలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంతో వచ్చిన ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో జనవరి 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

  ఐశ్వర్య రాజేష్ 'డ్రైవర్ జమున'..

  ఐశ్వర్య రాజేష్ 'డ్రైవర్ జమున'..

  ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా వేదికగా ఐశ్వర్య రాజేష్ నటించిన 'డ్రైవర్ జమున' తమిళ చిత్రం, 'కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్' స్టాండ్ అప్ కామెడీ షో 7వ ఎపిసోడ్ జనవరి 20 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి. అలాగే 'యూత్ ఆఫ్ మే' (తెలుగులో) కొరియాన్ డ్రామా ఆహాలో జనవరి 21న రిలీజ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ లో 'ది లెజెండ్ ఆఫ్ వోక్స్ మకీనా' అనే ఇంగ్లీష్ సిరీస్ సీజన్ 2, 'మార్తే డమ్ టక్' సినిమా జనవరి 20 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి. ఇంగ్లీష్ సిరీస్ 'లిపార్డ్ స్కీన్' జనవరి 20న లయన్స్ గేట్ ప్లేలో విడుదల కానుంది. ఇవే కాకుండా మరికొన్ని చిత్రాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి.

  నెట్ ఫ్లిక్స్

  నెట్ ఫ్లిక్స్

  అల్ఖాలత్ (అరబిక్ చిత్రం)- జనవరి 19న విడుదల

  జుంజీ ఇటియో మనియాక్ (జపనీస్ వెబ్ సిరీస్)- జనవరి 19న రిలీజ్
  కాపా (మలయాళ సినిమా)- జనవరి 19
  ది 90స్ షో (ఇంగ్లీష్ సిరీస్)- జనవరి 19
  ఉమెన ఎట్ వార్ (ఫ్రెంచ్ మూవీ)- జనవరి 19
  బ్లింగ్ ఎంపైర్: న్యూయార్క్ (ఇంగ్లీష్ రియాలిటీ షో)- జనవరి 20
  జంగ్-ఈ (కొరియన్ సినిమా)- జనవరి 20
  బేక్ స్క్వాడ్ 2 సీజన్ (వెబ్ సిరీస్)- జనవరి 20
  ఫౌదా సీజన్ 4 (అరబిక్ అండ్ ఇంగ్లీష్ సిరీస్)- జనవరి 20
  శాంటీ టౌన్ (ఇంగ్లీష్ సిరీస్)- జనవరి 20
  రిప్రజెంట్ (ఫ్రెంచ్ సిరీస్)- జనవరి 20
  సాహమరన్ (టర్కీస్ సిరీస్)- జనవరి 20

  English summary
  Rakul Preet Singh Chhatriwali To ATM Web Series OTT Movies And Web Series In OTT Platforms For January Third Week 2023
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X