For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  OTT: ఓటీటీల్లో సంక్రాంతి ధమాకా.. ఏకంగా 24 చిత్రాలు.. ఒక్కరోజే 10 సినిమాలు

  |

  తెలుగు సినిమాలకు సంక్రాంతి పండుగ సీజన్ ఎంతో ప్రతిష్టాత్మకమైంది. అందుకే స్టార్ హీరోలు, ప్రొడ్యూసర్స్ సైతం ఈ పండుగపైనే ఫోకస్ పెడుతూ తమ చిత్రాలను ఆడించాలని ప్రయత్నిస్తారు. ఇక 2023 సంక్రాంతి బరిలో నలుగురు స్టార్ హీరోలు థియేటర్లలో పోటీ పడుతున్నారు. ఇదివరకే తెలుగులో బాలకృష్ణ వీర సింహా రెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య, అజిత్ తెగింపు విడుదల కాగా జనవరి 14న వారసుడు విడుదల కానుంది. అయితే ఈ సంక్రాంతికి థియేటర్లే కాకుండా ఓటీటీ వేదికలు కూడా కళకళలాడనున్నాయి. మరి ఈ సంక్రాంతి ఈ వీకెండ్ కు డిజిటల్ తెరపై సందడి చేసే సినిమాలు ఏంటో చూసేద్దామా!

  విశాల్ లాఠీ సినిమా..

  విశాల్ లాఠీ సినిమా..

  ఈ సంవత్సరం సంక్రాంతి పండుగకు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లు కళకళలాడనున్నాయి. అందులో ఎక్కువగా ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఎక్కువగా చిత్రాలు విడుదల కానున్నాయి. కోలీవుడ్ హీరో విశాల్ తాజాగా నటించిన చిత్రం లాఠీ. డిసెంబర్ 22న విడుదలైన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేదు. దీంతో త్వరగానే ఓటీటీలోకి తీసుకువస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14 నుంచి సన్ ఎన్ఎక్స్ టీ వేదికగా తెలుగు, తమిళం వెర్షన్ లో స్ట్రీమింగ్ కానుంది.

  దృశ్యం 2తోపాటు అమెజాన్ ప్రైమ్ లో..

  దృశ్యం 2తోపాటు అమెజాన్ ప్రైమ్ లో..

  క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో సూపర్ హిట్ కొట్టిన చిత్రం దృశ్యం. మలయాళ చిత్రంగా వచ్చిన ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో కూడా మంచి విజయం సాధించింది. దీనికి సీక్వెల్ గా వచ్చిన దృశ్యం 2 కూడా అంతే స్థాయిలో సక్సెస్ అందుకుంది. ఇదే పేరుతో హిందీలో కూడా ఈ సీక్వెల్ ను రీమెక్ చేశారు. అజయ్ దేవగణ్, శ్రీయ సరన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో జనవరి 13న అంటే ఇవాళ విడుదలైంది. ఇదే కాకుండా అమెజాన్ ప్రైమ్ లో 'హంటర్స్' సీజన్ 2 జనవరి 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

   డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో..

  డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో..


  అన్ని రకాల భాషల్లో చిత్రాలు, వెబ్ సిరీస్ లను అందించే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో జనవరి 10 నుంచి 'కోలా మ్యాన్' అనే హాలీవుడ్ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే జనవరి 11న బుధవారం 'ఛేజింగ్ వేవ్స్' అనే హాలీవుడ్ డాక్యుమెంటరీ చిత్రం విడుదలై స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాకుండా తెలుగు డబ్ మూవీ 'ముకుందన్ ఉన్న అసోసియేట్స్' జనవరి 13న అంటే ఇవాళ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైంది.

  నెట్ ఫ్లిక్స్ లో..

  నెట్ ఫ్లిక్స్ లో..

  జనవరి 10 నుంచి హాలీవుడ్ చిత్రాలు 'ఆండ్రూ శాంటినో- చీజ్ బర్గర్', 'ది హ్యాచ్ వీల్డింగ్ హిచీకర్' స్ట్రీమింగ్ కానుండగా.. స్పానిష్ మూవీ 'నాయిస్', పోలీస్ సిరీస్ 'సెక్సిఫై సీజన్ 2' జనవరి 11న విడుదల అయ్యాయి. ఇక జనవరి 12 నుంచి జపనీస్ చిత్రం 'ది మకనై: కుకింగ్ ఫర్ ది మైకో హౌజ్, హాలీవుడ్ సిరీస్ 'వైకింగ్స్: వల్హల్లా' సీజన్ 2, పాపులర్ వెబ్ సిరీస్ 'కుంగ్ ఫూ పాండా: ది డ్రాగన్ నైట్' స్ట్రీమింగ్ అవుతున్నాయి. జనవరి 13 నుంచి 'బ్రేక్ పాయింట్', 'డాగ్ గాన్', 'స్కై రోజ్' సీజన్ 3, 'ట్రైల్ బై ఫైర్' హిందీ సిరీస్ ప్రసారం అవుతున్నాయి. ఇక జనవరి 14న కొరియన్ సిరీస్ 'క్రాష్ కోర్స్ ఇన్ రొమాన్స్' రిలీజ్ కానుండగా.. 'వరలరు ముఖ్యం' అనే తమిళ చిత్రం జనవరి 15న విడుదల కానుంది.

  జీ5

  జీ5

  'హెడ్ బుష్' అనే కన్నడ సినిమా జీ5లో జనవరి 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అలాగే 'తట్టసెరి కొట్టమ్' అనే మలయాళ చిత్రం కూడా జనవరి 13న విడుదల కానుంది. లయన్స్ గేట్ ఓటీటీలో 'గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్' ను జనవరి 11 నుంచి ప్రసారం చేయనుండగా.. జనవరి 13న 'లాంబోర్గిని: ది మ్యాన్ బిహైండ్ ది లెజెండ్' హాలీవుడ్ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఇక హాయ్ చాయ్ అనే ఓటీటీలో బెంగాలీ చిత్రం 'బల్లవపూరెర్ రూపక్తా'ను జనవరి 13 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నారు. బుక్ మై షోలో 'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్' ఇంగ్లీష్ చిత్రాన్ని జనవరి 12న రిలీజ్ చేశారు.

  English summary
  Vishal Lathi To Ajay Devgn Drishyam 2 OTT Movies And Web Series In OTT Platforms For Sankranti 2023
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X